● పర్యాటకులకు విహంగ వీక్షణ ఏర్పాటు | - | Sakshi
Sakshi News home page

● పర్యాటకులకు విహంగ వీక్షణ ఏర్పాటు

Jan 10 2026 8:15 AM | Updated on Jan 10 2026 8:15 AM

● పర్

● పర్యాటకులకు విహంగ వీక్షణ ఏర్పాటు

● పర్యాటకులకు విహంగ వీక్షణ ఏర్పాటు

సాహస క్రీడలు

రేపటి నుంచి ఉత్సవాలు

జమ్మలమడుగు: 11వ శతాబ్దంలో చాణక్య రాజైన కాకరాజు గండికోట నిర్మాణం కోసం శ్రీకారం చుట్టారు. ఇప్పటికి గండికోట నిర్మాణం జరిగి 903 సంవత్సరాలు అవుతున్నట్లు చరిత్ర చెబుతోంది. ఇక్కడ గోల్కొండ నవాబుల కాలంలో జుమ్మా మసీదు నిర్మించారు. శ్రీకృష్ణదేవరాయలు సైతం గండికోటను పాలించినట్లు చరిత్ర చెబుతోంది. ఇంత ఘన చరిత్ర కలిసిన గండికోట వైభవాన్ని ప్రపంచానికి తెలియపరిచేందుకు గండికోట ఉత్సవాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం గ్రాండ్‌ కెన్యాన్‌ ఆఫ్‌ ఇండియాగా ప్రపంచంలో ప్రఖ్యాతి గాంచిన గండికోట అందాలను వీక్షించడం కోసం ఇతర రాష్ట్రాల నుంచి భారీగా పర్యాటకులు వచ్చిపోతున్నారు. గండికోట అభివృద్ధికి నాటి ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి శ్రీకారం చుట్టారు.

పర్యాటకులకు వసతి గృహాలు

గండికోటకు వచ్చే పర్యాటకులకు సరైన వసతుల కల్పన కోసం టూరిజం అభివృద్ధి కింద హరిత హోటల్‌ నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం ఇది పర్యాటకులకు ఎంతో ఉపయోగపడుతోంది. ప్రస్తుతం గండికోటలో రిసార్టులతోపాటు, టూరిస్టుల కోసం టెంట్‌ కల్చర్‌ను తీసుకు రావడంతో పర్యాటకులు పెన్నా నది అందాలు చూడటంతో పాటు సూర్యోదయం, సూర్యా స్తమయం వీక్షించి కనులపండువ చేసుకుంటున్నారు. పెన్నానది లోయ అందాలను ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌లలో పెడుతుండటంతో భారీగా పర్యాటకులు వస్తున్నారు.

11 నుంచి గండికోట ఉత్సవాలు

గండికోట ఉత్సవాలు ఈనెల 11వ తేదీ ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ప్రముఖ గాయని మంగ్లీతోపాటు రామ్‌ మిర్యాల పాటల కార్యక్రమం,ప్రముఖ డ్రమ్స్‌ శివమణితో ప్రోగ్రామ్‌ ఏర్పాటు చేశారు.

అసలు సమస్య రవాణా సౌకర్యం

పర్యాటక కేంద్రమైన గండికోటకు సరైన రవాణా సౌకర్యం లేదు. ఆర్టీసీ బస్సులు ఉదయం, సాయంత్రం పూట మాత్రమే గండికోటకు ఉన్నాయి. ఆ తర్వాత ఆటోలపైనే పర్యాటకులు, స్థానికులు ఆధారపడవలసి వస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వం గండికోట ఉత్సవాలకు శ్రీకారం చుట్టినందున పర్యాటకులకు సరైన రవాణా సౌకర్యం కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉంది.

ఇప్పటికే ఆడ్వెంచర్‌ అకాడమీ పేరుతో ఎవరెస్టు శిఖరం అధిరోహించిన వారితో ప్రత్యేక సాహస క్రీడలను నిర్వహిస్తున్నారు. అలాగే జీప్‌ రైడింగ్‌తో పాటు, రాక్‌ క్లయింబింగ్‌ వంటి కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. అంతేకాకుండా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో బోటింగ్‌ కూడా మైలవరం జలాశయంలో ఏర్పాటు చేశారు.

గండికోటకు 903 సంవత్సరాలు

ఉత్సవాల సందర్భంగా విహంగ్‌ సవారి

మూడు రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు

చురుగ్గా ఏర్పాట్లు

పర్యాటకులకు గండికోట అందాలతో పాటు మైలవరం జలాశయం, ఆకాశ మార్గం నుంచి పెన్నానది లోయ అందాలు ఎంతో అద్భుతంగా పర్యాటకులకు చూపించాలనే లక్ష్యంతో విశాఖపట్నంకు చెందిన విహంగ్‌ సంస్థ ప్యారమోటర్స్‌, హెలిక్యాప్టర్‌ల ద్వారా సన్నద్ధమైంది. ఈ క్రమంలో హెలిక్యాప్టర్‌ శనివారం గండికోటకు చేరుకోనుంది. హెలిక్యాప్టర్‌లో పర్యాటకులు వీక్షించాలంటే ఐదువేల రూపాయలు ఒక్కరికి చెల్లించాల్సి ఉంటుంది. ఆరు నిమిషాల పాటు ఆకాశ మార్గంలో విహరించి గండికోట అందాలను చూపించబోతున్నారు.

● పర్యాటకులకు విహంగ వీక్షణ ఏర్పాటు 1
1/2

● పర్యాటకులకు విహంగ వీక్షణ ఏర్పాటు

● పర్యాటకులకు విహంగ వీక్షణ ఏర్పాటు 2
2/2

● పర్యాటకులకు విహంగ వీక్షణ ఏర్పాటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement