వైవీయూలో ఫ్యాకల్టీ మేనేజ్‌మెంట్ సిస్టం ప్రారంభం
కడప ఎడ్యుకేషన్ : యోగివేమన విశ్వవిద్యాలయంలో వెబ్‌సైట్‌లో ఫ్యాకల్టీ మేనేజ్‌మెంట్ సిస్టంను శుక్రవారం వీసీ ప్రొఫెసర్ బెల్లంకొండ రాజశేఖర్ ప్రారంభించారు. విశ్వవిద్యాలయంలో పనిచేసే అధ్యాపకుల రోజువారి ప్రగతిని నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. తద్వారా విశ్వవిద్యాలయంలో బోధన, పరిశోధనపరంగా జరుగుతున్న అభివృద్ధి ప్రపంచానికి వీక్షణగా ఉంచడమే లక్ష్యమన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి అక్రిడేటెడ్ ఆర్గనైజేషన్స్, ర్యాంకింగ్ సంస్థలు, జాతీయ సర్వే సంస్థలు విశ్వవిద్యాలయ డేటాను తీసుకోవడానికి సులువుగా ఉంటుందన్నారు. ఐటీ సెల్ డైరెక్టర్ ఆచార్య తుమ్మలకుంట శివ వెబ్‌సైట్‌లోని ఎఫ్‌ఎంఎస్ ఫంక్షన్ గురించి వివరించారు. కార్యక్రమంలో పీఎం ఉషా కోఆర్డినేటర్ డాక్టర్ పి చంద్రశేఖర్, ఐక్యూఏసీ సంచాలకులు డాక్టర్ డాక్టర్ సుబ్రహ్మణ్యం శర్మ, లా అండ్ మేనేజ్‌మెంట్ డీన్ ఆచార్యవై సుబ్బరాయుడు, డాక్టర్ జయంతి కశ్యప్, ఆచార్య మధుసూదన్ రెడ్డి, డాక్టర్ రామకృష్ణ పాల్గొన్నారు.


