కమిటీల డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి
● నియోజకవర్గ సమన్వయకర్తల
ప్రత్యేక చొరవతోనే సాధ్యం
● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
పి.రవీంద్రనాథ్‌రెడ్డి
జిల్లా కోర్ కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి
కోర్ కమిటీ సమావేశానికి హాజరైన సభ్యులు
కడేప కార్పొరేషన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రామ, వార్డు కమిటీల డిజిటలైజేషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కోర్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకూ అన్ని నియోజకవర్గాల్లో రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించిన గ్రామ, వార్డు, డివిజన్ కమిటీలను రూపొందించడం జరిగిందన్నారు. ఇప్పుడు వాటిని డిజిటలైజేషన్ చేయాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో నియోజకవర్గ ఉపాధ్యక్షులు, ఆర్గనైజేషన్ సెక్రటరీల సేవలను దీనికి ఉపయోగించుకోవాలన్నారు. ఈనెల 25వ తేదిలోపు ఈ ప్రక్రి య పూర్తి చేయాలని సూచించారు. అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు ప్రత్యేక చొరవ చూపి డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ఇది పూర్తయిన తర్వాత ప్రతి ఒక్కరికీ గుర్తింపు కార్డులు అందజేయడం జరుగుతుందన్నారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అఽధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 12 మంది వలంటీర్లను నియమించి 32 రోజులు కష్టపడి డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి చేశామన్నారు. సమన్వయకర్త బాధ్యత తీసుకుంటేనే ఇది సాధ్యమవుతుందన్నారు. దేశంలో జెండాకు జెండా జత కట్టకుండా, తన జెండాకు జనాన్ని జత కట్టి విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్న ఏకై క నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డేనని తెలిపారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వజ్రభాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ కడప పార్లమెంటు నియోజకవర్గాన్ని రోల్‌మోడల్‌గా తీసుకొని 90వేల మందితో కమిటీలు పూర్తి చేశామని, వాటిని ఇప్పుడు డిజిటలైజేషన్ చేయాల్సి ఉందన్నారు. 15రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి(జోనల్ కో ఆర్డినేషన్) చల్లా మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ కడప పార్లమెంటు పరిధిలో ప్రొద్దుటూరు నియోజకవర్గంలో వందశాతం డిజిటలైజేషన్ పూర్తయ్యిందని, కమలాపురం 30 శాతం పూర్తయ్యిందన్నారు. ప్రతి నియోజకవర్గంలో 10 మందిని సభ్యులను నియమించుకొని ఈ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. వారికి తాము శిక్షణ ఇస్తామన్నారు. ఈ ప్రక్రియలో అభ్యర్థి ఫోటో తప్పనిసరి అని తెలిపారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి(కేంద్రకార్యాలయం) పోతుల శివారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో సుమారు 900 యూనిట్లు ఉన్నాయని, అందులో ఉన్న కమిటీలను డిజిటలైజేషన్ చేయడంలో ఏ సమస్య వచ్చినా పరిష్కరించేందుకు తాము 24 గంటలు అందుబాటులో ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ క్రమశిక్షణా కమిటీ ఛైర్మెన్ రఘురామిరెడ్డి, పీఏసీ సభ్యులు ఎస్‌బి అంజద్‌బాష, ఎమ్మెల్సీలు పి. రామసుబ్బారెడ్డి, డీసీ గోవిందరెడ్డి, ఎంవీ రామచంద్రారెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, బద్వేల్ ఎమ్మెల్యే డా. దాసరి సుధ, జెడ్పీ ఛైర్మెన్ రామగోవిందు రెడ్డి, మేయర్ పాకా సురేష్ కుమార్, కమలాపురం సమన్వయకర్త నరేన్ రామాంజులరెడ్డి, సీఈసీ సభ్యులు ఏ. మల్లికార్జునరెడ్డి, ఎస్‌ఈసీ సభ్యులు యానాదయ్య, డా. సొహైల్, రాజోలి వీరారెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు గురుమోహన్, ఆర్. వెంకట సుబ్బారెడ్డి, డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కమిటీల డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి


