వామ్మో.. 13 అడుగుల కింగ్ కోబ్రా | 13 foot long king cobra causes a stir in Anakapalli | Sakshi
Sakshi News home page

వామ్మో.. 13 అడుగుల కింగ్ కోబ్రా

Nov 17 2026 1:15 PM | Updated on Nov 17 2026 1:19 PM

13 foot long king cobra causes a stir in Anakapalli

అనకాపల్లి: మాడుగుల మండలంలో కె.జె.పురం మసీదు వెనుక భాగంలో 13 అడుగుల గిరినాగును స్నేక్‌ కేచర్‌ పి. వెంకటేష్‌ చాకచక్యంగా పట్టుకున్నారు. సోమవారం సాయంత్రం ఇక్కడ ఇంటి పని చేస్తుండగా తాపీమే్రస్తికి గిరినాగు కంటబడింది. వెంటనే అక్కడున్న శ్రీపతి హరి, గుమ్మాల మాలిబాబు, తదితరులకు విషయం చెప్పారు. 

ఇక్కడ గిరినాగు సంచరిస్తున్నట్టు మాడుగులకు చెందిన స్నేక్‌ కేచర్‌ పి. వెంకటేష్ కు సమాచారం అందించారు. ఆయన వెంటనే వచ్చి చాకచక్యంగా గిరినాగును ప ట్టుకుని గోనె సంచిలో బంధించారు. దాన్ని అడవిలో వదిలి పెడతామన్నారు. ఇటువంటి విషపూరిత పాములు కనిపిస్తే అటవీ శాఖ లేదా స్నేక్‌ క్యాచర్‌కు సమాచారం అందించాలని ఆయన కోరారు.    

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement