ఏపీ వైపు దూసుకొస్తున్న అక్వాన్‌.. | Cyclone Akvan: Andhra Pradesh November 17, 2026 Updates | Sakshi
Sakshi News home page

ఏపీ వైపు దూసుకొస్తున్న అక్వాన్‌..

Nov 17 2026 8:26 AM | Updated on Nov 17 2026 8:48 AM

Cyclone Akvan: Andhra Pradesh November 17, 2026 Updates

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం సోమవారం తుపానుగా బలపడింది. దీనికి ‘అక్వాన్‌’గా నామకరణం చేశారు. గంటకు 10 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న ఈ తుపాను సోమవారంరాత్రి చెన్నైకి 610 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 660, విశాఖపట్నానికి 670, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 790 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇవాళ(మంగళవారం) సాయంత్రానికి ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా మారనుంది.

నేడు తీవ్ర తుపానుగా బలపడనున్న అక్వాన్..

  • ఈనెల 20న మచిలీపట్నం సమీపంలో ఆక్వాన్ తుపాను తీరం దాటే అవకాశం

  • మచిలీపట్నంకి ఆగ్నేయంగా 660కిమీ, విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 670 కిమీ దూరంలో కొనసాగుతున్న ఆక్వాన్..

  • భీకర గాలులు, అత్యంత భారీ వర్షాలు: ఐఎండీ

  • రాష్ట్రంలో అన్ని ప్రధాన పోర్టులకు గ్రేట్ డేంజర్ సిగ్నల్ 1 జారీ

  • 19,20 తేదీల్లో అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ

బంగాళాఖాతంలో అక్వాన్ తుపాను

  • గడిచిన 9 గంటల్లో స్థిరంగా కేంద్రీకృతమైన తుపాను

  • ఇవాళ సాయంత్రానికి తీవ్ర తుపానుగా మారే అవకాశం

  • చెన్నైకి 610 కి.మీ, మచిలీపట్నానికి 660 కి.మీ, విశాఖపట్నానికి 670 కి.మీ, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 790 కి.మీ దూరంలో కేంద్రీకృతం

  • పశ్చిమ-వాయవ్య దిశలో ప్రయాణిస్తూ ఎల్లుండి ఉదయానికి అతి తీవ్ర తుపానుగా బలపడే అవకాశం

  • శుక్రవారం మధ్యాహ్నానికి నెల్లూరు - తుని మధ్య అక్వాన్ తుపాను తీరం దాటే అవకాశం

  • తుపాను తీరం దాటే సమయంలో గంటకు 120-130 కి.మీ, గరిష్ఠంగా 145 కి.మీ వేగంతో బలమైన గాలులు

  • మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరిక

  • తుపాను ప్రభావంతో రేపు కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే ఛాన్స్

  • గురు, శుక్రవారాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం

  • తుపాను సమస్యల పరిష్కారం కోసం 'మన మిత్ర' వాట్సాప్ నంబర్ 9552300009

  • అత్యవసర సహాయం కోసం టోల్ ఫ్రీ నంబర్లు 112, 1070, 18004250101  

  • కోస్తా తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

  • రైతులు వ్యవసాయ పనుల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి: విపత్తుల నిర్వహణ సంస్థ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement