'రూ.100, రూ.50 నోట్లను రద్దు చేయం' | No intention to demonetise Rs 100/50 notes: Government | Sakshi
Sakshi News home page

'రూ.100, రూ.50 నోట్లను రద్దు చేయం'

Nov 16 2016 10:21 PM | Updated on Sep 4 2017 8:15 PM

'రూ.100, రూ.50 నోట్లను రద్దు చేయం'

'రూ.100, రూ.50 నోట్లను రద్దు చేయం'

రూ.100, రూ.50 నోట్లు రద్దు కాబోతున్నాయనే పుకార్లను కేంద్ర ప్రభుత్వం బుధవారం కొట్టిపారేసింది.

న్యూఢిల్లీ: రూ.100, రూ.50 నోట్లు రద్దు కాబోతున్నాయనే పుకార్లను కేంద్ర ప్రభుత్వం బుధవారం కొట్టిపారేసింది. రూ.100, రూ.50 నోట్లను రద్దు చేస్తూ ప్రధానమంత్రి మరలా జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారనే వార్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నట్లు చెప్పింది.

బ్యాంకుల్లోని బంగారం లాకర్లపై ఎలాంటి ఆంక్షలు విధించలేదని ఈ సందర్భంగా పేర్కొంది. రూ.2వేల నోటు రంగు కోల్పోతుందని చెప్పుకొచ్చిన కేంద్రం.. రంగు కోల్పోయినా నోటు చెల్లుబాటు అవుతుందని తెలిపింది. రూ.2వేల నోటులో ఎలాంటి చిప్ ను అమర్చలేదని చెప్పింది. ప్రజలకు తప్పుడు సమాచారం అందించేవారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement