breaking news
NPCIL
-
భారత్–సింగపూర్ మధ్య నిధుల బదిలీ సులభతరం
న్యూఢిల్లీ: భారత్–సింగపూర్ మధ్య నిధుల బదిలీని మరింత సులభతరం చేస్తూ.. యూపీఐ–పేనౌ కిందకు మరో 13 బ్యాంక్‌లను చేర్చినట్టు ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ ప్రకటించింది. ఈ నెట్వర్క్ పరిధిలోకి మొత్తం 19 భారత బ్యాంక్‌లు చేరినట్టయింది. ‘‘జూలై 17 నుంచి రెండు దేశాల్లోని యూజర్లు మరిన్ని బ్యాంకుల పరిధిలో నిధులను బదిలీని సులభంగా చేసుకోవచ్చు. ఈ సేవ మరింత సౌకర్యంగా, అందుబాటులోకి వస్తుంది’’అని ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ (ఎన్ఐపీఎల్) తెలిపింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ)కి ఎన్ఐపీఎల్ అనుబంధ సంస్థ కావడం గమనార్హం. ఆర్బీఐ, మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్ (ఎంఏఎస్) సంయుక్తంగా యూపీఐ–పేనౌ సేవలను లోగడ ప్రారంభించడం తెలిసిందే. -
ఎన్పీసీఐ సమావేశం..గూగుల్‌పే, ఫోన్‌పేకు లేని ఆహ్వానం!
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఆధ్వర్యంలోని యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ఇటీవల నిర్వహించిన ఓ సమావేశానికి యూపీఐ థర్డ్‌పార్టీ చెల్లింపు యాప్‌లైన గూగుల్‌పే, ఫేన్‌పేను ఆహ్వానించలేదు. క్రెడ్, స్లైస్, ఫ్యామ్‌పే, జొమాటో, గ్రో, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థల యాజమాన్యాలకు ఆహ్వానం అందింది. ఈమేరకు వివరాలు ఉటంకిస్తూ టైక్స్‌ఆఫ్‌ఇండియాలో కథనం వెలువడింది. ఎన్పీసీఐ ఏర్పాటు చేసిన సమావేశంలో భాగంగా యూపీఐ చెల్లింపుల వ్యవస్థలో కొత్త సంస్థలకు ప్రోత్సాహం అందించేలా చర్చలు జరిగినట్లు తెలిసింది. పైన తెలిపిన కంపెనీలు తమ వినియోగదారులను పెంచుకుని ఇంటర్నల్ యూపీఐ సర్వీస్‌లను అందించేలా చూడాలని ఎన్పీసీఐ చెప్పింది. అయితే సమావేశానికి గూగుల్‌పే, ఫోన్‌పే, పేటీఎం వంటి ప్రధాన యూపీఐ చెల్లింపు యాప్ యాజమాన్యాలకు ఆహ్వానం అందలేదు. ఈ మూడు కంపెనీల యూపీఐ లావాదేవీల పరిమాణం ఇప్పటికే 90 శాతానికి చేరినట్లు తెలిసింది. దాంతో వీటిని సమావేశానికి ఆహ్వానించలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కార్యక్రమం ప్రధానంగా కొత్తగా యూపీఐ చెల్లింపుల రంగంలోకి అడుగుపెడుతున్న కంపెనీలు, స్టార్టప్‌లకు ప్రోత్సాహం అందించడానికి ఏర్పాటు చేయబడినట్లు తెలిసింది. ఆయా కంపెనీల అవసరాలు ఏమిటో తెలుసుకుని వాటిని పరిష్కరించేలా చర్చలు జరిగినట్లు సమాచారం. సమావేశంలో భాగంగా కొత్త సంస్థలు రూపేకార్డుల కోసం ప్రభుత్వం అందిస్తున్న జీరో మర్చంట్ డిస్కౌంట్ రేట్(ఎండీఆర్) వంటి సౌకర్యాన్ని తమకు కల్పించాలని ఎన్పీసీఐను కోరినట్లు తెలిసింది. ఇతర కార్డ్‌లతో పోల్చితే రూపేకార్డు చెల్లింపులను అంగీకరించే వ్యాపారులకు ప్రయోజనాలు అధికంగా ఉంటున్నాయి. చిన్న సంస్థలు యూపీఐ చెల్లింపుల రంగంలోకి రావాలంటే ప్రత్యేకంగా కొన్ని ప్రోత్సాహకాలు కల్పించాలని కోరినట్లు తెలిసింది. రెండు సంస్థలదే గుత్తాధిపత్యం.. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌కు సంబంధించి అక్రమ లావాదేవీలు జరిగినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇటీవల ఫోన్‌పే, గూగుల్పేలకు ఆదరణ పెరిగింది. యూపీఐ చెల్లింపుల్లో 2 సంస్థలదే ఆధిపత్యం కావడంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ విభాగంలో గుత్తాధిపత్యం లభించకుండా చూసేందుకు ఫోన్‌పే, గూగుల్‌పే సంస్థలకు ప్రత్యామ్నాయంగా దేశీయ ఫిన్‌టెక్ సంస్థల వృద్ధికి సహకరించాలని ప్రభుత్వానికి పార్లమెంటరీ కమిటీ సూచించిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: ఏడాదిలోపు ప్రముఖ యాప్‌లో 100 కోట్ల యూజర్లు యూపీఐ విభాగంలో కంపెనీలకు 30% మార్కెట్ వాటా పరిమితి నిబంధన గడువును 2024 డిసెంబరు వరకు పొడిగించాలని ఎన్పీసీఐ అంటోంది. సాంకేతిక పరిమితుల రీత్యా ఇది సాధ్యం కాకపోవచ్చనే అభిప్రాయం వినిపిస్తోంది. -
ఏపీలో ఎన్పీసీఐఎల్ అణువిద్యుత్ ప్లాంటు!
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ప్రభుత్వం తిరస్కరించిన అణు విద్యుత్ ప్లాంటును ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసేందుకు నేషనల్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐఎల్) ప్రయత్నిస్తోంది. ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు ఏపీలో తగిన స్థలం కోసం అన్వేషిస్తోంది. నిజానికి బెంగాల్‌లోని హరిపూర్ పట్టణంలో ఎన్పీసీఐఎల్ ఈ అణు విద్యుత్ ప్లాంటును ఏర్పాటు చేయాలని గతంలో తలపెట్టింది. అయితే స్థానిక రైతులు, మత్స్యకారుల నుంచి తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రతిపాదిత 6వేల మెగావాట్ల ఈ విద్యుదుత్పత్తి ప్లాంటుకు నో చెప్పింది. ఈ నేపథ్యంలో ఎన్పీసీఐఎల్ దృష్టి తాజాగా ఆంధ్రప్రదేశ్‌పై పడింది. దీనిపై ఎన్పీసీఐఎల్ బోర్డు సభ్యుల్లో ఒకరైన బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ డెరైక్టర్ శేఖర్ బసు శనివారం కోల్‌కతాలో మాట్లాడుతూ హరిపూర్‌లో ప్రతిపాదించిన అణువిద్యుత్ ప్లాంటు తరహాదానిని.. ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని, ఇందుకోసం రాష్ట్రానికి చెందిన కోస్తా తీర ప్రాంతంలో భూమికోసం అన్వేషిస్తున్నామని చెప్పారు. తగిన స్థలం కోసం రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు కొనసాగుతున్నాయని బసు వెల్లడించారు. అయితే పశ్చిమబెంగాల్ ప్రభుత్వం కోరుకున్నట్లయితే హరిపూర్‌లో ఏ సమయంలోనైనా ఈ ప్రాజెక్టును ప్రారంభించేందుకు సిద్ధమని పేర్కొన్నారు.