
యూపీఐ కిందకు మరో 13 బ్యాంక్‌లు
న్యూఢిల్లీ: భారత్–సింగపూర్ మధ్య నిధుల బదిలీని మరింత సులభతరం చేస్తూ.. యూపీఐ–పేనౌ కిందకు మరో 13 బ్యాంక్‌లను చేర్చినట్టు ఎన్‌పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ ప్రకటించింది. ఈ నెట్‌వర్క్ పరిధిలోకి మొత్తం 19 భారత బ్యాంక్‌లు చేరినట్టయింది. ‘‘జూలై 17 నుంచి రెండు దేశాల్లోని యూజర్లు మరిన్ని బ్యాంకుల పరిధిలో నిధులను బదిలీని సులభంగా చేసుకోవచ్చు.
ఈ సేవ మరింత సౌకర్యంగా, అందుబాటులోకి వస్తుంది’’అని ఎన్‌పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ (ఎన్‌ఐపీఎల్) తెలిపింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ)కి ఎన్‌ఐపీఎల్ అనుబంధ సంస్థ కావడం గమనార్హం. ఆర్‌బీఐ, మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్ (ఎంఏఎస్) సంయుక్తంగా యూపీఐ–పేనౌ సేవలను లోగడ ప్రారంభించడం తెలిసిందే.