
ఆస్ట్రేలియా గడ్డపై సౌతాఫ్రికా యువ సంచలనం డెవాల్డ్ బ్రెవిస్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. డార్విన్ వేదికగా ఆసీస్‌తో జరిగిన రెండో టీ20లో మెరుపు సెంచరీతో చెలరేగిన బ్రెవిస్.. ఇప్పుడు మూడో టీ20లో అదే తరహా విధ్వంసాన్ని సృష్టించాడు. కెయిర్న్స్ లోని కాజాలి స్టేడియం వేదికగా జరుగుతున్న సిరీస్ డిసైడ్‌ర్‌లో బ్రెవిస్ తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు.
మరోసారి ఆసీస్ బౌలర్లను ఈ జూనియర్ ఏబీడీ ఉతికారేశాడు. ముఖ్యంగా ఆసీస్ యువ బౌలర్ ఆరోన్ హార్డీకి బ్రెవిస్ చుక్కలు చూపించాడు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ పదో ఓవర్ వేసిన హార్దీ బౌలింగ్‌లో బ్రెవిస్ ఏకంగా నాలుగు సిక్సర్లు బాదాడు. అంతకంటే ముందు ఆసీస్ స్పీడ్ స్టార్ బెన్ ద్వార్షుయిస్ బౌలింగ్‌లో కూడా బ్రెవిస్ 100 మీటర్ల భారీ సిక్సర్ కొట్టాడు.
అతడి బ్యాట్ పవర్‌కు బంతి స్టేడియం బయట పడింది. ఇది చూసిన వారంతా షాకయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ మ్యాచ్‌లో కేవలం 26 బంతులు మాత్రమే ఎదుర్కొన్న బ్రెవిస్.. 6 సిక్స్‌లు, ఒక ఫోర్ సాయంతో 53 పరుగులు చేశాడు.
ఇక టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. సఫారీ బ్యాటర్లలో బ్రెవిస్‌తో పాటు స్టబ్స్(25), వండర్ డస్సెన్(38) రాణించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ ఈల్లీస్ మూడు, జంపా, హాజిల్ వుడ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.
చదవండి: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం.. ఆటగాళ్లకు జీతాలు కట్!?
Oh my goodness, what a player Dewald Brevis is!#AUSvSA pic.twitter.com/pcYPrcidd9
— cricket.com.au (@cricketcomau) August 16, 2025