హోబర్ట్ వేదికగా భారత్‌తో జరుగుతున్న మూడో టీ20లో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ టిమ్ డేవిడ్ విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు ఆసీస్‌కు అర్ష్‌దీప్ సింగ్ ఆరంభంలోనే బిగ్ షాకిచ్చాడు. అతడి బౌలింగ్ ధాటికి హెడ్, ఇంగ్లిష్ వికెట్లను ఆతిథ్య జట్టు కోల్పోయింది.
ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన డేవిడ్ భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. హోబర్ట్‌లోని బెల్లెరివ్ ఓవల్ మైదానంలో బౌండరీల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో డేవిడ్ కేవలం 23 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. మొత్తంగా 38 బంతులు మాత్రమే ఎదుర్కొన్న డేవిడ్.. 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో 74 పరుగులు చేశాడు.
డేవిడ్ భారీ సిక్సర్..
కాగా ఈ మ్యాచ్‌లో డేవిడ్ భారీ సిక్సర్‌తో మెరిశాడు. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఈ ఆసీస్ డెంజరస్ బ్యాటర్ 129 మీటర్ల భారీ సిక్సర్ బాదాడు. ఆసీస్ ఇన్నింగ్స్ ఆరో ఓవర్ వేసిన అక్షర్ ఐదో బంతిని.. టాసడ్ ఆఫ్ డెలివరీగా సంధించాడు. ఆ డెలివరీని డేవిడ్ ముందుకు వచ్చి స్ట్రైట్ డ్రైవ్ షాట్ ఆడాడు.
అతడి పవర్ ధాటికి బంతి నింజా స్టేడియం బయటకు వెళ్లింది. అతడి షాట్ చూసి మైదానంలో అందరూ షాక్ అయిపోయారు. ఈ క్రమంలో డేవిడ్ అంతర్జాతీయ టీ20ల్లో భారీ సిక్సర్ బాదిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డు న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ మార్టిన్ గప్టిల్ పేరిట ఉండేది.
2012లో గప్టిల్ సౌతాఫ్రికాపై 127 మీటర్ల సిక్స్ బాదాడు. తాజా మ్యాచ్‌తో గప్టిల్ ఆల్‌టైమ్ రికార్డును డేవిడ్ బ్రేక్ చేశాడు. ఈ జాబితాలో డేవిడ్, మార్టిన్ గప్టిల్ తర్వాత యువరాజ్ సింగ్(119 మీటర్లు), క్రిస్ గేల్(116 మీటర్లు) ఉన్నారు.
చదవండి: కరుణ్ నాయర్ డబుల్ సెంచరీ
What a hand power man 130M six by Tim David 🥵🥵 pic.twitter.com/0N9PRABZqv
— Raf! (@MBVKtweets) November 2, 2025


