కేఎల్‌ రాహుల్‌ అవుట్‌!.. భారత జట్టులో అతడికి చోటు | Shikhar Mohan Receives Maiden India A Call Up To Replace KL Rahul | Sakshi
Sakshi News home page

కేఎల్‌ రాహుల్‌ అవుట్‌!.. భారత జట్టులో అతడికి చోటు

Oct 23 2026 4:26 PM | Updated on Oct 23 2026 4:46 PM

Shikhar Mohan Receives Maiden India A Call Up To Replace KL Rahul

PC: BCCI/X

న్యూజిలాండ్‌ పర్యటనలో భాగంగా భారత్‌- ‘ఎ’ జట్టు ఆతిథ్య జట్టుతో అనధికారిక టెస్టు సిరీస్‌ ఆడనుంది. ఇందులో భాగంగా అక్టోబరు 24- నవంబరు 10 మధ్య కివీస్‌- భారత్‌ ‘ఎ’ జట్లు మూడు మ్యాచ్‌లలో తలపడతాయి. ఇందుకు సంబంధించి భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) ఇప్పటికే తమ జట్టును ప్రకటించింది.

సారథిగా జురెల్‌
కేఎల్‌ రాహుల్‌, యశస్వి జైస్వాల్‌, రిషభ్‌ పంత్‌ వంటి సీనియర్లు ఉన్నప్పటికీ భారత్‌-‘ఎ’ కెప్టెన్‌గా ధ్రువ్‌ జురెల్‌ను ఎంపిక చేసింది. అయితే, పంత్‌ ఇప్పటికే గాయం కారణంగా ఈ సిరీస్‌కు దూరమైనట్లు వార్తలు రాగా.. తాజాగా కేఎల్‌ రాహుల్‌ సైతం తొలి టెస్టు ఆడిన తర్వాత జట్టు నుంచి తప్పుకోనున్నట్లు సమాచారం.

అందుకే రాహుల్‌ దూరం
కాగా టీమిండియా సైతం కివీస్‌ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. న్యూజిలాండ్‌తో అక్టోబరు 22- డిసెంబరు 1 మధ్య ఐదు టీ20లు, ఐదు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. ఇందులో భాగంగా తొలుత టీ20 సిరీస్‌ మొదలుకాగా.. నవంబరు 4 నుంచి వన్డే సిరీస్‌ ప్రారంభమవుతుంది. ఈ సిరీస్‌ కోసం బీసీసీఐ రెండు జట్లను ఎంపిక చేయగా.. రాహుల్‌ తొలి మూడు వన్డేలు ఆడాల్సి ఉంది.

జార్ఖండ్‌ టాపార్డర్‌ బ్యాటర్‌కు చోటు
ఈ నేపథ్యంలో భారత్‌- ‘ఎ’ తరఫున రెండు, మూడో అనధికారిక టెస్టులకు కేఎల్‌ రాహుల్‌ దూరమైనట్లు సమాచారం. దీంతో అతడి స్థానంలో జార్ఖండ్‌ టాపార్డర్‌ బ్యాటర్‌ శిఖర్‌ మోహన్‌కు సెలక్టర్లు తొలిసారి పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది. కేఎల్‌ రాహుల్‌ స్థానంలో భారత్‌ ‘ఎ’ జట్టుకు అతడికి ఎంపిక చేసినట్లు సమాచారం.

తాజా రంజీ ఎడిషన్‌లోనూ 
కాగా 21 ఏళ్ల శిఖర్‌ మోహన్‌ 2025-26 రంజీ సీజన్లో 12 ఇన్నింగ్స్‌ ఆడి 613 పరుగులతో రాణించాడు. ఇందులో ఓ డబుల్‌ సెంచరీ కూడా ఉండటం విశేషం. తాజా రంజీ ఎడిషన్‌లోనూ తొలి శతకం బాదిన క్రికెటర్‌గా శిఖర్‌ మోహన్‌ నిలిచాడు. ఇప్పటికే మూడు ఇన్నింగ్స్‌ పూర్తి చేసుకుని రెండు శతకాల సాయంతో 297 పరుగులు సాధించాడు.

ఈ క్రమంలో భారత్‌ ‘ఎ’ జట్టులో శిఖర్‌ మోహన్‌కు చోటు దక్కినట్లు తెలుస్తోంది. ఇక ఇరానీ కప్‌లో అర్ధ శతకం బాదిన ఈ జార్ఖండ్‌ కుర్రాడు.. దులిప్‌ ట్రోఫీలో రెండు ఫిఫ్టీలు సాధించాడు. అదే విధంగా.. జార్ఖండ్‌ టీ20 లీగ్‌లో తొమ్మిది ఇన్నింగ్స్‌ ఆడి 322 పరుగులతో అదరగొట్టాడు.

న్యూజిలాండ్‌-‘ఎ’ జట్టుతో అనధికారిక తొలి టెస్టుకు భారత జట్టు
ధ్రువ్ జురెల్ (కెప్టెన్ / వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, రవిచంద్రన్ స్మరణ్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్ - ఫిట్‌నెస్‌కు లోబడి), వాషింగ్టన్ సుందర్, ఆకిబ్ నబీ, ఆకాశ్ దీప్, అన్షుల్ కంబోజ్, మానవ్ సుతార్, ముకేశ్ చౌదరి, సాయి సుదర్శన్, యశ్ రాథోడ్, ముకేశ్ కుమార్.

రెండు, మూడో టెస్టులకు భారత జట్టు
యశస్వి జైస్వాల్‌, దేవ్‌దత్‌ పడిక్కల్‌, రవిచంద్రన్‌ స్మరణ్‌, కుమార్‌ కుశాగ్రా (వికెట్‌ కీపర్‌), ధ్రువ్‌ జురెల్‌ (కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), వాషింగ్టన్‌ సుందర్‌, ఆకిబ్‌ నబీ, ఆకాశ్‌ దీప్‌, అన్షుల్‌ కాంబోజ్‌, మానవ్‌ సుతార్‌, ముకేశ్‌ చౌదరి, సాయి సుదర్శన్‌, యశ్‌ రాథోడ్‌, ముకేశ్‌ కుమార్‌, రిషభ్‌ పంత్‌ (ఫిట్‌నెస్‌కు లోబడి), శిఖర్‌ మోహన్‌.

చదవండి: రిటైర్మెంట్‌ ప్రకటించిన టీమిండియా క్రికెటర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement