
సింగర్ మధుప్రియ ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఇటీవలే తాను దగ్గరుండి చెల్లికి నిశ్చితార్థం చేసిన మధుప్రియ.. ప్రస్తుతం పెళ్లి పనుల్లోనూ బిజీ అయిపోయారు. తాజాగా తన చెల్లెలు శ్రుతిప్రియ పెళ్లి వేడుక సంబురాల ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇవాళ నిర్వహించిన హల్దీ వేడుక వీడియోలను పోస్ట్ చేశారు. చెల్లి పెళ్లి కూతురైందంటూ ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం హల్దీ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి.
(ఇది చదవండి: చెల్లి నిశ్చితార్థంలో టాలీవుడ్ స్టార్ సింగర్)
కాాగ.. తెలంగాణ పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన మధుప్రియ.. పదేళ్ల వయసులోనే ఓ స్టేజీ షోలో 'ఆడపిల్లనమ్మా' పాట పాడి ఓవర్ నైట్ స్టార్ అయింది. తర్వాత అంటే 2011లో 'దగ్గరగా దూరంగా' సినిమాలో 'పెద్దపులి' అనే పాటతో ఇండస్ట్రీలోకి వచ్చింది. అనంతరం ఫిదా, టచ్ చేసి చూడు, నేల టికెట్, సాక్ష‍్యం, సరిలేరు నీకెవ్వరు, బంగార్రాజు, సంక్రాంతికి వస్తున్నాం, లైలా తదితర చిత్రాల్లో సాంగ్స్ పాడి అభిమానులను అలరించింది. అయితే 18 ఏళ్ల వయసులోనే శ్రీకాంత్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న మధుప్రియ.. కొన్నాళ్లకు అతడి నుంచి విడిపోయింది. ప్రస్తుతం తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది.