
ఢిల్లీ: నేడు బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు(Bihar Assembly Election) షెడ్యూల్ విడుదల కానుంది. కేంద్ర ఎన్నికల సంఘం(Election Commission Of India) సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయనుంది. బీహార్(Bihar Election) అసెంబ్లీ గడువు నవంబర్ 22వ తేదీతో ముగియనుంది. బీహార్ ఎన్నికలతో పాటే తెలంగాణలోని జూబ్లీహిల్స్(Jubilee Hills Election) అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక షెడ్యూల్(దేశంలో మరో నాలుగు స్థానాల్లో ఉప ఎన్నికలు) విడుదలయ్యే అవకాశం ఉంది.
Delhi | Election Commission of India to hold a press conference at 4 PM today to announce the schedule for the upcoming Bihar Assembly Elections pic.twitter.com/YFTiaVTkk0
— ANI (@ANI) October 6, 2025
కాగా, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ సన్నద్ధతను సమీక్షించేందుకు ఇప్పటికే సీఈసీ బృందం రెండు రోజులు బీహార్‌లో పర్యటించింది. అసెంబ్లీ ఎన్నికలతో (Assembly Elections) అనేక కొత్త విధానాలకు శ్రీకారం చుడతామని, తగిన సమయంలో వాటిని దేశమంతటికీ విస్తరిస్తామని సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తెలిపారు. ఈవీఎంలలో పొందుపరిచే బ్యాలెట్ పేపర్లలో అభ్యర్థుల కలర్ ఫొటోలను ఉంచడం వంటివి ఇందులో ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో ప్రత్యేక ముమ్మర సవరణతో ఓటర్ల జాబితాను సిద్ధం చేసిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా.. బీహార్ (Bihar)లో మొత్తం 243 శాసనసభ స్థానాలు ఉన్నాయి. ప్రస్తుత అసెంబ్లీ గడువు వచ్చేనెల చివరివారంతో ముగియనుంది. కాగా, ప్రస్తుతం బీహార్‌లో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో ఉంది. 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం లభించలేదు. దీంతో జేడీయూ, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాయి. నీతీశ్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. కానీ, రెండేళ్లకే నీతీశ్ ఎన్డీయేను వీడి.. ఆర్జేడీ, కాంగ్రెస్‌తో కూడిన మహాగఠ్‌బంధన్‌లో చేరి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే, ఈ బంధం కూడా ఎంతోకాలం నిలవలేదు. 2024 జనవరిలో మహా కూటమిని వీడిన జేడీయూ మళ్లీ ఎన్డీయే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. దీంతో మరోసారి నీతీశ్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు.
