
ఢిల్లీ: బీహార్‌లో ఓట్ల చోరీ జరిగిందని మరోసారి స్పష్టం చేశారు ఏఐసీసీ అగ్రనేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. బీహార్‌లో SIR(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ద్వారా ఉన్న ఓటర్లను తొలగించి కొత్త వారిని చేర్చి అక్రమంగా గెలవాలని చూస్తున్నారని మండిపడ్డారు. అన్ని రాష్ట్రాల లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందని, దేశం ఎక్కడ ఓట్ల చోరీ జరిగినా అడ్డుకుంటామని రాహుల్ గాంధీ హెచ్చరించారు.
బీజేపీ నేతలు ప్రెస్‌మీట్ పెడితే ఈసీ అఫిడవిట్ అడగలేదని, తాను ప్రెస్‌మీట్ పెడితే అఫిడవిట్ ఈసీ అడుగుతోందని విమర్శించారు. ఓటర్ల డేటాను అడిగినా ఈసీ ఇంతవరకూ ఇవ్వలేదని ధ్వజమెత్తారు రాహుల్.
మీ ఓట్లను దొంగిలించి.. ఎన్నికల్లో గెలిచి దేశ సంపదను సంపన్నులకు అందిస్తున్నారని మండిపడ్డారు. బీహార్‌లో చేస్తున్న SIR అసలు రంగు బయటపెడతామని రాహుల్ హెచ్చరించారు.
కాగా, బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు రెండు నెలల ముందు ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం( ఆగస్టు 15వ తేదీ) మరోసారి విచారించిన సుప్రీంకోర్టు.. ఎన్నికల సంఘం ఏదైతే ఓటర్లను తొలగించామని చెప్పిందో.. ఆ 65లక్షలకు పైగా ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని స్పష్టం చేసింది.
అదే సమయంలో వారిని ఎందుకు తొలగించారో పేర్కొంటూ వివరణతో కూడిన ఆ లిస్టును పబ్లిక్‌లోకి తీసుకురావాలని పేర్కొంది ధర్మాసనం. ఈ అంశానికి సంబంధించి గురువారం(ఆగస్టు 14వ తేదీ) విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. 22 లక్షల మందిని చనిపోయారన్న కారణంతో తొలగించడాన్ని సైతం ప్రశ్నించింది. బూత్ లెవెల్ స్థాయిలో దీనిని ఎందుకు బహిర్గతం చేయలేదని నిలదీసింది. పౌరుల హక్కు రాజకీయ పార్టీలపై ఆధారపడటం మాకు ఇష్టం లేదు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
‘భారత ఎన్నికల కమిషన్ వాదనలను మేము పూర్తిగా విన్నాం. విచారణ సమయంలో, ఈ క్రింది దశలను అంగీకరించారు. 2025 జాబితాలో పేర్లు కనిపించినప్పటికీ, తాజాగా జాబితాలో చేర్చబడని 65 లక్షల మంది ఓటర్ల జాబితాను జిల్లా స్థాయి వెబ్‌సైట్‌లలో ప్రదర్శించాలి’ అని సుప్రీంకోర్టు తన ఉత్తర్వులో పేర్కొంది.
ఇదీ చదవండి: