7న కాంగ్రెస్‌ రెండేళ్ల వైఫల్యాలపై మహాధర్నా | Telangana BJP President Ramchander Rao Comments On Congress party | Sakshi
Sakshi News home page

7న కాంగ్రెస్‌ రెండేళ్ల వైఫల్యాలపై మహాధర్నా

Dec 5 2025 4:11 AM | Updated on Dec 5 2025 4:12 AM

Telangana BJP President Ramchander Rao Comments On Congress party

బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు

సాక్షి, హైదరాబాద్‌: ఈ నెల 7న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇందిరాపార్కు వద్ద.. కాంగ్రెస్‌ రెండేళ్ల పాల నా వైఫల్యాలపై ‘గల్లంతైన గ్యారంటీలు – నెరవేరని వాగ్దానాలు, ప్రజా వంచనకు రెండేళ్లు’ నినాదంతో మహాధర్నా నిర్వహిస్తున్నట్టు బీజేపీ అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు వెల్ల డించారు. హిల్ట్‌ పాలసీ, జీహెచ్‌ఎంసీలో పురపాలికల విలీనం, మొత్తంగా పాలనా వైఫ ల్యాలను ఎండగట్టేలా దీనిని చేపడుతున్నా మన్నారు.

ఈ ధర్నాలో భాగంగా.. ప్రభు త్వానికి వ్యతిరేకంగా చార్జిషీట్‌ విడుదల చేస్తా మని తెలిపారు. ఆయన గురువారం బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నెరవేర్చని హామీల చిట్టాను ప్రజల ముందు పెడతామన్నారు.  పంచాయతీ ఎన్నికల కార ణంగా... ఈ ధర్నా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించడం లేదని, గ్రేటర్‌ పరిధిలోని 8 జిల్లాల్లోనే దీనిని నిర్వహిస్తున్నామన్నారు. కాగా,  రాంచందర్‌రావును సినీనటుడు శుభలేఖ సుధాకర్‌ కలిసి ఎస్పీ బాలసుబ్ర హ్మణ్యం విగ్రహావి ష్కరణ కార్యక్రమానికి ఆహ్వానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement