2047 నాటికి అగ్రి బిజినెస్ ఎకానమీగా తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయం అత్యాధునిక, లాభదా యక, వాతావరణ అనుగుణ ఆహార వ్యవస్థగా మారాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన లక్ష్యాన్ని ప్రకటించింది. ప్రతి రంగాన్ని సమూలంగా మార్చే వినూత్న విధానాలతో ‘తెలంగాణ విజన్ 2047’డాక్యుమెంట్‌లో నిర్దేశించుకుంది. 2047 నాటికి రాష్ట్రంలో వ్యవసాయం ఎలా ఉండబోతుందనే అంశంపై వ్యవసాయశాఖ విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించింది. అందులో స్పష్టమైన విధానాలను పొందుపరిచారు.
» క్లైమెట్ స్మార్ట్ వ్యవసాయం ..నేల ఆరోగ్యానికి సంబంధించి మొబైల్ సాయిల్ టెస్టింగ్, కమ్యూనిటీ సాయిల్ మిషన్‌లతో ప్రతి గ్రామానికి నేల ఆరోగ్య సేవలు అందిస్తారు. ఐఓటీ ఆధారిత మైక్రో ఇరిగేషన్‌ను 39.5 లక్షల ఎకరాల వరకు విస్తరించి ‘డిజిటల్ వాటర్ ఇంటెలిజెన్స్’ద్వారా నీటి వినియోగ నియంత్రణ చేస్తారు.
» రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్‌లో భాగంగా అగ్రి రీసెర్చ్ హబ్‌గా వ్యవసాయ విశ్వవిద్యాలయాల ను అభివృద్ధి చేయడం ద్వారా శాస్త్ర సాంకేతి కతను వ్యవసాయానికి అనుసంధానం చేయ డం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫుడ్ ప్రాసెసింగ్, నేచురల్ రిసోర్సెస్ రంగాల్లో అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ సెంటర్ల ఏర్పాటుకు ప్రాధాన్యం.
» 100 కొత్త పెరి–అర్బన్ క్లస్టర్లు, 20 సెమీ అర్బన్ జోన్లు , 100 ఎగుమతి కమోడిటీ క్లస్ట ర్లు, ధాన్యం కోసం ప్రత్యేక ట్రేడింగ్ వింగ్ ఏర్పాటు.
» తెలంగాణను ‘గ్లోబల్ సీడ్ క్యాపిటల్’గా తీర్చిదిద్దే లక్ష్యంతో సర్టిఫైడ్ సీడ్ ఉత్పత్తి మూడు రెట్లు పెంచడం, తెలంగాణ సీడ్ రీసెర్చ్ పార్క్, రాష్ట్ర విత్తన మండలి ఏర్పాటు చేయాలని నిర్ణయం.
» నెక్ట్స్ జెన్ అగ్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ద్వారా 500 అ గ్రిటెక్ క్లస్టర్ల ద్వారా 25 లక్షల ఎకరాలకు స్మార్ట్ వ్యవసాయం అందించడం. వ్యవసా య లాజిస్టిక్స్‌కు ప్రత్యేక మౌలిక వసతుల క ల్పన, 50 లక్షల టన్నుల గిడ్డంగుల విస్తర ణ, కోల్డ్ స్టోరేజ్, ప్రాసెసింగ్ సెంటర్ల విస్తరణ.
» వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఇక్రిశాట్ వంటి సంస్థలతో కలిసి కొత్త బయోఫోర్టిఫైడ్ పంట జాతులను అభివృద్ధి చేయడం, 25 లక్షల ఎకరాల్లో న్యూట్రిషన్ స్మార్ట్ క్లస్టర్లు రూపొందించడం.
» 2047 నాటికి 10 మిలియన్ టన్నుల పాలు, 35 మిలియన్ టన్నుల మాంసం వార్షిక ఉత్పత్తితోపాటు, పౌల్ట్రీలో తెలంగాణను నంబర్‌వన్‌గా నిలబెట్టే ప్రణాళికను రూపొందించారు. ఆక్వా కల్చర్ ద్వారా 5 రెట్ల వృద్ధి లక్ష్యంగా నిర్దేశించారు.


