breaking news
vision document
-
3 మూల స్తంభాలు 10 వ్యూహాలు..
సాక్షి, హైదరాబాద్: రెండు దశాబ్దాల అనంతర అద్భుత స్వప్నాన్ని కాంక్షిస్తూ వికసిత తెలంగాణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం 2047 దార్శనిక పత్రాన్ని (విజన్ డాక్యుమెంట్) రూపొందించింది. సమ్మిళిత, సుస్థిర అభివృద్ధితో పాటు ప్రజల ఆశలు, ఆకాంక్షలు, అవసరాలు, సామర్థ్యాలకు అనుగుణంగా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం 10 వ్యూహాలను ఇందులో పొందుపరిచింది. ముచ్చటగా 3 మూల స్తంభాల సాయంతో 13 గేమ్ చేంజర్ ప్రాజెక్టులను తీర్చిదిద్దడం ద్వారా 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. పాలనలో విశిష్టత, సేవలకు గ్యారంటీ ఇస్తూ ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో రాష్ట్రానికి అవసరమైన మౌలిక సదుపాయాలను పరిపుష్టం చేసుకోవడంతో పాటు నిరంతర సంపద సృష్టి ధ్యేయంగా 83 పేజీల డాక్యుమెంట్‌ను.. ఫ్యూచర్ సిటీలోని గ్లోబల్ సమ్మిట్ వేదికపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. మానవ రూపంలోని రోబో వేదికపై నడుచుకుంటూ వచ్చి సీఎంకు ఈ విజన్ డాక్యుమెంట్‌ను అందజేయడం అతిథులను ఆకట్టుకుంది. ప్రగతి కోసం పది వ్యూహాలు 1. ముఖ్య సిద్ధాంతం.. 3 జోన్ల రాష్ట్రం రాష్ట్రాన్ని 3 ముఖ్య జోన్లుగా విభజించుకున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుంది. సుమారు 160 కిలోమీటర్ల ఔటర్ రింగు రోడ్డు (ఓఆర్ఆర్) లోపలి భాగంలో సేవల రంగం కేంద్రీకృతంగా హరిత మెట్రోపొలిస్ కోసం కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్), ఓఆర్ఆర్కు అవతల, 360 కిలోమీటర్ల రీజనల్ రింగు (ట్రిపుల్ ఆర్) రోడ్డు లోపలి భాగంలో తయారీ రంగంపై ఫోకస్ చేస్తూ పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీ (ప్యూర్), ట్రిపుల్ ఆర్ ఆవలి భాగంలోని గ్రామీణ తెలంగాణలో వ్యవసాయ ఆధారిత రంగాల అభివృద్ధి లక్ష్యంగా రూరల్ అగ్రి రీజియన్ ఎకానమీ (రేర్) ఏర్పాటు.2. సులభతర విధానాల దిశగా..గత రెండేళ్ల కాలంలో తాత్కాలిక ప్రాతిపదికన నిర్ణయాలు తీసుకునే దశ నుంచి పారదర్శకంగా, వేగంగా విధాన నిర్ణయాలు తీసుకునే దశకు వచ్చాం. ఈ రెండేళ్ల కాలంలో ఇందుకు అనుగుణంగా క్రీడలు, పర్యాటకం, విద్య, పరిశ్రమలు, పెట్టుబడులు, సామాజిక సమ్మిళిత రంగాల్లో విధానాలు తీసుకువచ్చాం. ఈ విధానాలు అద్భుత ఫలితాలనివ్వడంతో పాటు చెప్పుకోదగిన మార్పును ప్రతిబింబిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి ప్రజల జీవనంలోని ప్రతి కోణంలోనూ వారి ప్రతి అవసరం తీరే విధంగా సులభతర విధానాలను తీసుకువస్తాం.3. గేమ్ చేంజర్ ప్రాజెక్టులు దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోటీ పడడం కాకుండా ప్రపంచంలోనే ఉత్తమ నగరాలతో పోటీ పడే విధంగా హైదరాబాద్, తెలంగాణను తీర్చిదిద్దేందుకు గేమ్ చేంజర్ ప్రాజెక్టులను ఎంచుకున్నాం.4. పాలనలో విశిష్టత... సేవలకు గ్యారంటీ ప్రభుత్వం, భాగస్వామ్య పక్షాల మధ్య లావాదేవీలు నేరుగా కాకుండా డిజటల్ రూపంలో జరిగేలా డిజిటల్ పాలన. రాష్ట్రంలోని పౌరులందరికీ అందుబాటులో ఇంటర్నెట్, డేటా. రాష్ట్రమంతటా భూగర్భ కేబుల్, వైఫై జోన్ల ఏర్పాటు. స్మార్ట్, ప్రోయాక్టివ్, ఎఫిషియెంట్, ఎఫెక్టివ్ డెలివరీ (స్పీడ్) పద్ధతిలో సేవలందేలా పెట్టుబడులను ఆకర్షించే వ్యూహం. 5. నాలెడ్జ్ హబ్ టెక్, బయోటెక్, లైఫ్ సైన్సెస్ రంగాల్లో అంతర్జాతీయ గుర్తింపు పొందిన సంస్థలు, పరిశోధక సంస్థలతో కలిపి నాలెడ్జ్ హబ్ ఏర్పా టు. ఆఫ్‌షోర్ క్యాంపస్‌ల ఏర్పాటు, విద్యార్థుల మార్పిడి, ఫ్యాకల్టీ, పరిశోధక సామాగ్రి సమకూర్చుకోవడం కోసం అంతర్జాతీయ విద్యా సంస్థలను ఆహ్వానించడం ద్వారా క్యూర్ పరిధిలో నాలెడ్జ్ హబ్ ఏర్పాటు. 6. సమ్మిళిత, సుస్థిర సంక్షేమంరాష్ట్రంలోని ప్రతి పౌరుడూ సమానమే అయినా మూడు ముఖ్యమైన వర్గాల సంక్షేమంపై రాష్ట్రం దృష్టి. మహిళలు, రైతులు, యువత–చిన్నారుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు. విద్య, వైద్య రంగాలతో పాటు ప్రజల జీవనోపాధి పెంపు, ఆర్థిక సాధికారత కోసం దీర్ఘకాలిక వ్యూహాలకు రూపకల్పన. 7. అభివృద్ధి వనరులు ప్రపంచ స్థాయి విశ్వస నీయ పెట్టుబడిదారుల కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయడం ద్వారా వారికి భరోసా కలి్పంచడం, సుస్థిర అభివృద్ధి వలయం, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు నిరంతర సంపద సృష్టి ధ్యేయంగా ప్రభు త్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ముందుకు వెళ్లడం. 8. పర్యావరణం సుస్థిరత ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ పర్యావర ణ పరిస్థితులు, వాతావరణ మార్పుల వల్ల నష్ట సంభావ్యత గురించి ఆలోచిస్తున్నారు. వాటర్ గ్రిడ్, భూగర్భ డ్రైనేజీ, చెరువుల పునరుద్ధరణ, వరద నష్టాల బారిన పడకుండా హైదరాబాద్‌లో మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు చేపట్టాలి. గోదావరిని మూసీతో అను సంధానం చేయడం ద్వారా రాబోయే 75–100 ఏళ్ల వరకు నీటి కొరత లేకుండా కరువు బారిన పడకుండా చూడటం. 9. సంస్కృతి సంస్కృతి, వారసత్వ సంపద, చరిత్ర, స్మారక చిహ్నాలు, కళలు, జానపదాలకు ప్రోత్సాహమందించడం. 10. ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజల వలన.. రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలు, అవసరాలు, సమర్థతలకు అనుగుణంగా విజన్ రూపొందించాం. ఇది కేవలం నిపుణులతో సాధ్యం కాలేదు. 4 లక్షల మంది ప్రజలు భాగస్వాములయ్యారు. వారి నుంచి సమస్యలు, అంతర్గతంగా దాగి ఉన్న బలాలు, అత్యంత క్లిష్టమైన లక్ష్యాలను చేరుకునేందుకు అవసరమైన సామూహిక చైతన్యం గురించి తెలుసుకోగలిగాం. తెలంగాణ రైజింగ్ నిరంతరం సాగుతూనే ఉంటుంది. రండి..అభివృద్ధిలో భాగస్వామి కండి. 13 గేమ్ చేంజర్ ప్రాజెక్టులివే.. » భారత్ ఫ్యూచర్ సిటీ » మూసీ పునరుజ్జీవనం » డ్రైపోర్టు » డ్రైపోర్టు నుంచి కృష్ణపట్నం పోర్టు వరకు 12 లేన్ల ఎక్స్‌ప్రెస్‌వే » బెంగళూరు, అమరావతి మీదుగా చెన్నైకు హైదరాబాద్ నుంచి బుల్లెట్ ట్రైన్ కారిడార్లు » ఓఆర్ఆర్, ట్రిపుల్ ఆర్ మధ్యలో తయారీ రంగం అభివృద్ధి » రీజనల్ రింగు రోడ్డు » ఓఆర్ఆర్, ట్రిపుల్ ఆర్‌లను కలుపుతూ రేడియల్ రోడ్లు » రీజనల్ రింగ్ రైల్వే » వ్యవసాయ భూములకు గ్రీన్ ఎనర్జీ » ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్స్ » గ్రీన్ ఎనర్జీ హబ్స్ » ఎల్రక్టానిక్ వాహనాలను పెద్ద సంఖ్యలో వినియోగించడం3 మూలస్తంభాలివే.. 1. ఆర్థిక వృద్ధి..ఆవిష్కరణలు, ఉత్పాదకతల పునాదులపై జరిగే అభివృద్ధి ఆధారంగా క్యూర్–ప్యూర్–రేర్ విధానంతో 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు రూపకల్పన. 2. సమ్మిళిత అభివృద్ధి..ఈ వృద్ధి ఫలాలను యువత, మహిళలు, రైతులు, అట్టడుగున ఉన్న వర్గాలు, సమాజంలో అన్ని వర్గాలకు అందించడం.3. సుస్థిర అభివృద్ధి..హరిత మార్గంలో 2047 నాటికి అన్ని రంగాల్లో సుస్థిరత. -
‘విజన్’.. రాష్ట్ర భవితకు ప్రతిజ్ఞ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంతో తీర్చిదిద్దిన విజన్ డాక్యుమెంట్ కేవలం ఒక పత్రం కాదని.. తెలంగాణ భవిష్యత్తు కోసం తాము చేసే ప్రతిజ్ఞ అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వేదికగా మంగళవారం ‘3 ట్రిలియన్ దిశగా తెలంగాణ: పెట్టుబడులు, ఉత్పాదకతల పరపతి’అనే అంశంపై జరిగిన చర్చాగోష్టిని ఆయన ప్రారంభించారు. ‘ప్రస్తుతం తెలంగాణ 185 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ. అది 3 ట్రిలియన్ డాలర్లకు చేరాలంటే 16 రెట్లు పెరగాలి. సాధారణ వృద్ధిరేటు సాధిస్తూ వెళ్తే 2047 నాటికి 1.12 ట్రిలియన్ డాలర్ల వరకే వెళ్లగలం. అంటే లక్ష్యానికి, పరిస్థితులకు మధ్య ఉత్పాదకత అంతరం ఉంది. రోడ్లు, భవనాలు కట్టి ఈ అంతరాన్ని పూడ్చాలని మేం అనుకోవట్లేదు. ఆర్థిక వ్యవస్థ మూల సూత్రాన్ని మార్చగలిగినప్పుడే ఇది సాధ్యమవుతుంది. పెట్టుబడి, ఆవిష్కరణలు కలిస్తేనే ఉత్పాదకత వస్తుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రూపాంతరం చెంది ఈజ్ ఆఫ్ ఇన్నోవేషన్స్‌గా మారాలి. ప్యూర్, క్యూర్, రేర్ వ్యవస్థలు సహకరించాలి. ఇక్కడ ప్రణాళిక, ప్రతిభ ఉంది కానీ ఆవిష్కరణలు చాలా ఖరీదైనవి. అవి చాలా ఏళ్లపాటు ఆర్థిక ఫలితాలనివ్వవు. అందుకే ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను నియంత్రించే వ్యవస్థలా కాకుండా ఉ్రత్పేరకంగా, భాగస్వామిగా మారాల్సి ఉంటుంది. మేం హైదరాబాద్‌ను ఆసియా ఇన్నోవేషన్ హబ్‌గా మార్చాలనుకుంటున్నాం’అని భట్టి చెప్పారు. సానుకూల దృక్పథంతోనే సాధ్యం: ట్రాన్స్‌కో సీఎండీ 2047 నాటికి మూడు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా రూపొందాలని తెలంగాణ నిర్ణయించుకున్న లక్ష్యం ఆర్థిక వ్యవస్థలోనే గతంలో ఎన్నడూ లేదని.. అలాంటి లక్ష్యాన్ని చేరుకోవాలంటే చేయాలనే దృక్పథం ఉన్నప్పుడే సాధ్యమవుతుందని ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణభాస్కర్ చెప్పారు. ఐఐటీలో చదివిన ఇంజనీర్‌గా, ఆర్థిక శా్రస్తాన్ని చదివిన నిపుణుడిగా, ఐఏఎస్ అధికారిగా ప్రభుత్వ విధానాల రూపకల్పనలో ఎదురయ్యే సవాళ్లు తెలిసిన వ్యక్తిగా పలు అంశాలపై విశ్లేషించారు. చర్చాగోష్టిని సమన్వయం చేసిన ఐఎస్బీ ఎకనామిక్స్ ఫ్యాకల్టీ ఆదిత్య కువలేకర్ అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఐఎస్బీ ఫైనాన్స్ ఫ్యాకల్టీ ప్రసన్న తాంత్రి మాట్లాడుతూ ఆవిష్కరణలను విలాసంగా భావించకుండా అవసరంగా పరిగణించాలన్నారు. గ్రావ్టన్ మోటార్స్ వ్యవస్థాపకుడు, సీఈఓ పరశురాం పాక మాట్లాడుతూ తాను అమెరికా నుంచి భారత్‌కు వచ్చినప్పుడు స్టార్టప్‌ల రంగంలో ఆర్థిక, మానవ వనరుల పరంగా ఇబ్బందులు పడ్డానని.. అయినా ఫలితంపై శ్రద్ధతో చివరకు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని తయారు చేయగలిగామని చెప్పారు. ఇజ్రాయెల్ అవలంబిస్తున్న స్టార్టప్‌ల ప్రోత్సాహక విధానాన్ని రాష్ట్రంలోనూ అమలు చేయాలని సూచించారు. -
ప్రగతి ప్రణాళికలపై ఫోకస్ ఉండాలి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో రాష్ట్ర భవిష్యత్తు రోడ్‌మ్యాప్‌ను ప్రకటించనున్నట్లు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. రాబోయే రెండు దశాబ్దాల్లో ప్రగతిశీల ఆర్థిక వ్యవస్థ రూపకల్పనకు ఇది ఉపయోగపడుతుందని అన్నారు. విజన్ డాక్యుమెంట్ రూపకల్పనలో రాబోయే కాలంలో చేపట్టే ప్రగతికి సంబంధించిన రాష్ట్ర ప్రణాళికలపై ఎక్కువగా ఫోకస్ పెట్టాలని చెప్పారు.శుక్రవారం రాత్రి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డితో కలిసి ప్రజాభవన్‌లో ఏర్పాటు చేసిన సమ్మిట్ వార్‌రూమ్‌ను సందర్శించారు. ఉన్నతాధికారులతో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి రోడ్‌మ్యాప్ ‘ఇది పూర్తిగా ఆర్థికాంశాలతో కూడిన సమ్మిట్. 2047 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థ 3 ట్రిలియన్ డాలర్లకు చేరుకునే రోడ్‌మ్యాప్‌ను ఈ సందర్భంగా ఆవిష్కరించనున్నాం. విజన్ డాక్యుమెంట్ సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉండేలా డిజిటల్ రూపంలోనూ ఉండాలి. వచ్చే సంవత్సరం దావోస్‌లో జరిగే సమావేశంలో ఇప్పుడు జరుగుతున్న తెలంగాణ రైజింగ్ 2047 సమ్మిట్ విజయోత్సవాన్ని వివరించడానికి వీలుగా ఉండాలి..’అని ముఖ్యమంత్రి సూచించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శనివారం సాయంత్రం సమ్మిట్ కార్యకలాపాలకు సంబంధించి ఎప్పుడు, ఏం జరుగుతుందనే వివరాలను మీడియాకు వెల్లడిస్తారని తెలిపారు. దేశంలో ప్రస్తుతం జరుగుతున్న విమానాల రద్దుకు సంబంధించి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిత్వ శాఖ అధికారులతో మాట్లాడాలని, హైదరాబాద్‌కు వచ్చే విమానాలకు సంబంధించి సమస్యలను పరిష్కరించేలా చూడాలని సీఎం ..అధికారులను ఆదేశించారు. కాగా సదస్సు నిర్వహించే ప్రదేశంలో అన్ని రకాల ఏర్పాట్లు దాదాపు పూర్తయినట్లు అధికారులు ముఖ్యమంత్రికి చెప్పారు. తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో విజన్ డాక్యుమెంట్ గ్లోబల్ సమ్మిట్‌లో సుమారు వెయ్యి మంది ప్రతినిధులకు ‘తెలంగాణ రైజింగ్ 2047’విజన్ డాక్యుమెంట్‌ను అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధిని సూచించే ఈ డాక్యుమెంట్ రూపకల్పన వేగవంతం చేసినట్లు అధికారులు తెలిపారు. సీఎస్ కె.రామకృష్ణారావు నేతృత్వంలోని ఉన్నతాధికారుల బృందం.. వివిధ శాఖల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా డాక్యుమెంట్ తయారీ ప్రక్రియను వేగవంతం చేసింది. డాక్యుమెంట్ డిజైన్‌కు తుది మెరుగులు దిద్దుతోంది. ఈ డాక్యుమెంట్ ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ భాషల్లో ఉండనుంది. దీనికి సంబంధించిన సాఫ్ట్ కాపీలు త్వరలో ప్రభుత్వ వెబ్సైట్లలో అందుబాటులోకి రానున్నాయి. వివిధ రంగాలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు పాల్గొనే ఈ సమ్మిట్‌లో విజన్ డాక్యుమెంట్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. కవర్ పేజీని..భవిష్యత్‌లో భారత్ ఫ్యూచర్ సిటీలో రూపుదిద్దుకోనున్న సూచనాత్మక నగరం ప్రతిబింబించేలా రూపొందిస్తున్నారు. -
వ్యవసాయం అంటే పంటలే కాదు.. వ్యాపారం కూడా!
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయం అత్యాధునిక, లాభదా యక, వాతావరణ అనుగుణ ఆహార వ్యవస్థగా మారాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన లక్ష్యాన్ని ప్రకటించింది. ప్రతి రంగాన్ని సమూలంగా మార్చే వినూత్న విధానాలతో ‘తెలంగాణ విజన్ 2047’డాక్యుమెంట్లో నిర్దేశించుకుంది. 2047 నాటికి రాష్ట్రంలో వ్యవసాయం ఎలా ఉండబోతుందనే అంశంపై వ్యవసాయశాఖ విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించింది. అందులో స్పష్టమైన విధానాలను పొందుపరిచారు. » క్లైమెట్ స్మార్ట్ వ్యవసాయం ..నేల ఆరోగ్యానికి సంబంధించి మొబైల్ సాయిల్ టెస్టింగ్, కమ్యూనిటీ సాయిల్ మిషన్లతో ప్రతి గ్రామానికి నేల ఆరోగ్య సేవలు అందిస్తారు. ఐఓటీ ఆధారిత మైక్రో ఇరిగేషన్‌ను 39.5 లక్షల ఎకరాల వరకు విస్తరించి ‘డిజిటల్ వాటర్ ఇంటెలిజెన్స్’ద్వారా నీటి వినియోగ నియంత్రణ చేస్తారు. » రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్‌లో భాగంగా అగ్రి రీసెర్చ్ హబ్‌గా వ్యవసాయ విశ్వవిద్యాలయాల ను అభివృద్ధి చేయడం ద్వారా శాస్త్ర సాంకేతి కతను వ్యవసాయానికి అనుసంధానం చేయ డం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫుడ్ ప్రాసెసింగ్, నేచురల్ రిసోర్సెస్ రంగాల్లో అడ్వాన్స్డ్ రీసెర్చ్ సెంటర్ల ఏర్పాటుకు ప్రాధాన్యం.» 100 కొత్త పెరి–అర్బన్ క్లస్టర్లు, 20 సెమీ అర్బన్ జోన్లు , 100 ఎగుమతి కమోడిటీ క్లస్ట ర్లు, ధాన్యం కోసం ప్రత్యేక ట్రేడింగ్ వింగ్ ఏర్పాటు. » తెలంగాణను ‘గ్లోబల్ సీడ్ క్యాపిటల్’గా తీర్చిదిద్దే లక్ష్యంతో సర్టిఫైడ్ సీడ్ ఉత్పత్తి మూడు రెట్లు పెంచడం, తెలంగాణ సీడ్ రీసెర్చ్ పార్క్, రాష్ట్ర విత్తన మండలి ఏర్పాటు చేయాలని నిర్ణయం. » నెక్ట్స్ జెన్ అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా 500 అ గ్రిటెక్ క్లస్టర్ల ద్వారా 25 లక్షల ఎకరాలకు స్మార్ట్ వ్యవసాయం అందించడం. వ్యవసా య లాజిస్టిక్స్‌కు ప్రత్యేక మౌలిక వసతుల క ల్పన, 50 లక్షల టన్నుల గిడ్డంగుల విస్తర ణ, కోల్డ్ స్టోరేజ్, ప్రాసెసింగ్ సెంటర్ల విస్తరణ.» వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఇక్రిశాట్ వంటి సంస్థలతో కలిసి కొత్త బయోఫోర్టిఫైడ్ పంట జాతులను అభివృద్ధి చేయడం, 25 లక్షల ఎకరాల్లో న్యూట్రిషన్ స్మార్ట్ క్లస్టర్లు రూపొందించడం.» 2047 నాటికి 10 మిలియన్ టన్నుల పాలు, 35 మిలియన్ టన్నుల మాంసం వార్షిక ఉత్పత్తితోపాటు, పౌల్ట్రీలో తెలంగాణను నంబర్‌వన్‌గా నిలబెట్టే ప్రణాళికను రూపొందించారు. ఆక్వా కల్చర్ ద్వారా 5 రెట్ల వృద్ధి లక్ష్యంగా నిర్దేశించారు. -
మూడు సూత్రాల ‘విజన్’!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాభివృద్ధిని వేగవంతం చేసేలా భవిష్యత్ ప్రణాళికలతో ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న తెలంగాణ విజన్ డాక్యుమెంట్–2047ను మూడు సూత్రాలతో సిద్ధం చేస్తోంది. మహిళలు, యువత, రైతులకు ఇందులో అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇప్పటికే రూపొందించిన ముసాయిదా నివేదికలో పలు ఆలోచనలను పొందుపర్చింది. రాష్ట్ర జనాభాలో సగ భాగం ఉన్న మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం.. యువశక్తిని ప్రపంచ పారిశ్రామిక విధానానికి సన్నద్ధం చేసేలా నైపుణ్యాభివృద్ధిని పెంపొందించి ఉపాధి బాట పట్టించడం.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన రైతాంగానికి సాంకేతికతను విస్తృతం చేసి రైతన్న ఆదాయాన్ని భారీగా పెంచడం కోసం వ్యూహాలు సిద్ధం చేస్తోంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 3 ట్రిలియన్ డాలర్లకు పెంచుతామంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పలు సందర్భాల్లో ప్రస్తావిస్తుండగా ఇప్పుడు తెలంగాణ విజన్ డాక్యుమెంట్లో ఆ అంశం ఇతివృత్తంగానే అన్ని రంగాలకూ ప్రాధాన్యత పెంచుతూ ఈ నివేదికను సర్కారు రూపొందిస్తోంది. మిలియనీర్లుగా మహిళలు.. తెలంగాణ విజన్ డాక్యుమెంట్–2047లో మహిళా సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం పట్టంకడుతోంది. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామన్న సీఎం ప్రకటనలకు అనుగుణంగా విజన్ డాక్యుమెంట్లో మహిళల కోసం నాలుగు ప్రత్యేక అంశాలను ప్రస్తావించారు. బాలికల విద్యాభివృద్ధిలో భాగంగా ప్రతి ఆడపిల్లకు తొలి ప్రాధాన్యం చదువే అనే అంశాన్ని అందులో పొందుపర్చారు. ఇందుకు ఉపకా ర వేతనాలు, భద్రతను జోడించారు. ఉపాధి అవకాశాల్లో మహిళల వాటాను భారీగా పెంచడం, సౌకర్యాల కల్పనకు ఒకే వేదిక ఏర్పాటు చేయడం, మహి ళా సాధికారతకు ఆర్థిక చేయూత, మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం, అంతర్జాతీయ మార్కెట్‌తో అనుసంధా నించడం లాంటి అంశాలకు ఈ డాక్యుమెంట్లో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. మార్కెట్ డిమాండ్‌కు అనువైన పంటల సాగు... రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వ్యవసాయంపైనే ఎక్కువగా ఆధారపడి ఉన్న నేపథ్యంలో ఆర్థికాభివృద్ధిలో ఈ రంగానికి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయిస్తూ విజన్ డాక్యుమెంట్లో రైతాంగానికి పెద్దపీట వేసింది. ప్రస్తుతమున్న 42 లక్షల టన్నుల ఉద్యాన పంటల సాగును మరింత పెంచనుంది. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటల వైపు రైతులను మళ్లించడం.. పండిన పంట దిగుబడులను నేరుగా రైతులు విక్రయించేలా మార్కెట్ కనెక్టివిటీ పెంచడానికి ప్రాధాన్యత ఇవ్వనుంది. సాగులో అత్యాధునిక సాంకేతిక వ్యవస్థను విస్తృతం చేసేలా 12 అంశాలతో కూడిన సుస్థిర వ్యవసాయాన్ని అభివృద్ధి చేసేలా వ్యూహాత్మక ప్రణాళికను అమలు చేయనుంది.నైపుణ్యాల తోట.. ఉపాధికి బాట..అభివృద్ధి చెందుతున్న పారిశ్రామిక విధానాలకు అనుగుణంగా యువతను సిద్ధం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకోసం ఇప్పటికే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసింది. ఇందులో ప్రఖ్యాత పారిశ్రామికవేత్తలను భాగస్వాములను చేస్తూ యువతకు ఆధునిక పారిశ్రామిక విధానానికి అనుగుణమైన శిక్షణ ఇవ్వడంతోపాటు వారికి ఉపాధి అవకాశాలు పెంచేలా ప్రత్యేక పాఠ్యాంశాన్ని రూపొందిస్తోంది. స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిబులిటీ, ఉపాధితో కూడిన ఉన్నత విద్యను జోడించడమే లక్ష్యంగా కార్యక్రమాలను రచిస్తోంది. మరోవైపు యువతను క్రీడల వైపు ప్రోత్సహించి జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులుగా తయారు చేసే లక్ష్యంతో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం.. నిపుణులను, ప్రఖ్యాత క్రీడాకారులను భాగస్వాములను చేస్తూ సరికొత్తగా శిక్షణ ఇవ్వనుంది. -
2047కి త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ.. ఇదీ మా ‘విజన్’
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ రైజింగ్ 2047 విజన్ పాలసీ’ డాక్యుమెంట్‌ను రూపొందించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహ అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించాలని నిర్ణయించింది. ఈ మేరకు విజన్ రూపకల్పన, ప్రణాళికల తయారీకి వివిధ రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రముఖులు, నిపుణులతో అడ్వైజరీ కమిటీ ఏర్పాటు చేయనుంది. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను 2035 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ ఎకానమీగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా అభివృద్ధి చేయడానికి అవసరమైన ప్రణాళికలు ఈ విజన్ డాక్యుమెంట్లో ఉండనున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం 3.40 గంటల నుంచి రాత్రి 9.20 గంటల వరకు సచివాలయంలో సమావేశమైన రాష్ట్ర కేబినెట్.. పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంది. అనంతరం రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మహిళలు, రైతులు, యువత సంక్షేమానికి ప్రాధాన్యం విజన్ డాక్యుమెంట్ రూపకల్పనలో అన్ని శాఖలు, అన్ని విభాగాలు భాగస్వామ్యం పంచుకునేలా చూడాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఆశిస్తున్న వృద్ధి లక్ష్యంగా ఎంచుకునే కార్యక్రమాలు, చేపట్టాల్సిన కార్యాచరణను విజన్ డాక్యుమెంట్లో పొందుపరుస్తారు. విజన్ డాక్యుమెంట్ తయారీకి నీతి అయోగ్‌తో పాటు, ఇండియన్ స్కూల్ అఫ్ బిజినెస్ వంటి సంస్థలు రాష్ట్ర ప్రభుత్వానికి నాలెడ్జ్ పార్టనర్లుగా వ్యవహరిస్తాయి. కేంద్రం ప్రకటించిన వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా అన్ని రంగాల్లో సుస్థిర సమ్మిళిత అభివృద్ధి, రాష్ట్రంలో మౌలిక సదుపాయాల వృద్ధితో పాటు మహిళలు, రైతులు, యువకుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. దేశ ఆర్థిక వ్యవస్థకు పదో వంతు సంపదను అందించే రాష్ట్రంగా తెలంగాణ వృద్ధి సాధించాలనే భారీ లక్ష్యంతో ఈ విజన్‌కు రూపకల్పన చేయాలని అధికారులకు కేబినెట్ దిశా నిర్దేశం చేసింది. రైతుల సమక్షంలో సంబరాలు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది వానాకాలం పంటలకు పెట్టుబడి సాయం కింద రైతు భరోసాను విజయవంతంగా, రికార్డు వేగంతో అందించింది. సీఎం రేవంత్‌రెడ్డి రైతు నేస్తం కార్యక్రమంలో ఇచ్చిన మాట ప్రకారం 9 రోజుల్లో రూ.9 వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసింది. మిగిలిన రూ.400 కోట్లను మంగళవారం జమ చేయనుంది. కోటీ 49 లక్షల ఎకరాలకు ఈ సాయాన్ని పంపిణీ చేసింది. అతి తక్కువ వ్యవధిలో రాష్ట్రంలోని దాదాపు 71 లక్షల మంది రైతులకు రైతు భరోసా సాయం అందించింది. ఈ ఘనత సాధించిన శుభ సందర్భాన్ని రైతుల సమక్షంలోనే ఉత్సవంగా జరుపుకోవాలని కేబినెట్ నిర్ణయించింది. సచివాలయం ఎదురుగా రాజీవ్ విగ్రహం వద్ద.. మంగళవారం సాయంత్రం 4 గంటలకు సచివాలయం ఎదురుగా ఉన్న రాజీవ్‌గాంధీ విగ్రహం వద్ద 2 వేల మంది రైతులతో ‘రైతు నేస్తం’ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించనుంది. సీఎం రేవంత్‌తో పాటు మంత్రివర్గం ఈ కార్యక్రమంలో పాల్గొననుంది. ఇక అన్ని జిల్లాల్లో రైతు వేదికలతో పాటు మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు, సంబరాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సంబరాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు పాల్గొనాలని ఆదేశించింది. ప్రతి జిల్లా కలెక్టరేట్లో తెలంగాణ తల్లి విగ్రహం రాష్ట్రంలోని ప్రతి జిల్లా కలెక్టరేట్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. అన్ని జిల్లాల్లో డిసెంబర్ 9న ఈ విగ్రహాలను ఆవిష్కరించనున్నారు. ఆర్ఆర్ఆర్ దక్షిణ అలైన్‌మెంట్‌కు ఓకే హైదరాబాద్ చుట్టూ నిర్మించబోయే రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్) దక్షిణ భాగం అలైన్మెంట్ ప్రతిపాదనలకు కేబినెట్ తుది ఆమోదం తెలిపింది. అంతకుముందు ఆర్ అండ్ బీ విభాగం తయారు చేసిన మూడు ప్రతిపాదనలను పరిశీలించింది. అనంతరం చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వరకు 201 కి.మీ.ల పొడవు ఉండే ఈ అలైన్‌మెంట్‌కు ఆమోదం తెలిపింది. జూలై మొదటి వారంలో సీఎల్పీ సమావేశం తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగించేలా ఏపీ తలపెట్టిన గోదావరి –బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టును చట్టపరంగా, న్యాయపరంగా అడ్డుకునేందుకు అన్ని చర్యలు చేపట్టాలని, అన్ని వేదికలను ఉపయోగించుకోవాలని కేబినెట్ తీర్మానించింది. ఒక చుక్క గోదావరి జలాలను కూడా నష్టపోకుండా చిత్తశుద్ధితో పోరాడాలని నిర్ణయించింది. 2016లో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో 400 టీఎంసీల గోదావరి జలాలను తరలించాలని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదించగా, దాని ఆధారంగానే బనకచర్ల ప్రాజెక్టును ఏపీ రూపొందించిందని మంత్రివర్గం పేర్కొంది. ఈ విషయాన్ని మరిచిపోయిన బీఆర్ఎస్ నేతలు తమ ప్రభుత్వంపై అబద్ధాలతో గోబెల్స్ ప్రచారం చేస్తున్నారంటూ ధ్వజమెత్తింది. ఈ ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఇప్పటివరకు తీసుకున్న చర్యలను వివరించడంతో పాటు భవిష్యత్ కార్యాచరణను సిద్ధంచేసేందుకు జూలై మొదటి వారంలో సీఎల్పీ సమావేశం నిర్వహించనుంది. ప్రాజెక్టుపై పూర్తి వివరాలతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని నిర్ణయించింది. విభజన వివాదాలపై మళ్లీ చర్చలు రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న అంశాల్లో ఇంకా అపరిష్కృతంగా ఉండిపోయిన అంశాలపై రెండు తెలుగు రాష్ట్రాల అధికారుల కమిటీల ఆధ్వర్యంలో మళ్లీ సమావేశాలను పునరుద్ధరించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ మేరకు ఏపీకి లేఖ రాయనుంది. ‘కాళేశ్వరం’ సమాచారాన్ని కమిషన్‌కు ఇవ్వనున్న సర్కార్ కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌ల నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా తెలియజేయాలనుకున్నా, సమాచారం ఇవ్వాలనుకున్నా ఈ నెల 30 లోగా ఇవ్వాలని జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ రాసిన లేఖపై మంత్రివర్గం చర్చించింది. ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉన్న సమాచారాన్ని గడువులోగా కమిషన్‌కు అందజేయాలని నిర్ణయించింది. సీఎస్ ఆధ్వర్యంలో సీనియర్ అధికారులకు ఈ బాధ్యత అప్పగించింది. మంత్రివర్గ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలకు మేరకే బరాజ్‌లను నిర్మించినట్టు కమిషన్ ఎదుట విచారణకు హాజరైన సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీశ్, ఈటల రాజేందర్ వాంగ్మూలం ఇచ్చారు. నాటి మంత్రి హరీశ్ అధ్యక్షతన ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం బరాజ్‌ల నిర్మాణంపై నిపుణుల కమిటీ సిఫారసులను ఆమోదించిన తర్వాతే మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని ఈటల, హరీశ్‌రావు కమిషన్‌కు వివరించారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ ఉపసంఘంతో పాటు మంత్రివర్గ సమావేశాల్లో అలాంటి నిర్ణయాలు ఏమీ జరగలేదని రుజువు చేసేందుకు గాను వాటికి సంబంధించిన మినిట్స్ కాపీలను కమిషన్‌కు ప్రభుత్వం అందించనుంది. తెలంగాణ స్పోర్ట్స్ పాలసీకి ఆమోదం రాష్ట్రంలో ప్రతిభ ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించడంతో పాటు క్రీడా ప్రమాణాలను పెంపొందించి 2036 ఒలంపిక్స్‌లో తెలంగాణ సత్తాను చాటాలనే ఉద్దేశంతో రూపొందించిన తెలంగాణ స్పోర్ట్స్ పాలసీని కేబినెట్ ఆమోదించింది. మంత్రివర్గ నిర్ణయాలపై త్రైమాసిక సమీక్ష పరిపాలన సంస్కరణల్లో భాగంగా ఇకపై ప్రతినెలా రెండుసార్లు మంత్రివర్గ సమావేశాలు నిర్వహించనుంది. మంత్రివర్గ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల అమలులో పురోగతిని సమీక్షించడానికి త్రైమాసిక సమావేశాలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. మున్సిపాలిటీలుగా ఇంద్రేశం, జిన్నారం సంగారెడ్డి జిల్లాలోని ఇంద్రేశం, జిన్నారంను కొత్త మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో పాటు ఇస్నాపూర్ మున్సిపాలిటీని అప్ గ్రేడ్ చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన మున్సిపాలిటీల్లో కమిషనర్లతో పాటు వివిధ విభాగాల్లో 316 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నోరి దత్తాత్రేయుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ క్యాన్సర్ చికిత్స నిపుణులు నోరి దత్తాత్రేయుడిని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రి అభివృద్ధితో పాటు, క్యాన్సర్ నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యల విషయంలో ఆయన సేవలను వాడుకోనుంది. ఎంఎన్‌జే ఆస్పత్రి అప్‌గ్రేడేషన్, సిబ్బంది నియామకానికి ఆమోదం తెలిపింది. బాసర ట్రిపుల్ ఐటీ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ కాలేజీ ఈ విద్యా సంవత్సరంలో బాసర ట్రిపుల్ ఐటీ కింద మహబూబ్‌నగర్‌లో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేసి ఏటా 180 మంది విద్యార్థులు చొప్పున 6 ఏళ్లలో 1080 మందికి అడ్మిషన్లు ఇవ్వాలని నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతమైన హుస్నాబాద్‌లో శాతవాహన వర్సిటీ కింద ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేసి 240 మందికి అడ్మిషన్లు కల్పించాలని నిర్ణయించింది. శాతావహన వర్సిటీలో ఈ ఏడాది నుంచి చెరో 60 సీట్లతో ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సులను ప్రారంభించాలని నిర్ణయించింది. -
ఈ స్వారీ ఏమిటి సామీ!
చంద్రబాబు నాయుడు (సీబీఎన్) ముఖ్యమంత్రి అయిన నాలుగేళ్ళకే కేంద్ర ‘ప్లానింగ్ కమిషన్’ను నిబంధనలు అధిగ మించి ‘ఇరవై ఏళ్ల నా విజన్ –2020’ అంటూ ఒక ‘డాక్యుమెంట్’ను ‘మెకెన్సీ’ కన్సల్టెన్సీ కంపె నీతో రాయించుకున్నారు. 30 ఏళ్ల క్రితం మొదలయిన ‘సరళీకరణ’, ‘ప్రైవేటీకరణ’లను ఆయన అలా మలుచుకున్నారు. ఐదేళ్ల కాలానికి మించి ‘ప్లానింగ్’ అనేది అప్పటికి ప్రభుత్వ విధానంగా లేదు. కానీ జరిగింది ఏమిటి? ‘విజన్ డాక్యుమెంట్’లో ముందుగా చెప్పని రాష్ట్ర విభజన జరిగింది. రెండు కొత్త ప్రాంతీయ పార్టీలు ఏర్పడి, అవి అధికారంలోకి కూడా వచ్చాయి. విభజన తర్వాత ఒక ‘టర్మ్’ ప్రభుత్వంలో ఉన్నా... ఓడి మరో ఐదేళ్ళు ప్రతిపక్షంలో ఉండి, మళ్ళీ ఇప్పుడు గెలిచి సీఎం అయ్యారు. అయితే అందుకు ఆయన పలు రాజీలు పడ్డారు. ఇలా ‘విజన్ డాక్యుమెంట్’ ఒక్కటే కాదు, ఆయనది మొదటి నుంచీ ఎప్పుడూ ఏవో కొన్ని ‘టూల్స్’ దన్నుతో నెట్టుకొచ్చే నిలకడలేని సందిగ్ధ స్థితి. ఆయనకు ఆ హోదా సిద్ధాన్నం (‘టిన్ ఫుడ్’) కావడంతో... ఆ ‘పోస్టు’కు ఉండే సహజ పోటీలో నెగ్గుకుని రావడం కోసం మొదట్లోనే – ‘మేనేజిరియల్ స్కిల్స్’తో ప్రజల దృష్టి మళ్ళించ గలిగిన కొందరు ‘బ్యురోక్రాట్ల’ను, ‘మీడి యా’ను ఆయన దగ్గరకు తీశారు. ‘విన్–విన్’ అంటూ పరస్పర ప్రాయోజిత మార్గం ‘రిఫార్మ్స్’ కాలంలో అలా కలిసి వచ్చింది. అలా ఆయన ‘సీటు’లోకి వచ్చిన ఏడాదికే ‘కొరియన్ మోడల్’ అంటూ ‘జన్మభూమి’ని తెచ్చి దానికి సొంతూరు ‘సెంటిమెంట్’ ప్రచారం కల్పించారు. చివరికి ‘జన్మభూమి’ అంటే... అదొక పార్టీ ‘స్టిక్కర్’లా మారింది. నిజానికి ఇవి పాత విషయాలు. అయితే ఇక్కడ వీటిని గుర్తు చేయడానికి కారణం ఉంది. గతంలో సీబీఎన్ నిర్ణయాత్మకతలోని సందిగ్ధ స్థితిని ‘కవర్’ చేసి మునుపటిలా ఆయన్ని ‘బ్రాండింగ్’ చేయడం 2025 నాటికి సదరు తల నెరిసిన ‘మీడియా మేనేజర్ల’కు సైతం ఇప్పుడు అలవి కావడం లేదు. కారణం ఒకప్పుడు ఆ బాధ్యత అవలీలగా చేసిన ప్రధాన ‘మీడియా’తో సమాంతరంగా ‘సోషల్ మీడియా’ వచ్చిన ఫలితంగా వాళ్ళు ఇపుడు తరచూ గందరగోళానికి గురవడమే! వాళ్ల నోటికి నిబంధనలతో కూడిన ‘బుక్’ అంటూ ఏమీ ఉండదు కనుక, చివరికి వాళ్ళు ‘అధికారులకు కళ్ళు నెత్తికెక్కాయి... గతంలో ఇలా లేదు. జగన్ మోహన్ రెడ్డి అంటే వాళ్ళు భయపడేవారు...’ అంటూ కూడా మాట్లా డుతున్నారు. చివరికి దీన్ని ఇద్దరు నాయకుల యుద్ధ భూమిగా మార్చి ప్రభుత్వంలో ‘ఎగ్జిక్యూటివ్’ (కార్య నిర్వాహకవర్గం) అనుసరించాల్సిన ‘బుక్’ ఉంటుంది, ‘జ్యుడిషియరీ’ (న్యాయవ్యవస్థ)కి వాళ్ళు జవాబుదారీ అవుతారనే ఇంగితం లేకుండా వీరి ప్రహసనం సాగు తున్నది. అనివార్యంగా రాజ్యనీతిలోకి చొచ్చుకొచ్చిన సరళీ కరణ–ప్రైవేటీకరణల ప్రభావం, నైసర్గికంగా రాష్ట్రం విభజన జరగడం ఈ సందర్భంగా గమనార్హం. అది రాష్ట్రమైనా, సమాజమైనా ఒక కోత (కట్)కు గురైన ప్పుడు, మునుపు చూడని కొత్త పార్శా్వలు, వాటికి మొలిచే కొత్త మొలకలు అనేకం బయటకు వస్తాయి. ఆ దశలో పాలనకు అవి విసిరే సవాళ్ళను ఎదుర్కొని వాటి పర్యవసానాలను రాజ్యంగ స్ఫూర్తికి లోబడి పరిష్కరించే అధికార యంత్రాంగాన్ని ‘రాజ్యం’ ప్రభుత్వ పరిధిలో ఉండే ‘ఎగ్జిక్యూటివ్’ నుంచి సిద్ధం చేసుకోవాలి. అది వారి ‘సర్వీసు’లకు తగిన రక్షణ ఇవ్వాలి. రాజకీయాల కోసం వాళ్ళను బలిచేస్తే, నష్టపోయేది రాష్ట్రమే! దాన్ని అర్థం చేసుకునే దార్శనికత ‘లెజిస్లేచర్’ (శాసన వ్యవస్థ)కు ఉండాలి. విభజనతో ఏర్పడిన కొత్త రాష్ట్రంలో ఇంకా ‘రాజ్యం’ వైపు ప్రాథమిక అవసరాల కోసం చూసే నిర్లక్షిత సమాజాల అవసరాల పట్ల కనీస స్పృహ ఎగ్జిక్యూటివ్ – లెజిస్లేచర్లు ఇద్దరికీ ఉండాలి. కానీ సంస్కరణల మొదట్లో ‘సమ్మిళిత వృద్ధి’ (ఇంక్లూజివ్ గ్రోత్) అంటూ హామీ ఇచ్చి, ఇప్పుడు దాన్ని అటకెక్కించి ‘సంక్షేమాన్ని’ సమీక్షించే బాధ్యతను నోరున్న ప్రతి ఒక్కరూ తీసుకోవడం, వైసీపీ ప్రభుత్వం తర్వాత కొత్తగా చూస్తున్నాం. కేవలం తాము ‘లెజి స్లేచర్’ పక్షం ‘మీడియా’ అనే ఒకే ఒక్క ఆధిక్యతతో ‘ప్రైవేటు’గా ప్రభుత్వ పాలనలోకి చొరబడి, ‘ఎగ్జిక్యూ టివ్’ మీదికి ఎక్కేస్తున్న విపరీత ధోరణిని 2024 ఎన్ని కలు తర్వాత కొత్తగా చూస్తున్నాము. ప్రభుత్వ వ్యవస్థలు, శాఖలు ఆధునిక ‘టెక్నాలజీ’తో తమ నిధులకు గండి పడకుండా ‘లీకేజీ’లను కట్టడి చేస్తుంటే, ప్రకృతికి ఏ కంచె లేదని సహజ వనరులు తవ్వుకుంటూ సొమ్ము చేసుకుంటుంటే... దాన్ని వదిలి పేదలకు సంక్షేమ పథ కాల అవసరాన్ని ప్రశ్నించడానికి ఈ ‘మేనేజర్లు’ బరి తెగిస్తున్నారు. ఈ కొత్త ధోరణిపై చర్చ మొదలు కాకపోతే కొన్నాళ్ళకు ‘ప్రైవేటు’ శక్తులు తమ పరిధి దాటి ప్రభుత్వ జాగాలోకి చొచ్చుకు వస్తాయి. సీబీఎన్ రాజకీయాలకు మొదటి నుంచి తనదైన ‘పబ్లిక్ పాలసీ’ అంటూ ఒకటి లేక, ‘ట్రెండ్స్’ను బట్టి అది మారడం వల్ల, గడచిన పదే ళ్ళలో ఆయన స్వీయ సమాచార వ్యవస్థ ‘టెర్మినల్స్’కు చేరింది. అందుకే ఆ ‘క్యాంప్’ నుంచి పరస్పర విరుద్ధ ప్రకటనలు చూస్తున్నాం. జరిగిన రెండు కలెక్టర్ల సమా వేశాల్లోనూ, ఈ నెల కుప్పం పర్యటనలోనూ సీబీఎన్– ‘నాది పొలిటికల్ గవర్నెన్స్’ అంటుంటే, ఆయన ‘మీడియా మేనేజర్లు’ మాత్రం – ‘బాబు గారూ! మీరు ఎప్పటిలా మళ్ళీ ‘సీఈఓ’ అయ్యారు. అలా వద్దు సార్! మీరు రాజకీయాలు మాత్రమే చేయండి’ అనడం ఈ గందరగోళానికి పరాకాష్ఠ!జాన్సన్ చోరగుడివ్యాసకర్త అభివృద్ధి–సామాజిక అంశాల వ్యాఖ్యాత -
అభివృద్ధి చెందిన భారత్ హోదానే లక్ష్యం
న్యూఢిల్లీ: భారత్ 2047 నాటికి (స్వాతంత్య్రం సాధించి 100 సంవత్సరాలు) 30 ట్రిలియన్ డాలర్ల అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మారేందుకు విజన్ డాక్యుమెంట్‌ను సిద్ధం చేస్తున్నట్లు నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ విజన్ డాక్యుమెంట్‌ను వచ్చే ఏడాది జనవరిలో ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇండస్ట్రీ సంస్థ– ఫిక్కీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. విజన్ డాక్యుమెంట్– 2047 భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి అవసరమైన సంస్థాగత, నిర్మాణాత్మక మార్పులను సంస్కరణలను నిర్దేశిస్తుందని ఆయన అన్నారు. దిగువ మధ్య ఆదాయ స్థితి నుంచి దేశ పురోగతి విజన్ 2047 ప్రధానంగా నిర్దేశించనున్నట్లు పేర్కొన్నారు. ఇదే బాటలో రాష్ట్రాలు.. రాష్ట్రాలు కూడా తమ విజన్ డాక్యుమెంట్లను అభివృద్ధి చేస్తున్నాయని నీతి ఆయోగ్ సీఈవో ఈ సందర్భంగా తెలిపారు. ఈ ఏడాది మే 2023లో నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఉద్దేశించి ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగిస్తూ, 2047 నాటికి దేశాన్ని వికసించిన భారత్‌గా (అభివృద్ధి చెందిన దేశంగా) మార్చేందుకు కృషి చేయాలని పిలుపునిచి్చన సంగతి తెలిసిందే. ఈ ప్రక్రియను డిసెంబర్ 2021లో క్యాబినెట్ సెక్రటరీ ప్రారంభించారు. థీమాటిక్, సెక్టోరల్ విజన్లను (రంగాల వారీగా) సిద్ధం చేసే బాధ్యతలను 10 సెక్టోరల్ గ్రూప్స్ ఆఫ్ సెక్రటరీలకు అప్పగించడం జరిగింది. పరిశ్రమ ఛాంబర్లు, ఎగుమతి ప్రోత్సాహక మండలి, విశ్లేషణా నిపుణులు, పరిశోధనా సంస్థలతో పలు దఫాల్లో మేధోమథనం, సంబంధిత సంప్రదింపులు జరిగాయి. అభివృద్ధి చెందిన భారత్ ః2047 కోసం 10 రంగాల దార్శినికత విభాగాలను ఏకీకృతం చేసేందుకు 2023లో నీతి ఆయోగ్ బాధ్యతలు చేపట్టింది. విద్యకు ప్రాధాన్యత... కేంద్రం దేశంలో విద్యా ప్రమాణాల పెరుగుదలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు సీఈఓ సుబ్రమణ్యం పేర్కొన్నారు. దేశంలో కాలేజీల నమోదు రేటును 27 శాతం నుంచి 50–60 శాతానికి పెంచాలని ప్రభుత్వం కోరుకుంటోందని చెప్పారు. ఉన్నత విద్య కోసం ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు వెచ్చిస్తోందని పేర్కొన్న ఆయన, ఇప్పుడు భారత విద్యా రంగాన్ని కూడా పునరుద్ధరించాల్సిన అవసరం ఉందన్నారు. కాలేజీకి వెళ్లే జనాభా 4 కోట్ల నుండి 8–9 కోట్లకు పెరుగుతుందని ఆయన పేర్కొంటూ, కాబట్టి మనకు ఈ రోజు ఉన్న వెయ్యి విశ్వవిద్యాలయాలతో పాటు మరో వెయ్యి విశ్వవిద్యాలయాలు అవసరమని విశ్లేషించారు. రాష్ట్రాలు ఆర్థికంగా ఒత్తిడికి లోనవుతున్నందున, కొత్త విశ్వవిద్యాలయాలను ప్రారంభించడానికి ప్రైవేట్ రంగం నుండి నిధులు మరింత రావాల్సి ఉంటుందని సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. పరిశోధన–అభివృద్ధి– ఆవిష్కరణలే లక్ష్యంగా పనిచేసే బోస్టన్– శాన్ ఫ్రాన్సిస్కో వంటి విద్యా నగరాలను దేశంలో సృష్టించాల్సిన అవసరం ఉందని అన్నారు. భారతదేశ జనాభాలో సగం మంది సగటు వయస్సు 29 ఏళ్లలోపేనని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ‘‘భారతదేశం జనాభా సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడానికి మనకు 25 సంవత్సరాల సుదీర్ఘ అద్భుత సమయం ఉంది’’ అని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద శ్రామికశక్తిని అందించే దేశంగా భారత్ అవతరించబోతోందని పేర్కొన్న సుబ్రహ్మణ్యం, ప్రతి సంవత్సరం 13 లక్షల మంది భారతీయ విద్యార్థులు తమ ఉన్నత విద్యను పూర్తి చేయడానికి భారతదేశం నుండి బయటకు వెళ్తున్నారని చెప్పారు. అయితే ఎక్కువ మంది విద్యార్థులను భారత్‌కు ఆకర్షించేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఉద్ఘాటించారు. తలసరి ఆదాయం 18,000 డాలర్లు లక్ష్యం... ప్రస్తుతం అనుసరిస్తున్న ఆర్థిక సూత్రాల ప్రకారం... తలసరి ఆదాయం 1,036 డాలర్ల నుంచి 4,045 డాలర్ల మధ్య ఉన్న దేశాన్ని దిగువ మధ్య తరగతి ఆదాయ దేశంగా పరిగణిస్తారు. 4046 డాలర్ల నుంచి 12,535 డాలర్ల మధ్య ఆదాయ దేశాలను ఎగువ మధ్య తరగతి ఆదాయ దేశాలుగా పేర్కొంటారు. 12,000 డాలర్ల తలసరి ఆదాయం దాటితే అది అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది. అమెరికా, చైనా, జపాన్, జర్మనీ తర్వాత ప్రస్తుతం ప్రపంచంలో ఐదవ ఐతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా (3.75 ట్రిలియన్ డాలర్లు) కొనసాగుతున్న భారత్ తలసరి ఆదాయం దాదాపు 1,183 డాలర్లుగా (రూ.98,374) అంచనా. 2047 నాటికి ఈ పరిమాణం 18,000 డాలర్లకు పెరగాలన్నది లక్ష్యం. 25.5 ట్రిలియన్ డాలర్లతో అమెరికా ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద ఎకనామగా కొనసాగుతోంది. ప్రపంచం మొత్తం జీడీపీలో పావుశాతం వాటాను కలిగి ఉంది. ఇక 17.9 శాతం ప్రపంచ జీడీపీ వాటాతో 18 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా చైనా రెండవ స్థానంలో ఉంది. తరువాతి స్థానాల్లో జపాన్ (4.2 ట్రిలియన్ డాలర్లు), జర్మనీ (4 ట్రిలియన్ డాలర్లు)లు ఉన్నాయి. కాగా, 2022 నాటికి భారత్ ఎకానమీ బ్రిటన్, ఫ్రాన్స్‌లను అధిగమించగా, 2023 నాటికి జర్మనీని అధిగమించే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. నేడు రెండో త్రైమాసిక జీడీపీ ఫలితాలు భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (జూలై–సెపె్టంబర్) స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) గణాంకాలు గురువారం వెలువడనున్నాయి. మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) వృద్ధి 7.8 శాతంగా నమోదయిన సంగతి తెలిసిందే. గత ఆర్థిక సంవత్సరం ఎకానమీ వృద్ధి రేటు 7.2 శాతం. కాగా, రెండవ త్రైమాసికంలో మంచి ఫలితాలే నమోదవుతాయన్న విశ్వాసాన్ని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్ వ్యక్తం చేశారు. అంతక్రితం ఆయన ‘పట్టణ మౌలిక రంగం అభివృద్ధి కోసం ప్రైవేట్ పెట్టుబడుల వినియోగం– జీ20 ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ నుండి అనుభవ పాఠాలు’ అనే అంశంపై జరిగిన ఒక జాతీయ వర్క్‌షాప్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆహార రాయితీకి అదనపు నిధుల కేటాయించాల్సిన అవసరం ఏర్పడుతున్నప్పటికీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5.9 శాతం ద్రవ్యలోటు (ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం. ఇది జీడీపీ నిష్పత్తిలో చూస్తారు) లక్ష్య సాధన సాధ్యమేనని ఆయన అన్నారు. గత ఆర్థిక సంవత్సరం ఈ రేటు 6.4 శాతంగా ఉన్న సంగతి తెలిసిందే. 2025–26 నాటికి భారత్ ద్రవ్యలోటు లక్ష్యాన్ని 4.5 శాతంగా కేంద్రం నిర్దేశించుకుంది. -
భారత్, శ్రీలంకల మధ్య విజన్ డాక్యుమెంట్
న్యూఢిల్లీ: భారత్‌లో రెండు రోజుల పర్యటనకు వచ్చిన శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమ్ సింఘే శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఇరువురు నేతల మధ్య విస్తృత స్థాయిలో చర్చలు జరిగాక ఆర్థిక భాగస్వామ్య విస్తరణకు ఒక విజన్ డాక్యుమెంట్‌ను ఆమోదించారు. ఈ మేరకు ప్రధాని మోదీ ఒక పత్రికా ప్రకటనని విడుదల చేశారు. గత ఏడాది శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయి ఉన్నప్పుడు భారత్ ఒక స్నేహితుడిలా ఆదుకుందని, ఇరు దేశాల మధ్య భద్రత, అభివృద్ధి ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నందున అన్నింటిని దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు. శ్రీలంకతో ఆర్థిక భాగస్వామ్యం పెంపొందించుకోవడానికి విజన్ డాక్యుమెంట్‌ను ఆమోదించడంతో పాటు పర్యాటకం, వాణిజ్యం, విద్యుత్, ఉన్నత విద్య, నైపుణ్యాల అభివృద్ధి, అనుసంధానం వంటి రంగాల్లో పరస్పరం సహకరించుకోవడానికి ఇరు దేశాలు అంగీకరించాయి. నావికా బలగం, వైమానిక దళం, ఇంధనం, ప్రజల మధ్య అనుసంధానం వంటివి కూడా బలోపేతం చేసే దిశగా ఇరు దేశాలు అడుగులు వేస్తున్నాయి. మరోవైపు శ్రీలంకలో తమిళుల ఆకాంక్షలను తీర్చడానికి సహకరించాలని ప్రధాని మోదీ విక్రమ్ సింఘేను కోరారు. మత్స్యకారుల అంశంలో మానవీయ కోణంలో ఆలోచిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
మిషన్ 6జీ.. 5జీ కంటే వందరెట్ల వేగంగా నెట్ స్పీడ్.. భారత్ భారీ ప్లాన్!
టెలికమ్యూనికేషన్ రంగంలో ప్రపంచ దేశాలతో భారత్ పోటీ పడుతోంది. 5జీ సేవల్ని 125 నగరాల్లో అందుబాటులోకి తెచ్చి ఆరు నెలలైందో లేదో 6జీపై అధ్యయనం కోసం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఒక విజన్ డాక్యుమెంట్‌ను విడుదల చేసింది. 2030 నాటికి దేశంలో 6జీ సేవలు అందుబాటులోకి తెచ్చి ప్రజా జీవనంలోనూ, సామాజికంగా సమూల మార్పు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. 6జీని ఒక మిషన్లా తీసుకువెళ్లి దక్షిణ కొరియా, చైనా, జపాన్ వంటి దేశాల సాంకేతికతతో పోటీపడతామని సగర్వంగా ప్రకటించింది. ప్రస్తుతం భారతీయులు 100 కోట్ల మొబైల్ ఫోన్లను వాడుతున్నారు. ఇంటర్నెట్ వాడే వారి సంఖ్య 2014లో 25 కోట్లు ఉంటే ఇప్పుడు 85 కోట్లకు చేరుకుంది. ఇక ఏడాదికేడాది స్మార్ట్ ఫోన్లు వాడే సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం 30 కోట్ల గృహాలకు చెందిన వారు ఏడాదికి 16 కోట్ల కంటే ఎక్కువగానే స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేస్తున్నారు. అంటే ప్రతీ ఇంటివారు రెండేళ్లకి ఒకసారి కొత్త ఫోన్‌ను కొంటున్నట్టు లెక్క. భారతీయులు ఫోన్ లేకుండా ఒక నిముషం కూడా గడిపే పరిస్థితి లేదు. అన్ని పనులు ఫోన్‌ద్వారా చేస్తున్నారు. ఏదైనా బిల్లు కట్టాలన్నా, సినిమాలు చూడాలన్నా, ఆన్లైన్ క్లాసులు వినాలన్నా , బ్యాంకింగ్ లావాదేవీలు, యూపీఐ చెల్లింపులు ఇలా.. ఏ పనైనా అరచేతిలో ఉన్న ఫోన్‌తోనే. అందుకే స్మార్ట్ ఫోన్ మార్కెట్ కూడా మన దగ్గరే ఎక్కువ. 6జీ ద్వారా నెట్ స్పీడ్ పెరిగితే మరింత సులభంగా పనులన్నీ అయిపోతాయి. ఆ మేరకు మార్కెట్ కూడా విస్తృతమవుతుంది. పదేళ్లలో 6జీ సేవలు అందుబాటులోకి తెచ్చేలా కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది. ఏమిటీ 6జీ...? టెలికమ్యూనికేషన్ రంగంలో ఆరో తరం సేవల్ని 6జీ అంటారు. 5జీ సేవలు పూర్తిగా విస్తరించకుండానే 6జీపై కేంద్రం పరిశోధనలు మొదలు పెట్టింది. 5జీ కంటే దీని నెట్ స్పీడ్ వందరెట్లు వేగంగా ఉంటుంది. సెకనుకు ఒక టెరాబైట్ వేగంతో పని చేస్తుంది. క్షణ మాత్రం ఆలస్యం లేకుండా డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది. కేంద్రం ప్రణాళికలు ఇవే ..! భారత్ 6జీ ప్రాజెక్టును రెండు దశల్లో అమలు చేస్తారు. తొలి దశలో ప్రధానంగా పరిశోధనలపై ఫోకస్ ఉంటుంది. రెండో దశలో వాణిజ్యపరంగా 6జీ సేవల వాడకంపై సమగ్ర అధ్యయనం జరుగుతుంది. ప్రాజెక్టు పర్యవేక్షణకు కేంద్రం అత్యున్నత కౌన్సిల్‌ను ఏర్పాటు చేసింది. 6జీ ప్రమాణాలు, స్పెక్ట్రమ్‌ల గుర్తింపు, సిస్టమ్స్, డివైజ్‌లకు ఎకో సిస్టమ్ ఏర్పాటు, పరిశోధన, అధ్యయనాలకు ఆర్థిక సాయం తదితరాలను ఈ కౌన్సిల్ పర్యవేక్షిస్తుంది. రూ.10వేల కోట్లతో ఒక కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేసి 6జీపై తొలిదశ పరిశోధనలు మొదలు పెట్టనున్నారు. మొత్తంగా 6జీ పరిశోధనలకు రూ. 63 వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనాలున్నాయి. కొత్త సాంకేతిక వ్యవస్థలైన టెరాహెర్ట్జ్ కమ్యూనికేషన్, రేడియో ఇంటర్ఫేసెస్, టాక్టిల్ ఇంటర్నెట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కొత్త ఎన్కోడింగ్ పద్ధతులు, 6జీ పరికరాలకు అవసరమయ్యే చిప్ సెట్స్ వంటివాటిపై కూడా ప్రధానంగా అత్యున్నత మండలి దృష్టి పెడుతుంది. ఎలాంటి మార్పులు వస్తాయి? ► 6జీ అందుబాటులోకి వస్తే ఫ్యాక్టరీలన్నీ రిమోట్ కంట్రోల్‌తో ఆపరేట్ చేయొచ్చు ► రియల్–టైమ్ గేమింగ్ ఇండస్ట్రీకి కొత్త హంగులు చేకూరుతాయి. ► స్వయంచోదక కార్లు రోడ్లపై ఇక పరుగులు తీస్తాయి ► డేటా ట్రాన్స్ఫర్ జాప్యం లేకుండా క్షణాల్లో జరగడం వల్ల సుదూరంలో ఉండి కూడా సర్జరీ చేసే అవకాశం ఉంటుంది. ► 6జీ సపోర్ట్‌తో నడిచే డివైజ్‌లన్నీ బ్యాటరీలతో నడుస్తాయి. దీంతో బ్యాటరీ తయారీ రంగం పరుగులు పెడుతుంది ► ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధ) మరో దశకు చేరుకుంటుంది. ► ఆత్మనిర్భర్ భారత్ కింద ఉన్న డిజిటల్ ఇండియా, రూరల్ బ్రాడ్‌బ్యాండ్, స్మార్ట్ సిటీలు, ఈ–గవర్నెన్స్ వంటివి పుంజుకుంటాయి. ► రేడియో ఫ్రీక్వెన్సీ వినియోగం మరింత సామర్థ్యంతో పని చేస్తుంది. ఎలాంటి నెట్వర్క్ సమస్యలు లేకుండా ఒకేసారి అత్యధిక డివైజ్‌లకు నెట్ కనెక్షన్ ఇవ్వొచ్చు. 5జీతో పోలిస్తే 10 రెట్లు ఎక్కువ పరికరాలకు 6జీ కనెక్షన్ ఒకేసారి ఇచ్చే అవకాశముంటుంది. ► వైర్లెస్ కమ్యూనికేషన్లలో విప్లవాత్మక మార్పులు రావడంతో పర్యావరణం అనుకూలంగా ఉంటుంది. 5జీ రేడియేషన్‌తో పర్యావరణానికి దెబ్బ ఎక్కువగా ఉందనే ఇప్పటికే విమర్శలున్నాయి. ► సామాజికంగా పలు మార్పులు చోటు చేసుకుంటాయి. అత్యంత వేగంతో పనిచేసే ఇంటర్నెట్ అందుబాటులోకి రావడం వల్ల ఎక్కడ నుంచైనా పని చేసే అవకాశం ఉంటుంది. దీంతో పల్లెలు, పట్టణాల మధ్య తేడా తగ్గిపోతుంది. పల్లెల నుంచి వలసల్ని నిరోధించవచ్చు ► 6జీ సర్వీసులు అందరికీ అందుబాటులోకి రావడం, ఎక్కడ నుంచైనా రిమోట్ కంట్రోల్‌తో ఆపరేట్ చేసే అవకాశాలు ఉండడంతో గ్రామీణ జీవనంలో కూడా విప్లవాత్మక మార్పులు వస్తాయి. ఇతర దేశాల్లో ఎలా..? ► 6జీ సేవల్లో ప్రస్తుతం దక్షిణ కొరియా ముందంజలో ఉంది. రూ.1200 కోట్ల పెట్టుబడులతో 2025కల్లా తొలి దశ అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఉంది. ► జపాన్‌లో ఐఒడబ్ల్యూఎన్ ఫోరమ్ 6జీ సేవలపై 2030 విజన్ డాక్యమెంట్ని విడుదల చేసింది. ► చైనా 6జీపై 2018లోనే అధ్యయనం ప్రారంభించింది. 2029లో అందుబాటులోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ► అమెరికా కూడా ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (ఎఫ్‌సీసీ)తో కలిసి 2018లో 6జీపై అధ్యయనాలు మొదలు పెట్టింది. యాపిల్, గూగుల్ వంటి కంపెనీలతో కూడా కలిసి పనిచేస్తోంది. -
కేసీఆర్ ‘విజన్ డాక్యుమెంట్’ రైతులు, దళితుల పురోభివృద్ధికి..
సాక్షి, హైదరాబాద్: జాతీయ పార్టీ ఏర్పాటు దిశగా సన్నాహాలు వేగవంతం చేసిన ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు రైతులు, దళితులపై కొత్త పార్టీ అనుసరించే విధానంపై కసరత్తు చేస్తున్నారు. జాతీయ పార్టీ ఏర్పాటు ప్రకటనకు దసరాను ముహూర్తంగా ఎంచుకోగా, అంతలోగానే ఈ రెండు వర్గాల అభ్యున్నతికి ‘విజన్ డాక్యుమెంట్’ను విడుదల చేయాలని నిర్ణయించారు. కొత్త జాతీయ పార్టీ ఎజెండాలో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయడంతోపాటు ఎస్సీల అభివృద్ధి, సంక్షేమానికీ ప్రాధాన్యత ఇవ్వాలని యోచిస్తున్నారు. ఈ వర్గాల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల స్ఫూర్తి జాతీయ పార్టీ ఎజెండాలో ప్రతిబింబించాలని సంకల్పిస్తున్నారు. ఈ పథకాలకు మరికొన్ని జోడించి ‘విజన్ డాక్యుమెంట్’ను రూపొందిస్తున్నారు. ఇటీవలి కాలంలో వివిధ రాష్ట్రాలకు చెందిన రైతులు, ఎస్సీలతో భేటీ సందర్భంగా వచ్చిన సలహాలు, సూచనల్లో ఆచరణ సాధ్యమైన వాటికి విజన్ డాక్యుమెంట్లో చోటుకల్పిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ మోడల్‌ను పరిచయం చేసేలా... దేశంలో సాగుకు యోగ్యమైన భూమి, అందుబాటులో ఉన్న నీటి వనరులు, రైతు అనుకూల సాగు చట్టాల రూపకల్పన తదితరాల్లో కాంగ్రెస్, బీజేపీ వైఫల్యాలను పదేపదే విమర్శిస్తున్న కేసీఆర్.. వ్యవసాయ రంగంపై రూపొందిస్తున్న ‘విజన్ డాక్యుమెంట్’లో కొత్త పార్టీ విధానాలపై స్పష్టత ఇస్తారు. రైతుబంధు, రైతు బీమా, వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్, దళితబంధు వంటి వాటితోపాటు దేశవ్యాప్తంగా కాళేశ్వరం తరహా నీటి ప్రాజెక్టుల నిర్మాణం, నదుల అనుసంధానం, వనరుల వినియోగం తదితరాలను ప్రస్తావిస్తారు. తెలంగాణ రైతుల కేస్ స్టడీలు, గణాంకాలు, నిపుణుల అభిప్రాయాలు తదితరాలను పొందుపరుస్తారు. త్వరలో దేశవ్యాప్తంగా దళిత సంఘాల ప్రతినిధులను ఆహ్వానించి, వారి నుంచి వచ్చే సలహాలు, సూచనల ఆధారంగా విజన్ డాక్యుమెంట్‌కు తుది రూపు ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారు. దేశమంతా వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ ఇవ్వాలని కేసీఆర్ చేసిన డిమాండ్‌పై జాతీయస్థాయిలో చర్చ జరిగిందని, విజన్ డాక్యుమెంట్ మరింత చర్చకు దోహదం చేస్తుందని టీఆర్ఎస్ వర్గాలు చెప్పాయి. -
ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీకో టీవీ ఛానల్
న్యూఢిల్లీ: రాజ్యాంగ రూపశిల్పి బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ.. తాము త్వరలో ప్రారంభించనున్న డిజిటల్ టీవీ ప్లాట్‌ఫామ్ ‘ఐఎన్‌సీ టీవీ’కి సంబంధించిన విజన్ డాక్యుమెంట్‌ను బుధవారం విడుదల చేసింది. ఈ నెల 24న పార్టీ చానెల్‌ను అధికారికంగా ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ చానెల్ ద్వారా తమ పార్టీ సమాచారాన్ని నేరుగా ప్రజలకు తెలియ జేయవచ్చని భావిస్తోంది. బడుగు బలహీన వర్గాల ప్రజలు గొంతుకను వినిపించే తమ చానెల్‌ను పంచాయతీ రాజ్ రోజున విడుదల చేస్తామని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే, కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలాలు ఉమ్మడి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో వెల్లడించారు. అందులో రోజూ దాదాపు 8 గంటల పాటు లైవ్ ప్రోగ్రామ్స్ ఉంటాయని తెలిపారు. మొదటగా ఆంగ్లం, హిందీ భాషల్లో చానెల్ ప్రసారమవుతుందని, అనంతరం స్థానిక భాషల్లో కూడా అందు బాటులోకి తెస్తామన్నారు. చదవండి: ఇంటి పక్కన కిరాణా దుకాణాదారుడే కింగ్ -
విజనే లేని పార్టీ కాంగ్రెస్..: పల్లా
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన విజన్ డాక్యుమెంట్లో ఇచ్చిన హామీలను ఇప్పటికే టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తోందని రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. విజన్ డాక్యుమెంట్ తయారు చేసుకోవడంలో కాంగ్రెస్ డొల్లతనం బయటపడిందన్నారు. విజనే లేని కాంగ్రెస్ పార్టీ విజన్ డాక్యుమెంట్లు ప్రకటించడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. 80 శాతం మంది అభ్యర్థులను కూడా నిలబెట్టుకోలేకపోయిన బీజేపీ.. వచ్చే ప్రభుత్వం తమదే అన్నట్టు గొప్పలకు పోతోందని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ నవీన్‌రావు, పార్టీ నేతలు దండే విఠల్‌తో కలిసి గురువారం ఆయన తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడారు. రూ.5కే భోజనం పెడతామని విజన్ డాక్యుమెంట్లో కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, ఇప్పటికే సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పేదల కడుపు నింపుతోందన్న విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిని అడిగి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలుసుకోవాలని సూచించారు. సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు, పట్టణాల్లో బస్తీ దవాఖానాలు ఇవన్నీ తమ ప్రభుత్వ పథకాలే అన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో లేని కాంగ్రెస్, తమ ప్రభుత్వం వస్తే ఈ కార్యక్రమాలు చేస్తామంటోందని ఎద్దేవా చేశారు. -
తాజ్ పరిరక్షణకు విజన్ డాక్యుమెంట్
సాక్షి, న్యూఢిల్లీ : చారిత్రక ప్రాచీన కట్టడం తాజ్ మహల్ పరిరక్షణకు యూపీ ప్రభుత్వం పలు ప్రతిపాదనలతో ముందుకొచ్చింది. కాలుష్యం వెదజల్లే ఫ్యాక్టరీల మూసివేత. నో ప్లాస్టిక్ జోన్, యమున కరకట్టలపై నిర్మాణ కార్యకలాపాలపై నిషేధం వంటి చర్యలతో చారిత్రక కట్టడాన్ని పరిరక్షించే ప్రణాళికతో రూపొందించిన విజన్ డాక్యుమెంట్‌ను మంగళవారం సుప్రీం కోర్టుకు సమర్పించింది. 17వ శతాబ్ధంలో నిర్మితమైన ఈ అద్భుత కట్టడాన్ని పరిరక్షించడంలో యూపీ సర్కార్ నిర్లక్ష్య వైఖరిపై జులై 11న సర్వోన్నత న్యాయస్ధానం విరుచుకుపడిన క్రమంలో ప్రభుత్వం ఈ విజన్ డాక్యుమెంట్‌ను కోర్టుకు నివేదించింది. తాజ్ మహల్ పరిసరాల్లో ప్యాకేజ్డ్ వాటర్‌ను నిషేధించాలని, ఆ ప్రాంతమంతటినీ ప్లాస్టిక్ రహిత జోన్‌గా ప్రకటించాలని యోచిస్తున్నామని జస్టిస్ ఎంబీ లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాలతో కూడిన సుప్రీం బెంచ్‌కు యూపీ ప్రభుత్వం తెలిపింది. తాజ్ పరిసర ప్రాంతంలో కాలుష్య కారక పరిశ్రమలను మూసివేసి, టూరిజం హబ్స్‌ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపింది. తాజ్‌మహల్‌ను సందర్శించేందుకు పాదచారులను ప్రోత్సహించేలా సమగ్ర ట్రాఫిక్ నిర్వహణను చేపడతామని వెల్లడించింది. మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ జ్ఞాపకంగా నిర్మించిన తాజ్ మహల్ కాలక్రమేణా కాలుష్య కోరలతో తన ప్రాభవాన్ని కోల్పోతుండటంపై సర్వోన్నత న్యాయస్ధానం తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. తాజ్ పరిరక్షణకు చేపడుతున్న చర్యలను సుప్రీం కోర్టు నిరంతరం పర్యవేక్షిస్తోంది. -
విజన్ డాక్యుమెంట్లో తెలంగాణ
⇒ మిషన్ కాకతీయ, భగీరథ, సౌర విద్యుత్‌కు చోటు ⇒ రాష్ట్ర పథకాలను ప్రశంసించిన నీతి ఆయోగ్ ⇒ శాఖల వారీగా భవిష్యత్ లక్ష్యాలను నివేదించిన ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అమలవుతున్న మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలతో పాటు సౌర విద్యుత్ విధానాన్ని జాతీయ విజన్ డాక్యుమెంట్లో పొందుపరుస్తామని నీతి ఆయోగ్ బృందం తెలిపింది. ఈ పథకాల విసృ్తత ప్రయోజనాలు, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మూడు పథకాలకు సంబంధించి ప్రత్యేక నోట్‌ను సమర్పిస్తే విజన్ డాక్యుమెంట్లో చేరుస్తామని నీతి ఆయోగ్ సలహదారు అశోక్‌కుమార్ జైన్ ప్రభుత్వ అధికారులకు తెలిపారు. 15 ఏళ్ల దార్శనికత, ఏడేళ్ల వ్యూహం, మూడేళ్ల కార్యాచరణ ప్రణాళికలతో దేశానికి సంబంధించిన విజన్ డాక్యుమెంట్‌ను నీతి ఆయోగ్ రూపొందిస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం రాష్ట్రానికి వచ్చిన నీతి ఆయోగ్ బృందం హైదరాబాద్‌లో ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశమైంది. నీతి ఆయోగ్ జాయింట్ అడ్వయిజర్ అవినాష్ మిశ్రా, డెరైక్టర్ జుగల్ కిషోర్ శర్మ, రాష్ట్ర ప్రభుత్వం తరఫున సలహాదారులు, వివిధ శాఖల కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో అశోక్‌కుమార్ జైన్ మాట్లాడుతూ... విజన్ డాక్యుమెంట్ రూపకల్పనలో భాగంగా వివిధ రాష్ట్రాలతో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమాలను ఎజెండాలో చేర్చండి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్టాత్మక కార్యక్రమాలను నీతి ఆయోగ్ ఎజెండాలో చేర్చాలని ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి బి.పి.ఆచార్య కోరారు. విజన్ డాక్యుమెంట్ రూపకల్పనలో తెలంగాణ దార్శనికతకు చోటు కల్పించాలని రాష్ట్ర ఆర్థిక సలహాదారు జీఆర్‌రెడ్డి పేర్కొన్నారు. రాబోయే మూడేళ్లలో ఇంటింటికీ తాగునీటిని అందించేందుకు రూ.42,853 కోట్లతో మిషన్ భగీరథ అమలు చేస్తున్నట్లు సంబంధిత అధికారులు వివరించారు. కృష్ణా, గోదావరి జలాలను పూర్తిగా వినియోగించుకొని వచ్చే అయిదేళ్లలో 60 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేలా పనులు జరుగుతున్నాయని వివరించారు. మిషన్ కాకతీయ ద్వారా చేపడుతున్న 46 వేల చెరువుల పునరుద్ధరణతో లక్షలాది ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంజీ గోపాల్ చెప్పారు. వచ్చే 15 ఏళ్లలో రూ.2.82 లక్షల కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి పనులు చేపడుతామన్నారు. తెలంగాణలో ఇప్పటికే నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నామని, వచ్చే రెండేళ్లలో జెన్కో ద్వారా 5,880 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తికి కృషి చేస్తున్నట్లు ట్రాన్స్‌కో అధికారులు వెల్లడించారు. గడిచిన రెండేళ్లలో సౌర విద్యుత్తును 80 మెగావాట్ల నుంచి 850 మెగావాట్లకు పెంచామని చెప్పగా నీతి ఆయోగ్ సభ్యులు ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా దేశంలో మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు పరిశ్రమల శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ మాట్లాడుతూ వచ్చే 15 ఏళ్ళలో ప్రజలందరికీ మెరుగైన ఆరోగ్య సేవలు అందించడానికి చేపట్టబోయే కార్యాచరణ ప్రణాళికను వివరించారు. ఐదారు గ్రామాలకో గురుకులం రాష్ట్రంలో విద్యాభివృద్ధికి విస్తృత స్థాయి చర్యలు చేపట్టనున్నట్లు విద్యాశాఖ నీతి ఆయోగ్‌కు ఇచ్చిన నివేదికలో పేర్కొంది. డ్రాపౌట్స్‌ను పూర్తిగా తగ్గించడం, నాణ్యత ప్రమాణాల పెంపు వంటివి 15 ఏళ్ల విజన్‌లో లక్ష్యంగా పేర్కొంది. కేజీ టు పీజీ ఏడేళ్ల ప్రణాళికలో చేర్చారు. మూడేళ్ల కార్యాచరణలో ఐదారు గ్రామాలకో గురుకుల పాఠశాల వంటివాటిని పేర్కొన్నారు. పంటలకు ప్రోత్సాహం వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా అధిక దిగుబడిని ఇచ్చే పంటలను ప్రోత్సహిస్తున్నట్లు వ్యవసాయశాఖ తమ నివేదికలో పేర్కొంది. ఆధునిక వ్యవసాయ పద్ధతులను క్షేత్రస్థాయికి అందించడం, పండ్లు, కూరగాయలు, పూలసాగులో ఆధునిక విధానాలపై శిక్షణకు ‘సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’, మార్కెటింగ్‌కు వినూత్న విధానాలను అందులో పేర్కొన్నారు. ఇంటింటికీ మంచినీరు మిషన్ భగీరథ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఇంటికి నల్లా ద్వారా సురక్షిత నీరందించాలనేది ప్రధాన లక్ష్యమని గ్రామీణ నీటి సరఫరా విభాగం నీతి ఆయోగ్‌కు సమర్పించిన నివేదికలో పేర్కొంది. రాష్ట్రాన్ని స్వచ్ఛ తెలంగాణగా మార్చేందుకు 29.94 లక్షల మరుగుదొడ్లను నిర్మించనున్నామని పేర్కొంది. విద్యుత్‌లో అగ్రగామిగా.. నాణ్యమైన విద్యుత్ సరఫరా, ఎత్తిపోతల పథకాలకు విద్యుత్, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరాల కోసం చర్యలు చేపడుతున్నట్లు విద్యుత్ శాఖ నివేదికలో పేర్కొంది. 2018-19 నాటికి కొత్తగా 5,880 మెగావాట్ల విద్యుదుత్పత్తి, సరఫరా నష్టాలను 9 శాతానికి తగ్గించడం లక్ష్యాలను వివరించింది. సూపర్ స్పెషాలిటీలుగా మారుస్తాం 15 ఏళ్లలో శిశు మరణాల రేటును 10 లోపునకు తీసుకురావడం, ఏడేళ్లలో అన్ని ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పన, అన్ని జిల్లా ఆస్పత్రులను సూపర్ స్పెషాలిటీలుగా తీర్చిదిద్దడం, ప్రతి మండల కేంద్రంలో 30 పడకల, నియోజకవర్గ కేంద్రాల్లో 100 పడకల ఆస్పత్రుల ఏర్పాటు తమ లక్ష్యాలని వైద్యారోగ్య శాఖ నివేదికలో వెల్లడించింది. ఐదేళ్లలో 1.15 కోట్ల ఎకరాలకు నీరు ఐదేళ్లలో 1.15 కోట్ల ఎకరాలకు సాగు నీరందించే లక్ష్యంతో కృషి చేస్తున్నట్లు నీటిపారుదల శాఖ నీతి ఆయోగ్‌కు వివరించింది. చెరువుల పునరుద్ధరణ, తక్కువ ముంపుతో ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపింది. కేంద్రం నుంచి తగిన సహకారం అందితే నిర్ణీత లక్ష్యాలను చేరుకుంటామని పేర్కొంది.


