సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభు త్వం ఏర్పడి రెండేళ్లు పూర్తికానున్న నేపథ్యంలో.. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో సాధించిన పురోగతితో పాటు భవిష్యత్తులో నిర్దేశించు కోవాల్సిన లక్ష్యాలపై ఈ నెల 6న సీఎంరేవంత్ రెడ్డి సమీక్షించనున్నారు.
రెండేళ్లలో చేసిన ఖర్చులు, పూర్తయిన పనులు, అందు బాటులోకి వచ్చిన కొత్త ఆయకట్టు, వచ్చే మూ డేళ్లలో ప్రాధాన్య ప్రాజెక్టుల పూర్తికి అవసర మైన నిధులు తదితర అంశాలను సీఎం సమీ క్షించనున్నారు. వీటితో పాటు తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్ నిర్మాణం, కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల పునరుద్ధరణ పురోగతిపై చర్చించనున్నారు.


