
న్యూఢిల్లీ: బీహార్‌లో(Bihar Assembly Elections) నెలల తరబడి కొనసాగిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్వేలో ఎలాంటి తప్పులు దొర్లలేదని సర్వోన్నత న్యాయస్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం వివరించింది. ఈ సర్వే విశ్వసనీయతను దెబ్బతీసేందుకే కొన్ని రాజకీయ పార్టీలు, ఎన్‌జీవోలు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశాయని ఈసీ(Election Commission Of India) పేర్కొంది.
తుది ఓటర్ల జాబితా ప్రచురించాక తమ పేరు తొలగించాలని కనీసం ఒక్క ఓటరు(Bihar Voter List) కూడా ఫిర్యాదు రాలేదని ఈసీ గుర్తుచేసింది. ముస్లింల ఓట్లను అసహ జరీతిలో తొలగించారన్న ఆరోపణల్లో నిజంలేదు. ఇలా మతపర ఆరోపణలకు అడ్డుకట్ట పడాలి’’ అని ఈసీ వ్యాఖ్యానించింది. అయితే తుది జాబితా లోనూ ఓటర్ల పేర్లలో తప్పులు దొర్లడంపై ఈసీ అసంతృప్తి వ్యక్తంచేసింది. ‘‘టైపింగ్ తప్పులు ఉండకుండా చూసుకుంటే బాగుండేది. ఇలాంటి వాటికి తగు స్వల్ప పరిష్కారాలు చూపిస్తే మంచిది’’అని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీల ధర్మాసనం అభిప్రాయపడింది.