
ప్రకటించిన నారాయణ మూర్తి దంపతులు
బెంగళూరు: కర్నాటక ప్రభుత్వం చేపట్టిన సామాజిక, విద్యా సర్వే, కులగణనలో పాల్గొనబోమని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్ నారాయణ మూర్తి, ఆయన భార్య సుధామూర్తి ప్రకటించారు. తాము వెనుకబడిన కులాలకు చెందిన వారం కాదన్నారు. ఇటీవల తమ నివాసానికి వచ్చిన ఎన్యుమరేటర్లతో వారు.. ‘మా ఇంట్లో సర్వే చేపట్టవద్దు’అని తెలిపినట్లు సమాచారం.
అదేవిధంగా, ఎన్యుమరేటర్లకిచ్చిన ప్రొఫార్మాలో సుధామూర్తి..‘మేం వెనుకబడిన కులాలకు చెందిన వారము కాదు. అందుకే, ఆ గ్రూపుల కోసం ప్రభుత్వం చేపట్టిన సర్వేలో మేం పాల్గొనడం లేదు’ అని పేర్కొన్నారు.
దీనిపై మంత్రి తంగదాడి స్పందిస్తూ.. వెనుకబడిన కులాల సంక్షేమంపై వారికి ఎంత శ్రద్ధ ఉందో దీన్ని బట్టి తెలుస్తోందని విమర్శించారు. ఈ పరిణామంపై సుధామూర్తి దంపతులు, ఇన్ఫోసిస్ అధికారులు స్పందించలేదు.