పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌పై టెన్షన్‌.. ఆయిల్‌ కంపెనీ క్లారిటీ | Indian Oil assures ample petrol diesel LPG stock across country | Sakshi
Sakshi News home page

పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌పై టెన్షన్‌.. ఆయిల్‌ కంపెనీ క్లారిటీ

May 9 2025 1:54 PM | Updated on May 9 2025 2:00 PM

Indian Oil assures ample petrol diesel LPG stock across country

భారత్‌-పాకిస్థాన్‌ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ కొరత వస్తుందేమోనన్న ఆందోళనతో పెట్రోల్‌, డీజిల్‌ వంటి ఇంధనాలను ముందే కొని నిల్వ చేసుకునేందుకు దేశంలోని పలు పెట్రోల్ బంకుల వద్ద జనం క్యూ కడుతున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) స్పష్టత ఇచ్చింది. దేశంలో పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది.

ఈ మేరకు ఐఓసీ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ‘ఎక్స్‌’(ట్విటర్‌)లో ఒక పోస్ట్‌ చేసింది. "భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇంధనం, ఎల్పీజీ మా అన్ని అవుట్‌లెట్‌లలో సమృద్ధిగా అందుబాటులో ఉంది" అని తెలిపింది. దేశవ్యాప్తంగా ఇండియన్ ఆయిల్ వద్ద ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, తమ సరఫరా మార్గాలు సజావుగా పనిచేస్తున్నాయని తెలిపింది. వినియోగదారులు అనవసర ఆందోళనతో పెట్రోల్‌ బంక్‌లకు పోటెత్తవద్దని సూచించింది.

ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి, ప్రతీకారంగా పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ జరిపిన దాడుల తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యంగా పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో ఈ భయాందోళనలు నెలకొన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement