
సాక్షి,వైఎస్సార్: జిల్లా పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారం ముగిసినప్పటికీ, స్థానికేతర కూటమి నేతలు ఒంటిమిట్టలో తిష్టవేశారు. హరిత హోటల్ వేదికగా టీడీపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మకాం వేశారు.
ప్రచార సమయం ముగిసిన తర్వాత కూడా టీడీపీ నేతలు హరిత హోటల్ వేదికగా కుట్ర రాజకీయాల్ని నెరుపుతూ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈసీ ఆదేశాలను బేఖాతరు చేస్తూ, హోటల్ యాజమాన్యం, స్థానిక పోలీసుల మద్దతుతో కూటమి నేతలు అక్కడే ఉండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై ఎన్నికల సంఘం స్పందించాల్సిన ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.