భగ్గుమన్న బీహార్.. ఒకవైపు బంద్‌.. మరోవైపు ‘ఇండియా’ నిరసనలు | Bihar Protest Electoral Roll Rahul Gandhi Bharat Bandh | Sakshi
Sakshi News home page

భగ్గుమన్న బీహార్.. ఒకవైపు బంద్‌.. మరోవైపు ‘ఇండియా’ నిరసనలు

Jul 9 2025 9:56 AM | Updated on Jul 9 2025 10:52 AM

Bihar Protest Electoral Roll Rahul Gandhi Bharat Bandh

పట్నా: ‍ప్రభుత్వ వ్యతిరేక నిరసనలతో బీహార్‌ భగ్గుమంటోంది. ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా సవరణతో పాటు నూతన కార్మిక నియమావళికి వ్యతిరేకంగా రాష్ట్రంలో నిరసనలు ఏకకాలంలో జరుగుతున్నాయి. 10 కేంద్ర కార్మిక సంఘాలు భారత్ బంద్‌లో యాక్టివ్‌గా పాల్గొంటున్నాయి. భారత ఎన్నికల కమిషన్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్‌) రూపొందించిన ఎన్నికల జాబితాకు వ్యతిరేకంగా పట్నాలో నిరసనలు మొదలయ్యాయి.
 

ఉదయం 10 గంటలకు రాహుల్ గాంధీ ఈ నిరసనల్లో పాల్గొననున్నారు. లంబార్‌లోని ఆదాయపు పన్ను కార్యాలయం నుంచి ఎన్నికల కమిషన్ కార్యాలయం వరకు జరిగే నిరసన ప్రదర్శనల్లో రాహుల్‌ పాల్గొననున్నారు. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కూడా ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొంటారు. రాష్ట్రంలోని హాజీపూర్, సోన్‌పూర్‌లలో పోలీసుల సమక్షంలో  నిరసనలు జరిగాయి. రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌కు వ్యతిరేకంగా  ఆర్జేడీ, ఇతర మహాఘటబంధన్ మిత్రపక్షాలు బీహార్‌లోని రోడ్లపై నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. ఆందోళనకారులు రోడ్లపై టైర్లను కాలుస్తూ,  రహదారులను  దిగ్బంధనం చేస్తున్నారు. జెహానాబాద్‌లో ఆర్జేడీ విద్యార్థి విభాగం రైల్వే పట్టాలపై నిరసనలకు దిగింది.

లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌లు సంయుక్తంగా బీహార్‌లో కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాలను సవరించాలన్న నిర్ణయంపై నిరసన వ్యక్తంచేస్తున్నారు. అలాగే ఈ ఇరువురు నేతలు నూతన కార్మిక నియమావళిని అమలు చేయాలనే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలకు నాయకత్వం వహిస్తున్నారు. ఈ నిరసనలకు ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీలు, వికాస్‌షీల్ ఇన్సాన్ పార్టీలు మద్దతు పలుకుతున్నాయి.  బీహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ మాట్లాడుతూ బీహార్ అంతటా నిరసనలు కొనసాగుతున్నాయని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement