సాక్షి,న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటిగ్రేటెడ్ రివిజన్ - ఎస్ఐఆర్) ఫేజ్‌వన్ విజయవంతంగా ముగిసిందని కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్ తెలిపారు. సోమవారం(సెప్టెంబర్ 27) కేంద్రం ఎన్నికల సంఘం మీడియా సమావేశంలో ఎస్‌ఐఆర్ మాట్లాడారు.
1951నుంచి 2004 వరకు ఎనిమిది సార్లు ఎస్‌ఐఆర్ నిర్వహించారు. 21ఏళ్ల తర్వాత మళ్లీ ఎస్‌ఐఆర్ విజయవంతంగా పూర్తి చేస్తున్నాం. బిహార్‌లో 7.5కోట్ల మంది ఎస్‌ఐఆర్ విజయవంతంగా పూర్తయ్యింది. బిహార్‌లో ఎస్‌ఐఆర్‌పై ఎవరు అభ్యంతరాలు చెప్పలేదు. త్వరలో రెండో దశలో 12 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్‌ఐఆర్ నిర్వహిస్తాం.
ఈరోజు అర్ధరాత్రి తర్వాత ఓటర్ల జాబితా లాక్ చేస్తాం. ప్రతి ఇంటికి మూడుసార్లు బిఎల్ఓ విజిట్ చేస్తారు. బీఎల్‌ఓ ఇచ్చే ఎన్యుమరేషన్ ఫాంలో వివరాలు నమోదు చేసి సంతకం చేయాలి. 2003లో ఎవరితో ఉన్నామని లింక్ వివరాలు నమోదు చేయాలి. ఎన్యుమరేషన్ ఫామ్‌లో మ్యాచింగ్ , లింకింగ్ ప్రధానం.ఎన్యుమరేషన్ ఫాం రిటర్న్ చేసిన వారినే ఓటర్ జాబితాలో నమోదు చేస్తారు. బూత్ లెవెల్ ఏజెంట్లు 50 ఫారంలు ఎన్నికల సంఘానికి అందజేయవచ్చు. అన్ని ఎన్యుమరేషన్ ఫారంలు వచ్చిన తర్వాత ముసాయిదా ఓటర్ జాబితా విడుదల చేస్తాం’అని తెలిపారు.
ఇందులో భాగంగా నవంబర్ 4 నుంచి డిసెంబర్ 4 వరకు ఎస్ఐఆర్. డిసెంబర్ 9న ముసాయిదా జాబితా విడుదల. డిసెంబర్ 9 నుంచి 8 జనవరి వరకు అభ్యంతరాల స్వీకరణ. డిసెంబర్ 9 నుంచి జనవరి 31 వరకు హియరింగ్ ,వెరిఫికేషన్ ఫిబ్రవరి 7న ఓటర్ల తుది జాబితా విడుదల ఉంటుందని వెల్లడించారు.
#SIR 12 States & UTs#ECI #SIRPhase2 pic.twitter.com/JA2CnyWulz
— Election Commission of India (@ECISVEEP) October 27, 2025
🚨 BREAKING | Delhi
Chief Election Commissioner Gyanesh Kumar says:
“There has been considerable discussion about the necessity of SIR. But the Election Commission reiterates that under electoral law, revision of electoral rolls is mandatory before every election and can be… pic.twitter.com/GVjRZJkPxY— Jan Ki Baat (@jankibaat1) October 27, 2025


