
ఢిల్లీ : బీహార్‌లో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)పై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్న వేళ ఎట్టకేలకు కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఓటర్ల జాబితా విషయంలో ప్రతిపక్షాల విమర్శలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. బీహార్‌లో నకిలీ ఓటర్లను ఎలా అనుమతిస్తామంటూ ఓటరు జాబితా సవరణ ప్రక్రియను ఈసీ సమర్థించుకుంది. ఈమేరకు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్‌కుమార్ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ క్రమంలో ప్రతిపక్షాలను ఆరోపణలను తోసిపుచ్చారు.
ఈ సందర్భంగా జ్ఞానేశ్‌కుమార్..‘భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యానికి తల్లి వంటిది. బీహార్‌లో నకిలీ ఓట్లను తొలగించడానికి మేము ప్రయత్నిస్తున్నాం. ఎస్‌ఐఆర్ ప్రక్రియపై ప్రతిపక్షాలు తీవ్రంగా అభ్యంతరాలు చేయడంతో అర్థం లేదు. నకిలీ ఓటర్లకు ఎన్నికల సంఘం ఎందుకు అవకాశం ఇస్తుంది?. ఎస్‌ఐఆర్ నిష్పాక్షికంగా, నిబంధనల ప్రకారమే జరిగింది. ఓటర్ల జాబితాలో నకిలీ పేర్లు చేర్చడమన్నది పూర్తిగా నిరాధారమైంది. చనిపోయిన ఓటర్లు పేర్లు కూడా జాబితాలో ఉన్నాయి. రెండు చోట్ల ఓటు హక్కు ఉన్న వారు.. నకిలీ ఓటర్లు లేదా విదేశీ ఓటర్లను మాత్రమే జాబితా నుంచి తొలగించడం జరుగుతుంది అని చెప్పుకొచ్చారు. ఈ ప్రక్రియ మొదట బీహార్‌లో రానున్న రోజుల్లో మొత్తం దేశంలో జరుగుతుంది అని వెల్లడించారు.
#BreakingNews | CEC backs #Bihar voters rolls revision
Gyanesh Kumar, CEC: Should EC allow dead voters to be on voter list? Should people with duplicate epic be allowed?. Should EC not weed them out to make a strong base for electoral democracy?@Arunima24 @toyasingh pic.twitter.com/wyNNn2CtgS— News18 (@CNNnews18) July 24, 2025
లక్ష మంది ఓటర్లు ‘దొరకట్లేదు’..
ఇదిలా ఉండగా.. బీహార్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల సంఘం రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(ఎస్‌ఐఆర్) ప్రక్రియ కొనసాగిస్తోంది. బీహార్‌లో 7.17 కోట్లకుపైగా ఓటర్లు ఉన్నారు. అనర్హులైన ఓటర్లు బయటపడుతున్నట్లు తెలిసింది. సుమారు లక్ష మంది ఓటర్ల జాడ తెలియట్లేదని ఎన్నికల సంఘం బుధవారం వెల్లడించింది. ఓటర్ల జాబితాలో వారి పేర్లు ఉన్నప్పటికీ భౌతికంగా ఎక్కడున్నారో కనిపెట్టలేకపోతున్నామని స్పష్టంచేసింది. 20 లక్షల మంది ఓటర్లు మరణించినట్లు ఈ ప్రత్యేక సవరణలో తేలిందని పేర్కొంది. అలాగే మరో 28 లక్షల మంది చిరునామాలు శాశ్వతంగా మారాయని తెలిపింది. ఎస్‌ఐఆర్ ప్రక్రియ తొలి దశ ఆగస్టు ఒకటో తేదీ నాటికి పూర్తికానుంది. తర్వాత ముసాయిదా ఎన్నికల జాబితాను ప్రచురిస్తారు. ఇందులో లోపాలు ఉన్నట్లు ఎవరైనా గుర్తిస్తే అభ్యంతరాలు వ్యక్తం చేయొచ్చు. ఓటర్ల జాబితాలో అర్హుల పేర్లు లేకపోతే సెపె్టంబర్ ఒకటో తేదీ దాకా ఫిర్యాదులు సమర్పించవచ్చు.