దశలవారీగా  ఎస్‌ఐఆర్‌: ఈసీ | Election Commission may roll out all-India SIR in phases | Sakshi
Sakshi News home page

దశలవారీగా  ఎస్‌ఐఆర్‌: ఈసీ

Oct 11 2025 6:00 AM | Updated on Oct 11 2025 6:00 AM

Election Commission may roll out all-India SIR in phases

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా దశలవారీగా ఓటర్ల జాబితా స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియ చేపట్టనున్నట్లు ఎన్నికల కమిషన్‌ (ఈసీ)తెలిపింది. ముందుగా వచ్చే ఏడాదిలో ఎన్ని కలు జరిగే రాష్ట్రాల్లో నిర్వహించనున్నట్లు వెల్లడించింది. అదేసమయంలో, స్థానిక ఎన్నిక లు జరిగే రాష్ట్రాల్లో ఈ ప్రక్రియను చేపట్టబోమని కూడా స్పష్టం చేసింది. 2026లో అసోం, తమిళ నాడు, పుదుచ్చేరి, కేరళ, పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. 

ఈ ఐదు రాష్ట్రాలతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో మొదటి దశలో భాగంగా ఎస్‌ఐఆర్‌ చేపట్టనున్నామని పేర్కొంది. తేదీలను కూడా త్వరలోనే నిర్ణయి స్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమా ర్‌ చెప్పారు. విదేశీ అక్రమ వలసదారులను వారి పుట్టిన ప్రాంతం ఆధారంగా గుర్తించి, దేశం నుంచి పంపేయడమే ఎస్‌ఐఆర్‌ ప్రాథమిక ఉద్దేశమని ఈసీ అంటోంది. ఆయా రాష్ట్రాల్లో చిట్టచివరి ఎస్‌ఐఆర్‌ చేపట్టిన నాటి ఓటరు జాబి తాలను ఆన్‌లైన్‌లో ఉంచాల్సిందిగా ఈసీ ఇప్పటికే రాష్ట్లాల చీఫ్‌ ఎలక్టోరల్‌ అధికారులను ఆదేశించింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement