న్యూఢిల్లీ: తమిళనాడులో ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) చేప ట్టాలంటూ ఎన్నికల కమిషన్(ఈసీ) తీసుకు న్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అధి కార డీఎంకే సోమవారం సుప్రీంకోర్టును ఆశ్ర యించింది. ఈసీ నిర్ణయం రాజ్యాంగ వ్యతిరేకం, ఏకపక్షం, ప్రజాస్వామ్య హక్కు లకు భంగకరమని పేర్కొంది. డీఎంకే నేత ఆర్‌ఎస్ భారతి ఈ పిటిషన్ వేశారు.
తమిళ నాడులో ఎస్‌ఐఆర్ చేపట్టేందుకు అక్టోబర్ 27న ఈసీ జారీ చేసిన నోటిఫికేషన్‌ను రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 19, 21లను ఉల్లంఘించడమేనన్నారు. ఎస్‌ఐఆర్‌తో అసలైన ఓటర్ల పేర్లను సైతం సరైన పత్రాలు లేవనే సాకుతో తొలగించే ప్రమాదముందన్నారు. పిటిషన్‌పై ఈ వారంలోనే అత్యు న్నత న్యాయస్థానం విచారణ చేపట్టే అవకా శముంది.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
