
న్యూఢిల్లీ: బిహార్‌లో చేపట్టిన ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్‌ఐఆర్)లో ఇప్ప టి వరకు దాదాపు 52 లక్షల మంది పేర్లను తొలగించినట్లు మంగళవారం ఎన్నికల కమిషన్(ఈసీ) తెలిపింది.
ఇందులో 18 లక్షల మంది ఓటర్లు చనిపోగా, 26 లక్షలు మంది వేరే నియోజకవర్గాల్లో ఉంటున్నవారు, 7 లక్షల మంది ఒకటికి మించి ప్రాంతాల్లో నమోదైన వారని వివరించింది. ‘ఎస్‌ఐఆర్‌లో భాగంగా అర్హులైన ఓటర్లందరి పేర్లను ఆగస్ట్ ఒకటో తేదీన విడుదల చేసే ముసాయిదా జాబితాలో చేర్చేందుకు ప్రయ త్నాలు ముమ్మరం చేశామని ఈసీ ఒక ప్రకటనలో తెలిపింది.