
సాక్షి,న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆసక్తిరేపుతోన్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. రెండుదశల్లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఈ రోజు సాయంత్రం (అక్టోబరు 6న) 4 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ బిహార్ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
నవంబర్ 6న తొలిదశ ఎన్నికల పోలింగ్
నవంబర్ 11 రెండోదశ ఎన్నికల పోలింగ్
నవంబర్ 14న కౌంటింగ్
తొలిదశ ఎన్నికకు ఈ నెల 10న నోటిఫికేషన్ విడుదల
బిహార్ అసెంబ్లీ స్థానాలు, ఓటర్ల వివరాలు
బిహార్‌లో 243అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు
మొత్తం ఓటర్లు 7.42కోట్లు
జూన్ 24నుంచి ఓటర్ల అభ్యంతరాలను స్వీకరించాం
ఆగస్టు 1న తుది జాబితా ప్రకటించాం
నామినేషన్ల కంటే 10 రోజల ముందు వరకు ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకోవచ్చు
బీహార్‌లోని 243 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నవంబర్ 22 నాటికి పూర్తవుతాయి.
22ఏళ్ల తర్వాత బిహార్‌లో ఓటర్ల జాబితాను పూర్తిస్థాయిలో సంస్కరించాం.
90వేల 712కేంద్రాల్లో ఎన్నికల పోలింగ్
14లక్షల మంది కొత్త ఓటర్లు
100ఏళ్లకు పైబడిన ఓటర్లు మొత్తం 14వేల

ఎన్నికల్లో 17 సంస్కరణలు
బిహార్ ఎన్నికల నుంచి 17 కొంత సంస్కరణలు తీసుకొచ్చాం
ప్రతి పోలింగ్ స్టేషన్‌లో ఓటర్ల సంఖ్యను 1,200కి పరిమితం చేశాం
గతంలో నలుపు, తెలుపు రంగులో ఉండే సీరియల్ నంబర్ ఫాంట్‌ను వినియోగించాం.
అభ్యర్థుల ఫోటోలు ఇప్పుడు రంగులో ఉంటాయి.