
పట్నా: బిహార్‌లో ఓటరు జాబితా ముసాయిదాపై వివాదం నేపథ్యంలో ఆర్జేడీ నేత, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్‌పై పట్నాలో కేసు నమోదైంది. ఓటరు గుర్తింపు కార్డులు రెండింటిని కలిగి ఉన్న తేజస్వీ యాదవ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ లాయర్ రాజీవ్ రంజన్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
మీడియా సమావేశంలో ప్రదర్శించిన ఓటరు గుర్తింపు కార్డు, అధికారికంగా అందజేసింది కాదని దానిపై విచారణ జరిపేందుకు తమకు అందజేయాలంటూ పట్నాలోని ఎలక్టోరల్ రిజి్రస్టేషన్ అధికారి ఆదివారం తేజస్వీని కోరడం తెల్సిందే. ఈసీకి వ్యతిరేకంగా పలు వ్యాఖ్యలు చేసిన తేజస్వీ యాదవ్‌పై చట్టపరంగా ముందుకెళతామని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ పేర్కొన్నారు.