breaking news
draft voter list
-
తేజస్వీ యాదవ్‌పై కేసు నమోదు
పట్నా: బిహార్‌లో ఓటరు జాబితా ముసాయిదాపై వివాదం నేపథ్యంలో ఆర్జేడీ నేత, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్‌పై పట్నాలో కేసు నమోదైంది. ఓటరు గుర్తింపు కార్డులు రెండింటిని కలిగి ఉన్న తేజస్వీ యాదవ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ లాయర్ రాజీవ్ రంజన్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మీడియా సమావేశంలో ప్రదర్శించిన ఓటరు గుర్తింపు కార్డు, అధికారికంగా అందజేసింది కాదని దానిపై విచారణ జరిపేందుకు తమకు అందజేయాలంటూ పట్నాలోని ఎలక్టోరల్ రిజి్రస్టేషన్ అధికారి ఆదివారం తేజస్వీని కోరడం తెల్సిందే. ఈసీకి వ్యతిరేకంగా పలు వ్యాఖ్యలు చేసిన తేజస్వీ యాదవ్‌పై చట్టపరంగా ముందుకెళతామని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ పేర్కొన్నారు. -
ఓటరు జాబితాలో నా పేరు మిస్సయ్యింది: ఆర్జేడీ నేత
పట్నా: ఎన్నికల కమిషన్ తాజాగా విడుదల చేసిన బిహార్ ఓటరు ముసాయిదా జాబితాలో తన పేరు గల్లంతైందని ప్రతిపక్ష ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఆరోపించారు. తనకు కేటాయించిన ఎపిక్ నంబర్ సైతం మారిందన్నారు. ఎపిక్ నంబర్ ఆధారంగా ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో తన పేరు కోసం సోధించగా ‘నో రికార్డ్స్ ఫౌండ్’అని సూచిస్తోందని ఆరోపించారు. మా ఏరియాకు వచ్చిన బూత్ లెవల్ అధికారి తాను నింపి అందజేసిన ఎన్యుమరేషన్ ఫారానికి సంబంధించి ఎలాంటి రిసిప్టును ఇవ్వలేదన్నారు. ఎన్యు మరేషన్ ఫారంలను బూత్ లెవల్ అధికారి ఇచ్చేటప్పుడు తన ఫొటోను తానే తీసుకున్నానన్నారు. ‘ఇప్పుడు చూడండి.. నా పేరు ఓటరు జాబితాలో నమోదు కాలేదు. దీంతో ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉండదు. దేశ పౌరుడిగా నేను గుర్తింపు పొందలేదు. మా ఇంట్లో ఉండే హక్కు కూడా లేదు’అని ఆయన చెప్పుకొచ్చారు. తమ వంటి వారి పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుల విషయం ఎవరు పట్టించు కుంటారంటూ ఈసీపై ఆయన ధ్వజమెత్తారు. తేజస్వీ వ్యాఖ్యలను ఈసీ తీవ్రంగా ఖండించింది. ‘ఓటరు జాబితాలో ఆయన పేరుంది. గతంలో మాదిరిగా వెటరినరీ కాలేజీలోని బూత్‌లోనే ఆయన పేరుంది. ఇదే సాక్ష్యం.. అంటూ జాబితాలో ఆయన పేరున్న జాబితా ఫొటో స్క్రీన్ షాట్‌ను షేర్ చేసింది. -
అక్టోబర్‌లో ‘ఓటర్ల’ సవరణ
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం–2020 షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ప్రస్తుత ఓటర్ల జాబితాలో డూప్లికేట్ ఓటర్లను తొలగించి, ఇతర లోపాలను సరిదిద్దిన తర్వాత ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని చేపట్టాలని ఆదేశించింది. అక్టోబర్ 15 నాటికి ఓటర్ల జాబితాలోని లోపాలను సరిచేయాలని, అదే రోజు ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించి ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని ప్రారంభించాలని కోరింది. 2020 జనవరి 1 అర్హత తేదీగా ఓటర్ల జాబితా సవరణ జరపాలని సూచించింది. అంటే, 2020 నాటికి 18 ఏళ్ల వయసుకు చేరే యువతీయువకులు ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేసుకోవడానికి అర్హులు కానున్నారు. కొత్త ఓటర్ల నమోదుతో పాటు ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలకు సంబంధించిన దరఖాస్తును నవంబర్ 30 వరకు స్వీకరించనున్నారు. ఓటర్ల నమోదును ప్రోత్సహించేందుకు నవంబర్ 2, 3, 9, 11 తేదీల్లో పెద్ద ఎత్తున ప్రచారోద్యమాన్ని నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం కోరింది. ఓటర్ల నమోదు దరఖాస్తులతో పాటు అభ్యంతరాలను పరిష్కరించి వచ్చే ఏడాది జనవరి 15 నాటికి తుది ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు. లోపాలపై ప్రత్యేక దృష్టి.. గత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సమయంలో ఓటర్ల జాబితాలో లోపాలపై సర్వత్రా విమర్శలు చెలరేగిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం అప్రమత్తమైంది. ఓటర్ల జాబితాలో లోపాలను సరిచేసేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రకటించింది. ఓటర్ల జాబితా నుంచి డూప్లికేట్ ఓటర్ల ఏరివేత, ఇతర లోపాలను సరిదిద్దడంతో పా టు ఓటర్ల ఫొటోల నాణ్యతను పరీక్షించే కార్యక్రమాన్ని ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని అన్ని రాష్ట్రాల ఎన్నికల ప్రధాన అధికారులను (సీఈఓ) ఇటీవల ఆదేశించింది. ప్రస్తుత ఓటర్ల జాబితాలోని ఓటర్లు తమ పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్, రేషన్ కార్డు వంటి ఏదైనా గుర్తింపు కార్డు జిరాక్స్‌ని స్వచ్ఛందంగా సమరి్పంచి తమ ఓటు హక్కును ధ్రువీకరించుకునేలా ప్రోత్సహించాలని కోరింది. ఇంటింటికీ తిరిగి.. బూత్ లెవల్ అధికారులు (బీఎల్వో) సెపె్టంబర్ 1 నుంచి 30 వరకు ఇంటింటికి తిరిగి ఓటర్ల జాబితాలను సరిచేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఆ సమాచారాన్ని ఏఈఆర్వో/ఈఆర్వో/డీఈవోలు /రోల్ అబ్జర్వర్లు అక్టోబర్ 15లోగా పరీక్షించాలంది. -
ఆన్లైన్ ఓటర్ లిస్ట్‌లో తప్పులను సరిచేయాలి
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్లో ఉన్న ఓటర్ డ్రాఫ్ట్ లిస్ట్‌లోని లోపాలను సరిచేయాలని, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల గురించి విస్తృత ప్రచారాన్ని కల్పించాలని రాష్ర్ట ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌కు సీపీఎం తెలంగాణ శాఖ విజ్ఞప్తిచేసిం ది. బుధవారం ఈ మేరకు సీఈఓ భన్వర్‌లాల్‌కు సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాసిన లేఖను, వినతిపత్రాన్ని ఆ పార్టీ నేతలు జె.వెంకటేష్, టి.జ్యోతి, ఏఐ ఎల్యూ నేత కె.పార్థసారథి సచివాలయంలో సమర్పించారు.