తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా.. | Telangana Election Commission has released voter list schedule | Sakshi
Sakshi News home page

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా.. ఓటర్ల జాబితా షెడ్యూల్ విడుదల

Dec 29 2025 10:56 PM | Updated on Dec 29 2025 11:06 PM

Telangana Election Commission has released voter list schedule

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం (TSEC) డిసెంబర్ 29 (సోమవారం) 2025న ఓటర్ల జాబితా తయారీ, ప్రచురణకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. రాష్ట్రంలోని 117 మున్సిపాలిటీలు, 6 మున్సిపల్ కార్పొరేషన్లకు ఈ ప్రక్రియ వర్తించనుంది. ఎన్నికల సంఘం అధికారులు అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితా (01.10.2025 నాటి డేటా) ఆధారంగా మున్సిపల్ వార్డుల వారీగా ఫోటోలతో కూడిన ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించారు.  

ఓటర్ల జాబితా షెడ్యూల్  
- ఈసీఐ పోలింగ్ స్టేషన్ల డేటా మున్సిపాలిటీల వారీగా క్రమబద్ధీకరణ – 30.12.2025  
- వార్డుల వారీగా పోలింగ్ స్టేషన్ల డేటా విభజన – 31.12.2025  
- మున్సిపల్ వార్డుల వారీగా ఓటర్ల జాబితా రూపకల్పన – 31.12.2025  
- ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ, అభ్యంతరాల స్వీకరణ – 01.01.2026  
- రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం (జిల్లా స్థాయి) – 05.01.2026 నుండి 06.01.2026 వరకు
- తుది ఓటర్ల జాబితా విడుదల – 10.01.2026  

జనవరి 1న విడుదలకానున్న ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు లేదా సవరణలు ఉంటే సంబంధిత నోటీసు బోర్డుల ద్వారా తెలియజేయవచ్చు. అన్ని సవరణలు పూర్తి చేసిన అనంతరం జనవరి 10, 2026న తుది ఓటర్ల జాబితా ప్రకటించబడుతుంది. ఈ తుది జాబితా ఆధారంగానే త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ఉంటుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement