వ్యసనాల కొడుకును వధించి.. | Father assassinated his son | Sakshi
Sakshi News home page

వ్యసనాల కొడుకును వధించి..

Mar 6 2026 4:29 AM | Updated on Mar 6 2026 4:29 AM

Father assassinated his son

కొడుకును నరికి చంపిన తండ్రి 

ఇందల్వాయి (నిజామాబాద్‌ రూరల్‌): మత్తు వ్యసనాలకు బానిసైన కొడుకును ఒక తండ్రి గొడ్డలితో నరికి చంపాడు. నిజామాబాద్‌ జిల్లా ఇందల్వాయి మండలం నల్లవెల్లి గ్రామంలో జరిగిన ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాలివి. నల్లవెల్లికి చెందిన కొత్తగొల్ల లక్ష్మి, కిషన్‌ దంపతులకు ఇద్దరు కొడుకుల్లో భాను ప్రకాశ్‌ (23) చిన్నవాడు. పదో తరగతి వరకు చదివిన భాను ప్రకాశ్‌ పైచదువులకు వెళ్లకుండా ఇంటి వద్దే ఉంటున్నాడు. 

అయిదారేళ్లుగా చెడు వ్యసనాలు, మత్తు పదార్థాలకు బానిసై తల్లిదండ్రులను వేధిస్తూ జులాయిగా తిరుగుతున్నాడు. భాను ప్రకాశ్‌ తరచూ గొడవ పడటంతో.. అతని అన్న గ్రామాన్ని విడిచి హైదరాబాద్‌లో ఉంటూ ప్రైవేట్‌ ఉద్యోగం చేసుకుంటున్నాడు. తల్లిదండ్రులు కొద్ది రోజులుగా వేరే వారి ఇంట్లో తలదాచుకుంటున్నారు. 

ఈ క్రమంలో కొడుకుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న తండ్రి కిషన్‌ ఇంట్లో నిద్రిస్తున్న భానుప్రకాశ్‌ను బుధవారం అర్ధరాత్రి గొడ్డలితో నరికి చంపాడు. ఉదయం పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి, నిందితుడిని కస్టడీలోకి తీసుకున్నామని ఎస్‌ఐ సందీప్‌ తెలిపారు. మృతుని తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement