మరోసారి ప్రజల్లోకి ప్రభుత్వం | The government will organize special programs from today | Sakshi
Sakshi News home page

మరోసారి ప్రజల్లోకి ప్రభుత్వం

Mar 6 2026 4:11 AM | Updated on Mar 6 2026 4:11 AM

The government will organize special programs from today

నేటి నుంచి ‘ప్రజాపాలన– ప్రగతి నివేదిక’కార్యక్రమాలు 

10 థీమ్స్‌తో 99 రోజుల కార్యాచరణ  

సర్కారు ప్రకటన

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నుంచి మరోసారి ప్రజల్లోకి వెళ్తోంది. ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’పేరిట 99 రోజుల కార్యాచరణతో ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజల్లోకి వెళ్లనున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి 10 థీమ్స్‌తో 99 రోజుల కార్యాచరణను ప్రకటించిన సంగతి విదితమే. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఈ తరహా కార్యక్రమం చేపట్టడం ఇది మూడోసారి. 

గత రెండు విడతల్లో వచ్చి న ఆర్జీలతో రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, రుణమాఫీ, రైతు భరోసా, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ వంటి కార్యక్రమాలను అమలులోకి తెచ్చి ంది. ఇప్పుడు ‘ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక’పేరుతో మార్చి 6 నుంచి జూన్‌ 12 వరకు ప్రభుత్వం 99 రోజుల కార్యాచరణ ప్రకటించింది. పౌర సేవలు, ప్రజల అవసరాలతో మమేకమై ఉండే అన్ని శాఖల అధికారులతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వ హించనుంది. ఈమేరకు ప్రభుత్వం గురువారం ఒక ప్రకటన విడు దల చేసింది.  

ఐదు స్థాయిల్లో : గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఐదు స్థాయిల్లో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో పారిశుధ్యంతోపాటు పెండింగ్‌ ఫైళ్లను క్లియర్‌ చేయనుంది. అన్ని జిల్లాల కలెక్టర్లతో పాటు అన్ని శాఖల కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులను ఇందులో భాగస్వాములను చేసింది. 

మండలాలు, జిల్లా కేంద్రాల్లో వివిధ శాఖల అధ్వర్యంలో ప్రత్యేక స్టాళ్లు, ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేయనుంది. అన్ని స్థాయిల్లోనూ గ్రామ సర్పంచి నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీల వరకు ప్రజా ప్రతినిధులను భాగస్వాములను చేసేలా మార్గదర్శకాలను రూపొందించింది. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా విద్యావ్యవస్థలో వస్తున్న సంస్కరణలు, వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ హాస్పిటళ్లను తీర్చిదిద్దే ప్రణాళికను సర్కారు ప్రజలకు వివరించనుంది. 

అలాగే, సోలార్‌ విద్యుత్తు వినియోగం పెంచటం, సోలార్‌ విద్యుత్తు ఉత్పత్తి ద్వారా ఆదాయం పెంచుకునేందుకు ఉన్న మార్గాలను ప్రజలకు, రైతులకు తెలియజేయనుంది. యువతకు నైపుణ్యాల శిక్షణతోపాటు ఉపాధి కల్పించే కార్యక్రమాలను ఈ యాక్షన్‌ ప్లాన్‌లో పేర్కొంది, రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో జాబ్‌ మేళాలు నిర్వహించి.. లక్ష మంది యువతకు ఉద్యోగాలు ఇవ్వాలన్న లక్ష్యాన్ని పెట్టుకుంది. ఇందిరా మహిళా శక్తి సాధిస్తున్న విజయాలను, కొత్తగా వ్యాపారాభివృద్ధికి ఉన్న అవకాశాలను గుర్తించనుంది.

కార్యాచరణ ఇలా...
1వ వారం – గ్రామీణాభివృద్ధి  (మార్చి 30 నుంచి ఏప్రిల్‌ 4) 
2వ వారం – ఆరోగ్య రంగం (ఏప్రిల్‌ 6 నుంచి 11) 
3వ వారం – అరైవ్‌–అలైవ్‌ (ఏప్రిల్‌13 నుంచి 18) 
4వ వారం – సంక్షేమం  (ఏప్రిల్‌ 20 నుంచి 25) 
5వ వారం – పిల్లల భద్రత, డ్రగ్స్‌  అడ్డుకట్ట (ఏప్రిల్‌ 27 నుంచి మే2) 
6వ వారం – రైతు సంక్షేమం (మే 4 నుంచి 9) 
7వ వారం – విద్య (మే 11 నుంచి 16) 
8వ వారం – యువత, క్రీడలు (మే 18 నుంచి 23) 
9వ వారం – మహిళా సంక్షేమం (మే 25 నుంచి 30) 
10వ వారం – పర్యావరణం  (జూన్‌ 1 నుంచి 6)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement