ఘనంగా భట్టి తనయుని వివాహం | The wedding of Mallu Bhatti Vikramarka son Surya Vikramaditya and sakshi | Sakshi
Sakshi News home page

ఘనంగా భట్టి తనయుని వివాహం

Mar 6 2026 4:08 AM | Updated on Mar 6 2026 4:08 AM

The wedding of Mallu Bhatti Vikramarka son Surya Vikramaditya and sakshi

సాక్షి, హైదరాబాద్‌ : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కుమారుడు సూర్య విక్రమాదిత్య–సాక్షిల వివాహం శంషాబాద్‌ జీఎంఆర్‌ ఏరీనాలో గురువారం ఘనంగా జరిగింది, వధూవరులను ఆశీర్వదించడానికి గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో సహా పలువురు సీనియర్‌ రాజకీయ నాయకులు, సినీ తారలు వచ్చారు. వారందరినీ డిప్యూటీ సీఎం ఆప్యాయంగా పలకరించారు. 

వివాహ వేడుకకు హాజరైనవారిలో కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్‌రావు, గంగుల కమలాకర్, మల్లారెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎంపీ సంతోశ్‌కుమార్, మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, సినీ ప్రముఖుల్లో చిరంజీవి, నాగార్జున, శ్రీకాంత్, తనికెళ్ల భరణి, పలువురు పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ సీనియర్‌ అధికారులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement