కీలక పోస్టింగ్‌లన్నీ ఇన్‌చార్జ్‌లతోనే | Retired IPS officers as in-charges in Telangana Police department | Sakshi
Sakshi News home page

కీలక పోస్టింగ్‌లన్నీ ఇన్‌చార్జ్‌లతోనే

Mar 6 2026 1:50 AM | Updated on Mar 6 2026 1:50 AM

Retired IPS officers as in-charges in Telangana Police department

మరికొన్నింటికి ఇన్‌చార్జ్‌లుగా రిటైర్డ్‌ ఐపీఎస్‌లు  

సీఐడీ, ఏసీబీ, ఉమెన్‌ సేఫ్టీ వింగ్‌ చీఫ్‌గా చారుసిన్హా  

సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో, విజిలెన్స్, ఎఫ్‌ఎస్‌ఎల్‌ డైరెక్టర్‌గా శిఖాగోయల్‌ 

డీఎస్‌ చౌహాన్‌కు అడిషనల్‌ డీజీ పర్సనల్‌తోపాటు మల్టీజోన్‌ ఐజీగా బాధ్యతలు  

ఈగల్‌ డైరెక్టర్‌గా రిటైర్డ్‌ ఐపీఎస్‌ సందీప్‌ శాండిల్యా, ఐఎస్‌డబ్ల్యూ ఓఎస్డీగా కమలాసన్‌రెడ్డి... ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నది 83 మంది ఐపీఎస్‌లే... 

కోటా 105కు పెంచాలని ఇటీవల కేంద్ర హోంశాఖను కోరిన సీఎం  

సాక్షి, హైదరాబాద్‌: పోలీస్‌శాఖలోని కీలక పోస్టులను ఇన్‌చార్జ్‌లతో నెట్టుకొస్తున్నారు. కొందరు అధికారులు రెండు అంతకంటే ఎక్కువ విభాగాల బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇలా ఇన్‌చార్జ్‌ బాధ్యతల్లో ఒకరు కాదు..ఇద్దరు కాదు..ఏకంగా 14 మంది ఐపీఎస్‌లు కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి ఐపీఎస్‌ అధికారుల కేటాయింపు కోటాను పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 83 మంది ఐపీఎస్‌లు ఉన్నారని, ఆ సంఖ్యను 105కు పెంచాలన్నారు.  

పెరుగుతున్న పనిభారం  
నిరంతర పర్యవేక్షణ అవసరమయ్యే కీలక శాఖలకు ఉండే అధికారులకు ఇతర విభా గాల బాధ్యతలు అప్పగించడంతో వారిపై పనిభారం పెరుగుతోందన్న భావన వ్యక్తమవుతోంది. కొందరు ఐపీఎస్‌ అధికారుల వద్దే అత్యంత కీలక శాఖలతోపాటు ఇతర విభాగాలు ఉండడంతో పనిభారంతోపాటు పర్యవేక్షణ కొరవడుతుందన్న వాదనా వినిపిస్తోంది. తెలంగాణ పోలీస్‌శాఖ అధికారిక వె బ్‌సైట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం..ప లు విభాగాలకు ఇన్‌చార్జ్‌లుగా కొనసాగుతు న్న ఐపీఎస్‌ అధికారులు వివరాలు చూస్తే..  

బి.శివధర్‌రెడ్డి డీజీపీ కోఆర్డినేషన్, హెడ్‌ఆఫ్‌ పోలీస్‌ ఫోర్స్‌గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతల్లో కొనసాగుతున్నారు.  
⇒  డా.సౌమ్యా మిశ్రా జైళ్ల శాఖ డీజీ, ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ విభాగ కమిషనర్‌గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.  
⇒ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ గా ఉన్న శిఖాగోయల్‌కు టీజీ సైబర్‌ సె క్యూరిటీ బ్యూరో డైరెక్టర్‌గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు, టీజీఎఫ్‌ఎస్‌ఎల్‌ ఇ న్‌చార్జ్‌ డైరెక్టర్‌గా కూడా పనిచేస్తున్నారు.  

⇒  మరికొన్ని కీలక విభాగాలు చారుసిన్హా పర్యవేక్షిస్తున్నారు. సీఐడీ అడిషనల్‌ డీజీతోపాటు మహిళా భద్రత విభాగం, భరోసా అడిషనల్‌ డీజీగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు, ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతల్లోనూ చారుసిన్హా కొనసాగుతున్నారు.  
⇒  మరో సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి వీవీ శ్రీనివాసరావుకు అడిషనల్‌ డైరెక్టర్‌ టెక్నికల్‌ సరీ్వసెస్, టీజీఎల్‌పీఆర్‌బీ చైర్మన్‌గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు, ఇన్‌చార్జ్‌ అడిషనల్‌ డీజీ ట్రైనింగ్‌గా బాధ్యతలు అప్పగించారు.  

⇒  అడిషనల్‌ డీజీ ఆర్గనైజేషన్, హోంగార్డ్స్, అడిషనల్‌ డీజీ స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతల్లో స్వాతిలక్రా ఉండగా, శాంతిభద్రతల అడిషనల్‌ డీజీ మహేశ్‌ భగవత్‌కు అడిషనల్‌ డీజీ లీగల్‌గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు, టీజీ పిక్స్‌ ఇన్‌చార్జ్‌ ఎండీగా సైతం బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.  
⇒  అడిషనల్‌ డీజీ పర్సనల్, మల్టీజోన్‌–2 అడిషనల్‌ డీజీగా దేవేంద్రసింగ్‌ చౌహాన్‌ పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.  
⇒  సంజయ్‌కుమార్‌ జైన్‌ అడిషనల్‌ డీజీ తెలంగాణ బెటాలియన్స్, పీటీఓ హైదరాబాద్‌ ఇన్‌చార్జ్‌గా, షానవాజ్‌ ఖాసిం డ్రగ్స్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డైరెక్టర్, ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌శాఖ డైరెక్టర్‌గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతల్లో కొనసాగుతున్నారు.  

⇒  ఎం శ్రీనివాసులు అడిషనల్‌ కమిషనర్‌ క్రైం హైదరాబాద్‌ సిటీ, డిటెక్షన్‌ డిపార్ట్‌ మెంట్‌ (డీడీ) ఇన్‌చార్జ్‌ డీసీపీగా, తఫ్సీర్‌ ఇక్బాల్‌ హైదరాబాద్‌ సిటీ జాయింట్‌ కమిషనర్‌ శాంతిభద్రతలు, హైదరాబాద్‌ సిటీ జాయింట్‌ సీపీ అడ్మిన్‌గా ఇన్‌చార్జ్‌గా, ఎల్‌ఎస్‌ చౌహాన్‌ డీఐజీ జోగుళాంబ జోన్, డీఐజీ చారి్మనార్‌ జోన్‌గా, భాస్కరన్‌ ఎస్పీ సీఐ సెల్, ఇంటెలిజెన్స్‌ ఇన్‌చార్జ్‌ ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.  

⇒  ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న ఈగల్‌ (గతంలో టీజీ యాంటీ నార్కో టిక్స్‌ బ్యూరో)కు రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి సందీప్‌ శాండిల్య డైరెక్టర్‌గా ఉండగా, మరో రిటైర్డ్‌ ఐపీఎస్‌ వీబీ కమలాసన్‌రెడ్డి ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌ ఓఎస్డీ, టీజీఐసీసీసీ డైరెక్టర్‌గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతల్లో, ఇంటెలిజెన్స్‌ ఓఎస్డీగా వి.శివకుమార్‌ పనిచేస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement