తెలంగాణ నూతన గవర్నర్‌గా శివ ప్రతాప్‌ శుక్లా | Shiva Pratap Shukla as the New Governor of Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణ నూతన గవర్నర్‌గా శివ ప్రతాప్‌ శుక్లా

Mar 6 2026 1:18 AM | Updated on Mar 6 2026 5:22 AM

Shiva Pratap Shukla as the New Governor of Telangana

మహారాష్ట్రకు ప్రస్తుత గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ బదిలీ 

దేశవ్యాప్తంగా పలువురు గవర్నర్లు, ఎల్‌జీల మార్పులు  

ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్‌గా శివప్రతాప్‌ శుక్లా (73) నియమితులయ్యారు. ప్రస్తుతం హిమాచల్‌ప్ర దేశ్‌ గవర్నర్‌గా ఉన్న ఆయన్ను తెలంగాణకు బదిలీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన జిష్ణుదేవ్‌ వర్మను పొరుగున ఉన్న మహారాష్ట్రకు బదిలీ చేసింది. తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల గవర్నర్లు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్‌ గవర్నర్ల (ఎల్‌జీ)ను మారుస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గురువారం ఉత్తర్వులు జారీ చేసినట్లు రాష్ట్రపతి భవన్‌ ఓ ప్రకటన విడుదల చేసింది.

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పాలనాపరమైన మార్పులకు కేంద్రం శ్రీకారం చుట్టింది. ఒకేసారి పెద్ద సంఖ్యలో గవర్నర్లను, లెఫ్టినెంట్‌ గవర్నర్లను మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పరిపాలనా అనుభవం ఉన్న పలువురిని ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయగా, మరికొందరికి కొత్తగా అవకాశం కలి్పంచింది. కేంద్రపాలిత ప్రాంతాల్లో పనిచేస్తున్న లెఫ్టినెంట్‌ గవర్నర్లకు సైతం స్థానచలనం కలిగింది. లద్దాఖ్‌ ఎల్‌జీకి ప్రమోషన్‌ ఇచ్చి రాష్ట్ర గవర్నర్‌గా పంపడం గమనార్హం. కాగా, పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ ఆనందబోస్‌ తన పదవికి రాజీనామా చేయగా దాన్ని రాష్ట్రపతి ఆమోదించారు. ఇప్పటివరకు తమిళనాడు గవర్నర్‌గా ఉన్న ఆర్‌.ఎన్‌. రవిని బెంగాల్‌ గవర్నర్‌గా బదిలీ చేశారు.

కొత్త నియామకాలు, బదిలీలు..
 తెలంగాణ: శివ ప్రతాప్‌ శుక్లా (హిమాచల్‌ప్రదేశ్‌ నుంచి బదిలీ) 
  మహారాష్ట్ర: జిష్ణుదేవ్‌ వర్మ (తెలంగాణ నుంచి బదిలీ) 
 పశ్చిమ బెంగాల్‌: ఆర్‌.ఎన్‌. రవి (తమిళనాడు నుంచి బదిలీ) 
 బిహార్‌: లెఫ్టినెంట్‌జనరల్‌ (రిటైర్డ్‌)    సయ్యద్‌ అతా హస్నైన్‌ 

నాగాలాండ్‌: నంద్‌ కిశోర్‌ యాదవ్‌ 
హిమాచల్‌ ప్రదేశ్‌: కవీందర్‌ గుప్తా (లద్దాఖ్‌ ఎల్‌జీకి ప్రమోషన్‌) 
తమిళనాడు: రాజేంద్ర విశ్వనాథ్‌ అర్లేకర్‌     (ప్రస్తుత కేరళ గవర్నర్‌కు తమిళనాడు అదనపు బాధ్యతలు) 
లద్దాఖ్‌ ఎల్‌జీ: వినయ్‌ కుమార్‌ సక్సేనా (ఢిల్లీ నుంచి బదిలీ) 
 ఢిల్లీ ఎల్‌జీ: తరణ్‌జీత్‌ సింగ్‌ సంధూ 

Advertisement
 
Advertisement
Advertisement