
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటరు ఎడమచెయ్యి చూపుడు వేలుపై..
పంచాయతీ ఎన్నికల్లో మధ్యవేలుపై చుక్క వేయాలని ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ఈనెల 23, 27 తేదీల్లో (రెండుదశల్లో) ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఆ తర్వాత గ్రామపంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఓటింగ్ సందర్భంగా వేలిపై సిరా చుక్క వేసే విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) స్పష్టతను ఇచి్చంది. ఈ నెల 23న తొలిదశ మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో భాగంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఓటింగ్ సందర్భంగా ఓటర్ ఎడమచెయ్యి చూపుడు వేలుపై వేసిన ఓటుకు గుర్తుగా సిరా చుక్క వేయాలని ఎన్నికల అధికారులకు తెలిపింది.
ఆ తర్వాత ఈ నెల 31, నవంబర్ 4, 8 తేదీల్లో జరగనున్న మూడుదశల గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా ఓటరు మధ్యవేలుపై సిరాచుక్క వేయాలని పేర్కొంది. ఎస్‌ఈసీ కార్యదర్శి మంద మకరందు ఈ మేరకు ఓ సర్క్యులర్ ద్వారా జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, అదనపు కలెక్టర్లు (స్థానికసంస్థలు), జెడ్పీ సీఈవోలు, డీపీవోలు, ఎంపీడీవోలు, రిటరి్నంగ్ అధికారులకు సమాచారం పంపించారు.