వివరణ ఇవ్వాలంటూ నోటీసు జారీ చేసిన ఎన్నికల సంఘం
పట్నా/కోల్‌కతా: జన సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంతి కిశోర్‌కు రెండుచోట్ల ఓటు హక్కు ఉన్నట్లు తేలింది. సొంత రాష్ట్రం బిహార్‌తోపాటు పశ్చిమ బెంగాల్‌లోనూ ఆయనకు ఓటు హక్కు ఉందని ఎన్నికల సంఘం గుర్తించింది. దీనిపై మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ ప్రశాంత్ కిశోర్‌కు మంగళవారం బిహార్ రాష్ట్రం రోహ్‌తస్‌లోని జిల్లా ఎన్నికల కార్యాలయం నోటీసు జారీ చేసింది. రెండుచోట్ల ఓటు హక్కు ఉండడం నిబంధనలకు విరుద్ధమే. ప్రశాంత్ కిశోర్‌కు బిహార్‌లోని కార్గాహర్ అసెంబ్లీ స్థానంలో ఓటు ఉంది. అలాగే పశి్చమ బెంగాల్‌లోని భవానీపూర్ అసెంబ్లీ స్థానం పరిధిలో 121, కాళీఘాట్ రోడ్ చిరునామాతో మరో ఓటు ఉంది.
ఇది అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యా లయం చిరు నామా కావడం గమనార్హం. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బెంగాల్‌లో 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంత్ కిశోర్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్తగా సేవలందించారు. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 31 ప్రకారం ఒక్కరికి ఒక ఓటే ఉండాలి. రెండు చోట్ల ఓటు హక్కు ఉండడం చట్టవిరుద్ధం. బెంగాల్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కావడం కోసమే ప్రశాంత్ కిశోర్ అక్కడ ఓటరుగా పేరు నమోదు చేసుకున్నట్లు జేడీ(యూ) ఎమ్మెల్సీ, అధికార ప్రతినిధి నీరజ్ కుమార్ అనుమానం వ్యక్తంచేశారు.


