Bihar: మూడు లక్షల ఓటర్లకు ఈసీ నోటీసులు | Bihar Voter List Revision: Over 3 Lakh Receive EC Notices Over Citizenship Doubts | Sakshi
Sakshi News home page

Bihar: మూడు లక్షల ఓటర్లకు ఈసీ నోటీసులు

Aug 29 2025 12:54 PM | Updated on Aug 29 2025 1:08 PM

Bihar sir Notices Issued to Over 3 lakh People

పట్నా: బీహార్ ఓటర్ల జాబితాపై కొనసాగుతున్న ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్‌) మరో మలుపు తీసుకుంది. తాజాగా భారత ఎన్నికల కమిషన్‌(ఈసీఐ) బీహార్‌లో ఉంటున్న మూడు లక్షల మంది ఓటర్లకు నోటీసులు జారీ చేసింది. వీరు బంగ్లాదేశ్, నేపాల్, ఆఫ్ఘనిస్తాన్‌కు చెందినవారిగా అనుమానిస్తూ  ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (ఈఆర్‌ఓ)నోటీసులను పంపారు.

రాష్ట్రంలో కొన్ని లక్షల మంది ఓటరు సవరణల కోసం సమర్పించిన పత్రాలలో  వ్యత్యాసాలు కనిపించిన దరిమిలా వారికి ఈసీ నోటీసులు జారీ చేసింది. మొత్తం మూడు లక్షలమంది ఈ తరహా నోటీసులు అందుకున్నారు. వారి పత్రాలలో వ్యత్యాసాలు ఎందుకు ఉన్నాయో వివరించేందుకు వారికి ఈసీఐ ఏడు రోజులు గడువు ఇచ్చింది. ‘మూడు లక్షల మంది ఎస్‌ఐఆర్‌ ప్రకారం ముసాయిదా ఓటర్ల జాబితాలో తమ పేరు నమోదు చేసుకున్నారు. అయితే వారి పత్రాల పరిశీలనలో వ్యత్యాసాలు కనిపించాయి. దీంతో క్షేత్ర స్థాయిలో తనిఖీలు జరిగాయి. ఫలితంగా వీరు బంగ్లాదేశ్, మయన్మార్ లేదా నేపాల్ నుండి వచ్చి ఉండవచ్చనే అనుమానాలు నెలకొన్నాయని అని ఒక అధికారి  మీడియాకు తెలిపారు.

ఈసీ నోటీసులు పంపి, వివరణ కోరిన ఓటర్లలో  అత్యధికులు తూర్పు చంపారణ్‌, పశ్చిమ చంపారణ్‌, మధుబని, కిషన్‌గంజ్, పూర్ణియా, కతిహార్, అరారియా సుపాల్ జిల్లాలకు చెందినవారున్నారు. ఈసీఐ భారీ సంఖ్యలో ఓటర్లకు నోటీసులు జారీ చేసిన దరిమిలా, బీజేపీ దీనిపై స్పందిస్తూ, ఈ ప్రాంతం బంగ్లాదేశీయులు, రోహింగ్యాల అక్రమ వలసలకు కేంద్రంగా ఉందని ఆరోపించింది. కాగా ఎన్నికల జాబితాపై కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్‌)పై వివిధ రాజకీయ పార్టీలు అభ్యంతరాలను వ్యక్తం చేశాయి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement