కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్) ప్రక్రి య చేపట్టడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో తొలుత ఈ ప్రక్రియను పూర్తిచేయాలని నిర్ణయించినట్లు అధికార వర్గాలు శనివారం వెల్లడించాయి. అస్సాం, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, పశ్చిమ బెంగాల్‌లో 2026లో ఎన్నికలు జరగబోతున్నాయి.
తొలి దశలో 10 నుంచి 15 రాష్ట్రాల్లో ఎస్‌ఐఆర్ నిర్వహించే అవకాశం ఉంది. తొలి దశ ఎస్‌ఐఆర్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను వచ్చే వారమే ప్రకటించనున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ఎస్‌ఐఆర్‌ను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న లేదా జరగబోయే రాష్ట్రాల్లో ఎస్‌ఐఆర్‌ను ఇప్పుడే ప్రారంభించవద్దని నిర్ణయించింది. ఎందుకంటే ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బ ంది స్థానిక సంస్థల ఎన్నికల్లోనే తలమునకలై ఉంటారు.
ఎస్‌ఐఆర్ విధుల్లో వారు పాల్గొనే పరిస్థితి ఉండదు కాబట్టి తదుపరి దశలోనే ఈ ప్రక్రియ చేపడతారు. బిహార్‌లో ఇటీవల ఎస్‌ఐఆర్‌ను పూర్తిచేసిన సంగతి తెలిసిందే. సమగ్ర సవరణ తర్వాత 7.42 కోట్ల మంది ఓటర్లతో తుది జాబితాను ఎన్నికల సంఘం ప్రచురించింది. అనర్హులైన 3.66 లక్షల మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించింది. ఓటర్లు మరణించడం, శాశ్వతంగా వలస వెళ్లడం, డూప్లికేట్ ఎంట్రీ తదితర కారణాలతో ఈ పేర్లను తొలగించినట్లు ఎన్నికల సంఘం తేలి్చచెప్పింది. ఇదిలా ఉండగా, పశి్చమ బెంగాల్‌లో నవంబర్ 1 నుంచి ఎస్‌ఐఆర్ ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది.


