టీసీఎస్ బాస్.. వేతనం రూ.28 కోట్లు! | TCS CEO K Krithivasan Earns Rs 28 Crore in FY26 | Sakshi
Sakshi News home page

టీసీఎస్ బాస్.. వేతనం రూ.28 కోట్లు!

May 16 2026 6:43 PM | Updated on May 16 2026 7:14 PM

TCS CEO K Krithivasan Earns Rs 28 Crore in FY26

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ కె. కృతివాసన్ 2025-26లో మొత్తం రూ. 28 కోట్ల వేతనం అందుకున్నారని. ఇది గత ఏడాదితో పోలిస్తే 6.3 శాతం అధికమని కంపెనీ తాజా వార్షిక నివేదిక వెల్లడించింది.

అయితే.. టాటా గ్రూప్ అండ్ టీసీఎస్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ఐటీ దిగ్గజం నుంచి ఎలాంటి కమీషన్ తీసుకోకుండా, మొత్తం ఆర్థిక సంవత్సరానికి సిట్టింగ్ ఫీజుగా కేవలం రూ. 4.2 లక్షలు మాత్రమే తీసుకున్నారు. ఈ విషయాన్ని కూడా సంస్థ తన వార్షిక నివేదిక తెలిపింది.

కృతివాసన్ ప్యాకేజీలో ప్రాథమిక వేతనం రూ. 1.67 కోట్లు కాగా.. ఇతర అలవెన్సులు, సౌకర్యాలు, ప్రయోజనాలు రూ.1.43 కోట్లు. పర్ఫామెన్స్ బేస్డ్ కమీషన్ కింద రూ.25 కోట్లు ఉన్నాయి. సంస్థ వార్షిక నివేదిక ప్రకారం, సీఈఓ వేతనం టీసీఎస్ ఉద్యోగుల మధ్యస్థ పారితోషికం కంటే 332.8 రెట్లు ఎక్కువ. అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల మధ్యస్థ వేతనం 5.1 శాతం పెరిగిందని నివేదిక పేర్కొంది.

భారతదేశంలో జూనియర్, మధ్య స్థాయి ఉద్యోగులకు సగటు వార్షిక జీతాల పెరుగుదల 4.5 శాతం నుంచి 7 శాతం మధ్య ఉండగా, అత్యుత్తమ పనితీరు కనబరిచిన వారికి రెండంకెల పెంపులు లభించాయి. టీసీఎస్ తన మార్చి త్రైమాసిక నికర లాభంలో 12.22 శాతం వృద్ధిని నమోదు చేసి, రూ. 13,718 కోట్లను ఆర్జించింది.

ఇదీ చదవండి: 600 మీటర్ల దూరం.. అందుకే జాబ్ రిజెక్ట్!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement