స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలకు బ్రేక్‌: కారణం ఇదే! | Rising Memory Chip Prices Set To Slow India's Smartphone Sales By 10-12% In 2026, Says CMR Report | Sakshi
Sakshi News home page

స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలకు బ్రేక్‌: కారణం ఇదే!

May 7 2026 4:32 PM | Updated on May 7 2026 5:15 PM

Rising Memory Chip Prices Set to Slow Smartphone Sales in India

మెమొరీ చిప్‌ల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో దేశీయంగా స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు ఈ ఏడాది 10–12 శాతం మేర క్షీణించే అవకాశాలు ఉన్నాయని మార్కెట్‌ రీసెర్చ్‌ సంస్థ సైబర్‌మీడియా రీసెర్చ్‌ (సీఎంఆర్‌) ఒక నివేదికలో తెలిపింది.

ధరలపరమైన ఒత్తిళ్లు, డిమాండ్‌ నెమ్మదించడం ఇందుకు కారణమని పేర్కొంది. ‘డీఆర్‌ఏఎం, ఎన్‌ఏఎన్‌డీ ధరలు పెరగడంతో డివైజ్‌ల ధర పెరిగింది. దీనితో మాస్‌ సెగ్మెంట్‌కి సంబంధించిన ఉత్పత్తులు భారంగా మారాయి. వాటితో పోలిస్తే ప్రీమియం సెగ్మెంట్‌పై ప్రభావం తక్కువగా ఉంది‘ అని సీఎంఆర్‌ వీపీ ప్రభు రామ్‌ తెలిపారు. నివేదిక ప్రకారం ఈ ఏడాది తొలి త్రైమాసికంలో షిప్‌మెంట్లు రెండు శాతం తగ్గాయి. రిపోర్ట్‌లో మరిన్ని విశేషాలు..

  • ట్రాన్షన్, వన్‌ప్లస్‌ అమ్మకాలు వరుసగా 30 శాతం, 28 శాతం క్షీణించాయి.

  • టాప్‌ 5 బ్రాండ్లలో వివో, ఒప్పో అమ్మకాలు వరుసగా 1 శాతం, 12 శాతం పెరిగాయి. శాంసంగ్, షావోమీ, రియల్‌మీ విక్రయాలు వరుసగా 8%, 7%, 12 శాతం క్షీణించాయి.

  • చైనా స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌ వివో 21 శాతం వాటాతో స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో శాంసంగ్‌ (17 శాతం), ఒప్పో (14 శాతం), షావోమీ (12 శాతం), రియల్‌మీ (10 శాతం) ఉన్నాయి.

  • ఐఫోన్‌ 16 దన్నుతో యాపిల్‌ షిప్‌మెంట్లు 6 శాతం పెరగ్గా, సంస్థ మార్కెట్‌ వాటా 9 శాతంగా నమోదైంది.

  • ఫీచర్‌ ఫోన్‌ సెగ్మెంట్లో చైనా బ్రాండ్‌ ఐటెల్‌ మొబైల్‌ అమ్మకాలు 26 శాతం పడిపోయినప్పటికీ 35 శాతం మార్కెట్‌ వాటాతో అగ్రస్థానంలో కొనసాగింది. ఆ తర్వాత స్థానాల్లో లావా (34 శాతం వాటా), హెచ్‌ఎండీ (18 శాతం వాటా) ఉన్నాయి.

  • చిప్‌సెట్స్‌ తయారీ సంస్థల్లో భారత్‌లో మీడియాటెక్‌ 48 శాతం మార్కెట్‌ వాటాను దక్కించుకుంది. ప్రీమియం సెగ్మెంట్‌లో (రూ. 25,000 పైబడిన ఫోన్లు) క్వాల్‌కామ్‌ 36 శాతం వాటాను దక్కించుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement