ట్రైన్లలో ప్రయాణించే చాలామందికి.. రైల్వే వ్యవస్థ గురించి బహుశా తెలిసి ఉండక పోవచ్చు. ట్రైన్‌పై ఉండే బోర్డుల దగ్గర నుంచి నెంబర్ల వరకు అనేక విషయాలు వెనుక ఒక సరైన అర్థం ఉంటుంది. అయితే టికెట్స్ మీద కూడా మీరు గమనించినట్లయితే.. ఇక్కడ కూడా H1, H2, A1, B1 అని ఉండటం కనిపిస్తుంది. ఈ కథనంలో వీటి గురించి తెలుసుకుందాం.
టికెట్ మీద H1, H2అని ఉంటే.. అది ఏసీ ఫస్ట్ క్లాస్ అని అర్థం. దూర ప్రాంతాలకు వెళ్లే ట్రైన్ కోచ్ మీద ఇలాంటి గుర్తు ఉంటుంది. ఇందులో చాలా సదుపాయాలు కూడా అందుబాటులో ఉంటాయి. అయితే ఈ టికెట్ ధర విమానం టికెట్ ధరకు సమానంగా ఉంటుంది. భోజన సదుపాయం, ఛార్జింగ్ పాయింట్లు, బెల్ సిస్టం, బెడ్ షీట్స్ మొదలవునవి ఉంటాయి. H1, H2 అంటే రెండు కోచ్‌లు అన్నమాట. ఫస్ట్ క్లాస్ ఏసీ కోచుల్లో కూపే, క్యాబిన్ అనేవి ఉంటాయి. కూపే అంటే ఇద్దరు ప్రయాణికులకు ప్రత్యేకంగా కంపార్ల్‌మెంట్ ఉంటుంది. ఇక క్యాబిన్ అంటే నలుగురు ప్రయాణికులు ఉంటారు.
మీ టికెట్ మీద A1, B1 అని ఉంటే.. టూ టైర్ ఏసీ కోచ్‌లని అర్థం. ఇందులో కర్టెన్స్ మాత్రమే ఉంటాయి. ప్రతి సెక్షన్‌లో 6 బెర్త్‌ల వరకు ఉంటాయి. ఇక B1, B2, B3 అని ఉంటే అవి ఏసీ త్రీ టైర్ కోచ్‌లని అర్థం. S1, S2 అంటే సాధారణ స్లీపర్ కోచ్‌లన్నమాట. CC అంటే ఏసీ చైర్ కార్. ఏసీ సౌకర్యం ఉంటుంది, కూర్చుని ప్రయాణించాలి.
ఇదీ చదవండి: భారీగా తగ్గిన బంగారం ధరలు: కొత్త రేట్లు ఇవే!


