4 వేలకు పైగా టెకీలను తొలగించనున్న కాగ్నిజెంట్‌ | Cognizant to cut over 4000 jobs as Project Leap shifts focus to AI | Sakshi
Sakshi News home page

4 వేలకు పైగా టెకీలను తొలగించనున్న కాగ్నిజెంట్‌

May 1 2026 12:47 PM | Updated on May 1 2026 12:53 PM

Cognizant to cut over 4000 jobs as Project Leap shifts focus to AI

ప్రముఖ ఐటీ సేవల సంస్థ  కాగ్నిజెంట్ టెక్నాలజీ  కార్మికుల దినోత్సవం రోజు చేదు వార్త తెలిపింది. తన ఉద్యోగులలో సుమారు 1శాతం మందిని తొలగించాలని యోచిస్తోంది. దీనివల్ల 4,000కు పైగా ఉద్యోగాలపై ప్రభావం పడుతుంది.  AI , డిజిటల్ ఆఫరింగ్‌లపై ఖర్చును పెంచుతూనే, కంపెనీ తన శ్రామిక శక్తిని పునర్నిర్మించాలని చూస్తున్న తరుణంలో ప్రాజెక్ట్ లీప్ ద్వారా ప్రస్తుత పునర్నిర్మాణం జరుగుతోంది.


లైవ్ మింట్ నివేదిక ప్రకారం, తగ్గుతున్న డిమాండ్, ఆటోమేషన్ వైపు మొగ్గు చూపడం వృద్ధిపై భారం మోపుతున్న తరుణంలో ఈ నిర్ణయం వెలుడుతుంది. ముఖ్యంగా  కంపెనీ తన పూర్తి-సంవత్సర అంచనాలను తగ్గించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది.

కంపెనీ  ప్రకటించిన 'ప్రాజెక్ట్ లీప్'లో  భాగంగా ఏఐ (AI), సమీకృత డిజిటల్ సేవలు మరియు ఉద్యోగుల నైపుణ్యాభివృద్ధిపై అధిక పెట్టుబడి పెట్టనున్నారు. ఈ కార్యక్రమానికి 230 మిలియన్ల  డాలర్లనుంచి  320 మిలియన్ల డాలర్ల వరకు ఖర్చు అవుతుందని, ఇందులో ఉద్యోగుల తొలగింపు , ఇతర సిబ్బంది సంబంధిత ఖర్చుల కోసం200 మిలియన్ల డాలర్లనుంచి  270 మిలియన్ల డాలర్ల వరకు ఉంటాయని, అదే సమయంలో ఈ ఏడాది 300 మిలియన్ల డాలర్ల వరకు ఆదా అవుతుందని కాగ్నిజెంట్ తెలిపింది.

ఈ పునర్వ్యవస్థీకరణ వల్ల ఎంత మంది ఉద్యోగులు ప్రభావితమవుతారో కాగ్నిజెంట్ స్పష్టంగా చెప్పలేదు. అయితే, ఆదాయాల ప్రకటన తర్వాత జరిగిన విశ్లేషకుల సమావేశంలో యాజమాన్యం మాట్లాడుతూ, ఈ ఏడాది 20,000 మందికి పైగా ఫ్రెషర్లు చేరతారని, దీనిని బట్టి ఈ కోతలు మధ్య-స్థాయి ఉద్యోగాలపై కేంద్రీకృతమయ్యే అవకాశం ఉందని సూచించింది.

ఇదీ చదవండి: 76 ఏళ్ల వయసులో జోరుగా ట్రైసెప్ డిప్స్ : ఈ యాక్టర్‌కి ఫ్యాన్స్‌ ఫిదా!

ఉద్యోగాల కోత ఉన్నప్పటికీ, మార్చి 2026 చివరి నాటికి కంపెనీ ఉద్యోగుల సంఖ్య 6,000 పెరిగి 357,600కు చేరుకుంది.  2023 జనవరిలో బాధ్యతలు స్వీకరించిన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎస్. రవి కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఉద్యోగాల కోతలలో ఇది రెండవ విడత. ఆయన బాధ్యతలు స్వీకరించిన నాలుగు నెలల తర్వాత, మే 2023లో కాగ్నిజెంట్ నాన్-బిల్లబుల్ పాత్రలలో సుమారు 3,500 మంది ఉద్యోగులను తొలగించింది.  

ఇదీ చదవండి : నో లైఫ్‌ జాకెట్స్‌, పట్టించుకోలేదు : బోట్‌ విషాదంలో సంచలన ఆరోపణలు


 

Advertisement
 
Advertisement
Advertisement