నో లైఫ్‌ జాకెట్స్‌, పట్టించుకోలేదు : బోట్‌ విషాదంలో సంచలన ఆరోపణలు | Jabalpur boat tragedy: Storm ignored warnings, no life jackets | Sakshi
Sakshi News home page

నో లైఫ్‌ జాకెట్స్‌, పట్టించుకోలేదు : బోట్‌ విషాదంలో సంచలన ఆరోపణలు

May 1 2026 12:21 PM | Updated on May 1 2026 2:25 PM

Jabalpur boat tragedy: Storm ignored warnings, no life jackets

Jabalpur boat tragedy  మధ్యప్రదేశ్ పర్యాటక శాఖకు చెందిన ఒక క్రూయిజ్ బోట్‌  జబల్‌పూర్ సమీపంలోని నర్మదా నదిపై ఉన్న బార్గి డ్యామ్ (Bargi Dam బోల్తా పడిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే ఈ ఘటనలో  సంచలన విషయాలు వెలుగులోకి వచ్చింది.  సకాలంలో హెచ్చరికలను పాటించి, ప్రాథమిక భద్రతా చర్యలు తీసుకుని ఉంటే ఈ దుర్ఘటనజరిగి ఉండేది కాదన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ప్రమాదం కేవలం ప్రకృతి వైపరీత్యం వల్లనే కాకుండా, మానవ తప్పిదాల వల్ల కూడా జరిగిందని ప్రాణాలతో బయటపడిన వారు ఆరోపిస్తున్నారు.

ది టైమ్స్ ఆఫ్ ఇండియా'  కథన ప్రకారం  ఈ విషాదానికి కారణం కేవలం వాతావరణం మాత్రమే కాదు. వరుస వైఫల్యాలు ఉన్నాయని ప్రాణాలతో బయటపడినవారు ఆరోపించారు. వాతావరణం మారుతున్నట్లు కనిపిస్తున్నా, వెనక్కి వెళ్ళమని ప్రయాణికులు కోరినా ఆపరేటర్ పట్టించుకోలేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పడవ మునిగిపోవడం ప్రారంభమైన తర్వాతే సిబ్బంది లైఫ్ జాకెట్లు పంచారని ఒక బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రయాణం మొదలైనప్పుడు కనీస భద్రతా చర్యలు లేవని ఆయన ఆరోపించారు.

 కాగా సిబ్బందితో సహా సుమారు 43 మంది ప్రయాణికులతో వెళుతున్న ఈ పడవ, అకస్మాత్తుగా వచ్చిన భయంకరమైన తుఫాను మధ్య జబల్‌పూర్ సమీపంలోని నర్మదా నదిపై ఉన్న బర్గీ డ్యామ్ వద్ద లో బోల్తా పడింది. గురువారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో 60 నుండి 70 కిలోమీటర్ల  వేగంతో వీచిన అత్యంత తీవ్రమైన గాలులు, అల్లకల్లోల వాతావరణ పరిస్థితుల కారణంగానే పడవ అస్థిరపడి, అదుపు తప్పి బోల్తా పడిందని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తొమ్మిది మంది మరణించగా, పలువురు గల్లంతయ్యారు. ప్రమాదంపై సమగ్ర విచారణకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ. 4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.
 

ఇదీ చదవండి : 4 వేలకు పైగా టెకీలను తొలగించనున్న కాగ్నిజెంట్‌

 

Advertisement
 
Advertisement
Advertisement