ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌గా రోహిత్‌ జైన్‌ | Rohit Jain Appointed as RBI Deputy Governor | Sakshi
Sakshi News home page

ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌గా రోహిత్‌ జైన్‌

May 3 2026 7:36 AM | Updated on May 3 2026 7:41 AM

Rohit Jain Appointed as RBI Deputy Governor

ముంబై: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) డిప్యుటీ గవర్నర్‌ టి. రవి శంకర్‌ స్థానంలో రోహిత్‌ జైన్‌ నియమితులయ్యారు. ఆయన ఈ పదవిలో మూడేళ్ల పాటు కొనసాగుతారు. ఈ మేరకు సోమవారం కేంద్ర కేబినెట్‌ నియామక కమిటీ (ఏసీసీ) రోహిత్‌ జైన్‌ నియామకానికి ఆమోదం తెలిపింది.

ప్రస్తుతం జైన్‌ ఆర్‌బీఐలో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా సేవలందిస్తున్నారు. రవి శంకర్‌కు పొడిగించిన పదవీ కాలం శనివారంతో ముగిసింది. ఆయన స్థానంలో జైన్‌ మే 3వ తేదీ లేదా ఆ తర్వాత బాధ్యతలు స్వీకరిస్తారు. ఆర్‌బీఐ చట్టం–1934 ప్రకారం, కేంద్ర బ్యాంకుకు నలుగురు డిప్యూటీ గవర్నర్లు ఉండాలి.

వీరిలో ఇద్దరిని రిజర్వ్‌ బ్యాంక్‌ అంతర్గత అధికారుల నుంచి, ఒకరిని కమర్షియల్‌ బ్యాంకింగ్‌ రంగం నుంచి, మరొకరిని మానిటరీ పాలసీ విభాగానికి నేతృత్వం వహించేలా ఎంపిక చేస్తారు. ప్రస్తుతం ఆర్‌బీఐలో మరో ముగ్గురు డిప్యూటీ గవర్నర్లు ఎస్‌.సి. ముర్ము, పూనమ్‌ గుప్తా, స్వామినాథన్‌ జే తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement