ప్రపంచ కళా రంగంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన వెనిస్ బినాలే వేదికపై భారతీయ ప్రాభవం మరోసారి మెరవనుంది. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (ఎన్‌ఎంఏసీసీ) మధ్య కుదిరిన చారిత్రాత్మక భాగస్వామ్యంతో 61వ అంతర్జాతీయ కళా ప్రదర్శనలో ‘ఇండియా పెవిలియన్’ను ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్నారు. మన దేశ అద్భుతమైన కళా సంపదను, హస్తకళల వైవిధ్యాన్ని ప్రపంచ దేశాల ప్రతినిధుల ముందు ప్రదర్శించడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం.
సాంస్కృతిక రాయబారిగా..
కళలు, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణలో అగ్రగామిగా ఉన్న రిలయన్స్ ఫౌండేషన్ ఈ అంతర్జాతీయ వేదిక ద్వారా భారతీయ కళాకారులకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రతిష్టాత్మక ఒప్పందంపై కళా రంగ నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం ఒక ప్రదర్శన మాత్రమే కాదని, భారతీయ ఆత్మను అంతర్జాతీయ వేదికపై ఆవిష్కరించే ఒక సాంస్కృతిక విప్లవమని అభివర్ణిస్తున్నారు.
అభివృద్ధి చెందుతున్న సాంస్కృతిక సంభాషణ: ఇషా అంబానీ
61వ అంతర్జాతీయ కళా ప్రదర్శనలో భారత జాతీయ పెవిలియన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఇషా అంబానీ భారతదేశం, ప్రపంచ దేశాల మధ్య మారుతున్న సాంస్కృతిక సంబంధాలపై తన ఆలోచనలను పంచుకున్నారు. ఈ సందర్భంగా తన తల్లి నీతా అంబానీ దార్శనికతను కొనియాడారు. భారతదేశంలోని ఉత్తమమైన వాటిని ప్రపంచానికి పరిచయం చేయడం, ప్రపంచంలోని ఉత్తమ కళలను భారతీయులకు చేరువ చేయడమే ఎన్‌ఎంఏసీసీ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. భారతదేశాన్ని ఒక సొంత ఇల్లు అనే భావనతో పోల్చిన ఆమె వెనిస్, భారతదేశం మధ్య సుదీర్ఘమైన, అర్థవంతమైన సాంస్కృతిక సంభాషణ జరగాలని ఆకాంక్షించారు. ఈ ప్రయత్నం మన పూర్వీకులు గర్వపడేలా ఉండడంతోపాటు మన భవిష్యత్ తరాలకు ఒక గొప్ప వారసత్వంగా నిలవాలని ఆమె పేర్కొన్నారు.
Ms. Isha Ambani reflects on India’s evolving cultural dialogue with the world at the opening of the National Pavilion of India at the 61st International Art Exhibition – La Biennale di Venezia.
Representing the Nita Mukesh Ambani Cultural Centre, she acknowledged her mother… pic.twitter.com/u7u5Qkd4ha— Reliance Foundation (@ril_foundation) May 7, 2026
కళాకారులకు గ్లోబల్ విండో
ఈ భాగస్వామ్యం వల్ల భారతీయ గ్రామీణ హస్తకళాకారులు మొదలుకొని సమకాలీన కళాకారుల వరకు అందరికీ అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ గుర్తింపు లభించనుంది.


