భారతీయ సమాచార సాంకేతిక (ఐటీ) రంగ ముఖచిత్రాన్ని మార్చివేసిన దార్శనికుడు, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్.ఆర్.నారాయణమూర్తి. భారతీయ ఐటీ పరిశ్రమ పితామహుడుగా కీర్తించబడే ఆయన కేవలం ఒక పారిశ్రామికవేత్త మాత్రమే కాదు, లక్షలాది మంది యువతకు నైతిక విలువల పాఠాలు నేర్పిన గురువు. ‘సాధారణ జీవనం - ఉన్నత ఆలోచన’ అనే సిద్ధాంతాన్ని తూచతప్పకుండా పాటించే మూర్తి పద్మవిభూషణ్ వంటి అత్యున్నత పురస్కారాలతో దేశ గౌరవాన్ని ఇనుమడింపజేశారు. విజయం, నాయకత్వ లక్షణాలపై ఇటీవల ఆయన పంచుకున్న కొన్ని అంశాలను కింద తెలియజేశాం.
మూర్తి టాప్ కోట్స్
ఒక గొప్ప నాయకుడికి తన సమక్షంలో ఉన్న ప్రజలను మరింత సమర్థులుగా మార్చగలిగే సామర్థ్యం ఉండాలి.
అనుభవం నుంచి నేర్చుకోవడం సంక్లిష్టంగా ఉంటుంది. వైఫల్యం కంటే విజయం నుంచి నేర్చుకోవడం చాలా కష్టం. మనం విఫలమైతే కారణాల గురించి తప్పకుండా ఆలోచిస్తాం, కానీ విజయం మన గత చర్యలన్నింటినీ విచక్షణారహితంగా సరైనవని నమ్మేలా చేస్తుంది.
ఎక్కువ వాగ్దానం చేసి తక్కువ ఇవ్వడం కంటే, తక్కువ వాగ్దానం చేసి అంతకు మించి డెలివరీ చేయడం ఉత్తమం. ఇందుకోసం చట్టాలను ఉల్లంఘించాల్సిన అవసరం లేదు.
పురోగతి అనేది తరచుగా మనసు, మనస్తత్వం మధ్య ఉండే వ్యత్యాసానికి సమానం.
ఓడ షిప్‌యార్డ్‌లో ఉన్నప్పుడు చాలా సురక్షితంగా ఉంటుంది. కానీ వాటిని నిర్మించేది అక్కడే ఉండటానికి కాదు. సవాళ్లను ఎదుర్కొన్నప్పుడే ప్రయాణం సాగుతుంది.
మీ హోదా వల్ల మీరు స్టార్ అవ్వరు; మీరు కంపెనీకి ఎంత విలువను జోడిస్తున్నారనే దానిపైనే మీ స్టార్ హోదా ఆధారపడి ఉంటుంది.
మీరు ఎక్కడ మొదలుపెట్టారు అనేది ముఖ్యం కాదు. మీరు ఎలా, ఏమి నేర్చుకుంటున్నారు అనేదే ముఖ్యం. నేర్చుకునే నాణ్యత బాగుంటే మీ అభివృద్ధి గ్రాఫ్ వేగంగా పెరుగుతుంది.
విలువల పునాదిపై నిర్మించిన సామ్రాజ్యం ఎప్పటికీ కూలిపోదు.
ఇదీ చదవండి: సామాన్యుడిపై భారమా? దేశాభివృద్ధికి మార్గమా?


