ఒక ప్రీమియం.. జీవితాంతం ఆదాయం! | Aviva India Launches Aviva Secure Nest Annuity Plan to Support Diverse Retirement Needs | Sakshi
Sakshi News home page

Aviva India: ఒక ప్రీమియం.. జీవితాంతం ఆదాయం!

Apr 28 2026 9:09 PM | Updated on Apr 28 2026 9:18 PM

Aviva India Launches Aviva Secure Nest Annuity Plan to Support Diverse Retirement Needs

అవివా ఇండియా.. అవివా సెక్యూర్ నెస్ట్ యాన్యుటీ ప్లాన్‌ను ప్రారంభించింది. ఇది పదవీవిరమణ తర్వాత ఆర్థిక భద్రతను అందించేందుకు రూపొందించిన ఒక ప్రత్యేక పథకం. ఈ స్కీమ్ ద్వారా ఒకసారి మాత్రమే ప్రీమియం చెల్లించి.. జీవితాంతం నిరంతర ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఇది రిటైర్మెంట్ తరువాత ఆర్థిక స్థిరత్వాన్ని కోరుకునే వ్యక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

ఈ స్కీమ్ ప్రత్యేకత ఏమిటంటే.. 80 సంవత్సరాల వయస్సు వరకు ప్రవేశం లభిస్తుంది. అంటే, జీవితంలో ఏ దశలో ఉన్నవారైనా తమ భవిష్యత్తు కోసం ఈ పథకాన్ని ఎంచుకోవచ్చన్నమాట. దీనిలో వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా వివిధ యాన్యుటీ ఎంపికలు ఉన్నాయి. వీటిలో సింగిల్ లైఫ్, జాయింట్ లైఫ్ కవరేజ్ ఉన్నాయి.

అంతే కాకుండా.. అనువైన చెల్లింపు వ్యవధులతో హామీతో కూడిన జీవితకాల ఆదాయం, నామినీల వారసత్వాన్ని రక్షించడానికి కొనుగోలు ధర వాపసు వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఇది పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) నిబంధనలకు కూడా అనుగుణంగా ఉంది, అందువల్ల ఇది నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) చందాదారులకు ఒక సరైన ఎంపికగా నిలుస్తుంది.

Advertisement
 
Advertisement
Advertisement